భూభారతిలో భారీ అక్రమాలు.. రంగంలోకి లోకాయుక్త
భూభారతి రిజిస్ట్రేషన్ లలో భారీ అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. భూ భారతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టా లని అధికారులను ఆదేశించింది. భూభారతి పేరుతో జరుగుతున్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. సమగ్ర నివేదిక సమర్పిం చాలని సంబంధిత శాఖలను లోకాయుక్త ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్లకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే జనగామ జిల్లాలో కేవలం ఒక్కరోజే 10 చలా న్లకు సంబంధించిన రూ.8,55,577ను దుండగులు కాజేసి నట్లు విచారణ లో తేలింది. ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో వెంటనే చలాన్లపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో జనగామ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కుంభకోణంలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్లు చేసినట్లు గుర్తించారు. అతని పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు.భూభారతి కుంభకోణానికి సీసీఎల్ఏ సాంకేతిక సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.