మైనర్ బాలికపై గోవా లామేకర్ అత్యాచారం.. నా ఒళ్లంతా రక్తం, నగ్నంగా అతడు
posted on May 5, 2016 @ 6:22PM
గోవా మాజీ విద్యాశాఖ మంత్రి బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబుష్ మోన్సరేట్ నేపాలికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన బాధిత మైనర్ బాలిక.. అతను తనను ఓ బంగ్లాకు తీసుకెళ్లాడని.. అక్కడ తనకు మద్యం తాగించి అత్యాచారం జరిపాడని.. ఉదయం లేచి చూసేసరికి నేను నగ్నంగా ఉన్నాను.. రక్తంతో నేను తడిసిపోయి ఉన్నాను.. నా పక్కన ఆయన కూడా బట్టలు లేకుండా నగ్నంగా కూర్చోని ఉన్నాడని పోలీసులకు చెప్పింది. ఇంకా చెబుతూ.. తన సవతి తల్లే తనను అమ్మేసిందని తెలిపింది.
మరోవైపు ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై మానవ అక్రమ రవాణా, రేప్ అభియోగాలను మోపినట్టు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. నమోదైన అత్యాచారం కేసును క్రైం బ్రాంచికి తరలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.