పుట్టిన ప్రతి బిడ్డపై 20 వేల అప్పు.. కేసీఆర్ అప్పుల వల్లే
posted on Sep 18, 2015 @ 12:13PM
తెలంగాణ ప్రభుత్వంపై దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం లభించగా.. తెలంగాణకు మాత్రం పదమూడో స్థానం దక్కింది. ఇది ఏపీకి శుభ పరిణామం అయితే ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం చేదు వార్తనే. అయితే ఇప్పుడు మరో తెలంగాణ ప్రభుత్వం తీరు మరోసారి భయటపడింది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ రాష్ట్రానికి లోటు భారం ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మిగులు బడ్జెతో గుజరాత్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఆసంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆతరువాత తెలంగాణ ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ఎడా పెడా ఖర్చుచేసి ఆఖరికి మిగులు బడ్టెట్ ఉన్న రాష్ట్రం కాస్త నిధులు లేక అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తెలంగాణ పనితీరుపై చాలామంది విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసిన అప్పులకు గానూ ఆరాష్ట్రంలో పుడుతున్న ప్రతీ బిడ్డపై పుట్టుకతోనే రూ. 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. తీసుకున్న అప్పులను అధిక వడ్డీతో తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని.. దీనివల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి తెలిపారు.
మొత్తానికి దీనిని బట్టి కేసీఆర్ పాలనా విధానం ఎలా ఉందో ఈఫోరం బట్టే తెలుస్తోంది. ఇప్పటికే తన ఒంటెద్దు పోకడను మాని మేల్కోకపోతే రాష్ట్రం పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధిక ఖర్చులు మాని.. పక్క రాష్ట్రంతో పోల్చుకోకుండా తమ రాష్ట్ర పరిస్థితిని..తన ప్రజల అవసరాలను తెలుసుకొని ఆదిశగా పాలనా సాగిస్తే బావుంటుందని సదరు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.