అమెరికా, తైవాన్ మధ్యలో చైనా..
posted on Dec 3, 2016 @ 2:22PM
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వాల్సిందే. ఇప్పుడు తాజాగా అలాంటి వివాదానికే తెర లేపారు డొనాల్డ్ ట్రంప్. అదేంటంటే తైవాన్ దేశ అధ్యక్షురాలితో ఫోన్లో మాట్లాడటం. ఫోన్లో మాట్లాడటంలో అంత వివాదం ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అసలు సంగతేంటంటే.. 1979లో తైవాన్‌తో దౌత్య సంబంధాలను అమెరికా తెగదెంపులు చేసుకుంది. దాంతో తైపీలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసింది. ఒకే చైనా పాలసీని ప్రకటించింది. అప్పటి నుండి అమెరికా, తైవాన్ల మధ్య అధికారిక చర్చలు కానీ ఎలాంటి ఒప్పందాలు కానీ జరగలేదు. అయితే ఇప్పుడు దాదాపు 37 ఏళ్ల తరువాత ట్రంప్, తైవాన్ అధ్యక్షురాలితో మాట్లడటంతో ఇప్పుడు ఈ విషయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా, తైవాన్ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన ఈవిషయంపై కూల్ గా స్పందిస్తారా..? లేక అగ్నికి ఆజ్య పోసినట్టు మాట్లాడాతారా..? చూద్దాం..