ట్రంప్ ఆఫీస్ పై బాంబు దాడి..
posted on Oct 17, 2016 @ 12:26PM
ఇప్పటికే అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం వస్తున్న ఆరోపణలు పెద్ద దుమారం రేపుతుంటే..ఇప్పుడు ఆయన కార్యాలయంపై బాంబు దాడి జరగడంతో కలకలం ఏర్పడింది. ఉత్తర కరోలినా ప్రాంతంలో ఉన్న ట్రంప్ కార్యాలయంలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు బాంబు దాడి జరిపారు. కార్యాలయం కిటికీ గుండా లోపలకు బాంబులు విసిరారని.. ఈ పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నిచర్ తో పాటు, ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా కాలిబూడిదైందని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన పార్టీ నేతలు... కరోలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని.. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందనే అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని... ఈ ఘటనను తాము ఎన్నటికీ మరిచిపోమని తెలిపింది. దీనికి 'రాజకీయ ఉగ్రవాదంగా' అభివర్ణించింది. కాగా మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరగడం అమెరికాలో కలకలం రేపింది.