రాష్ట్రంలో వైద్యులు మందుల కొరతతో ప్రజల అగచాట్లు
posted on Jul 11, 2012 @ 10:31AM
రాష్ట్రంలో ఎండలు తగ్గి వర్షాలు పడటంతో వాతావరణంలో జరిగే మార్పులు ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందులో భాగంగానే మన్యంలోని తండావాసులు రోగాల బారిన పడ్డారు. దేశంలో ఎక్కడాలేనన్ని మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సగటున సంవత్సరానికి 5600 మంది వైద్యవిద్యార్దులు ప్రవేశం పొందుతున్నారు. అయినా ఏ ఒక్క వైద్యుడూ గ్రామీణ ప్రాంతల్లో సేవలందించటానికి సిద్దపడక పోవటంతో ఏజెన్సీ, గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షాగానే ఉంది.
రాష్ట్రంలోవైద్య సేవకు గాను 1000 కోట్లు అవసరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. అన్ని జిల్లాకేంద్రాలలోనూ, ప్రాథమిక కేంద్రాలలోనూ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులు ఉన్న ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక ప్రజలు అగచాట్లు పడుతున్నారు. మన్నెం పడకేసింది అనే శీర్షికతో ప్రతి సంవత్సరం వార్తాపత్రికలు, ఛానల్స్ ఏజన్సీలో విషజ్వరాల బారిన పడి మరణిస్తున్న విషయం ఎంత రాద్దాంతం చేసినా ప్రభుత్వం మొద్దునిద్దరలోనే ఉంది. ఎంతకీ శాశ్వత పరిష్కారానికి మొగ్గు చూపడంలేదు.
ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయల మందులు అవసరం ఉండగా కేవలం 44 కోట్ల రూపాయలను ప్రభుత్వం కెటాయించింది. వర్షాలకు నీళ్లు నిలవ ఉన్న ప్రదేశాల్లో దోమలు పెరిగి, మలేరియా, ఫైలేరీయా లాంటి వ్యాధుల బారిని పడుతున్నారు. నాళాలు లీకులవటం మూలంగా కలరా, టైఫాడ్ విజృంభిస్తున్నాయి. దానికి గాను డిటిడి, క్లోరిన్ సరఫరా వెంటనే జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. పంచాయితీ మున్సిఫల్ పరిధిలోని వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ జరిపించి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తన చిత్త శుద్ది కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.