పరేఖ్ వ్యాఖ్యలపై దిగ్విజయ్ ఆగ్రహం
posted on Oct 16, 2013 @ 2:24PM
బొగ్గు కుంభకోణంపై పీసీ పరేఖ్ బహిరంగ ప్రకటనలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేఖ్ ఏదైనా చెప్పాలనుకుంటే పరేఖ్ సీబీఐకి చెప్పాలని సూచించారు. పరేఖ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. హిండాల్కోకు బొగ్గు గని కేటాయింపు సక్రమమే అని, హిండాల్కో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కంపెనీ అని దిగ్విజయ్ తెలిపారు.
మరోవైపు నిజాయితీపరుడుగా పేరొందిన పి.సి.ఫరేఖ్ పేరును సిబిఐ బొగ్గు కుంభకోణం కేసులో చేర్చడం చర్చనీయాంశం అవుతోంది.బొగ్గు శాఖలో పారదర్శక తేవడానికి కృషి చేసిన తనపై కేసు పెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నిజంగానే సిబిఐ ఇలాంటి వ్యక్తులపై కేసులు పెట్టడం ద్వారా కొంత అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది.