టిడిపికి దడ పుట్టిస్తున్న దాడి
posted on Apr 12, 2013 @ 4:44PM
మంత్రి గంటా శ్రీనివాసరావుతో టిడిపి నేత దాడి వీరభద్రరావు భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీగా తనను కొనసాగించకపోవడంతో కొన్నాళ్ల క్రితం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దాడి.. ఇప్పుడిలా ప్రత్యర్థి పార్టీ మంత్రితో భేటీ కావడంతో ఆయన పార్టీ మారతారేమోనన్న ప్రచారం జరుగుతోంది.
తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని దాడి తెలిపారు. తాము తరుచూ మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని క్రాస్ రోడ్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి తాను మంత్రిని కలిసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం కాకుండా పరిష్కారం కోసమే కలిశానన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చూడటం తన ఉద్దేశమన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని.. తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరినట్లు చెప్పారు.