Read more!

సి.పి.ఐ. నారాయణకి అందని ద్రాక్ష!

 

 

 

ద్రాక్ష అందితే చాలా తీయన.. అందకపోతే మాత్రం చాలా పుల్లన. ఇప్పుడు సీపీఐ అధ్యక్షుడు నారాయణ ఈ మైండ్ సెట్‌లోనే వున్నారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికి రాష్ట్రం ముక్కలు కావడానికి ఒక కారణంగా నిలిచిన సీపీఐ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంది. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తమకు ఏయే సీట్లు కావాలన్న లిస్టు కూడా నారాయణ చేతిలో పెట్టుకుని తిరిగారు. నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ, జుట్టూ జుట్టూ పట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కలిపితే తమ పార్టీకి రాజకీయంగా మరింత లాభం కలుగుతుందని ఆశించిన నారాయణ ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.


పాపం నారాయణ ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. సరేలే టీఆర్ఎస్‌తోనే సరిపెట్టుకుందామని అనుకున్న నారాయణకి కేసీఆర్ భయంకరమైన షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించినప్పుడు సీపీఐ ఆశలు పెట్టుకున్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించేశారు. అంతేకాకుండా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని డిసైడ్ చేసుకున్నటు ప్రకటించారు. దాంతో సీపీఐ నారాయణ కంగుతిన్నారు. కేసీఆర్ తమకి ఇంత భారీ షాక్ ఇస్తాడని ఊహించలేకపోయినందుకు తమను తాను తిట్టుకుని, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేసాఆర్ని తిట్టారు. టీఆర్ఎస్‌తో తమకు పొత్తు కుదరలేదు కాబట్టి సదరు పొత్తు ఇప్పుడు పుల్లని ద్రాక్ష అయిపోయింది.