మోడీని నరికేస్తానన్న కాంగ్రెస్ మసూద్ అరెస్ట్
posted on Mar 29, 2014 @ 11:33AM
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సహరాన్ పూర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో విస్రృతంగా ప్రసారం కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మసూద్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. అటువంటి భాషను ఉపయోగించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆపార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. అభ్యంతరకర భాషనుపయోగించొద్దంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారన్నారు. తన వ్యాఖ్యలపై మసూదే మీడియాకు వివరణ ఇచ్చుకోవాలని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు.