సాహసోపేతంగా బాబు యాత్ర
posted on Dec 14, 2012 @ 11:05AM
చంద్ర బాబు నాయుడు తన పాద యాత్ర ను ఎంతో సాహసోపేతంగా చేస్తున్నారు. కాళ్ళ ఫై బొబ్బలను, పెరుతున్న షుగర్ స్థాయిని కూడా పట్టించుకోకుండా బాబు యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో ఓ చిట్టడవి లో బాబు గత రాత్రంతా బస చేశారు.
ఈ జిల్లాలోని ఖానాపూర్ మండలం ఎక్బల్ పూర్ లో ఓ చిట్టడవికి కేవలం 15 కిలో మీటర్ల దూరంలో, జనావాసాలకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వేసిన గుడారాల్లో బాబు ఓ రాత్రంతా బస చేశారు. ఈ ప్రాంతంలో నీరు తాగేందుకు అప్పుడప్పుడూ ఓ చిరుత వస్తుందని స్థానిక నాయకులు బాబుకు తెలిపినప్పటికీ, ఆయన ఎంతో సాహసోపేతంగా ఈ రాత్రిని అక్కడే ముగించారు. ఆ పులి ఈ మధ్య కాలంలో రెండు మేకలను, ఒక అవును చంపిందని స్థానికులు అంటున్నారు.
వీటితో పాటు, ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం, గతంలో ఓ సారి నక్సల్స్ తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాబు ఫై దాడి చేసి ఉండటంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏది ఎలా ఉన్నా, బాబు తన యాత్రను కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదేమో ?