ముందు తిట్లు... తరువాత పశ్చాత్తాపం
posted on Sep 6, 2016 @ 12:18PM
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ ముందు ఆవేశంగా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ఒబామాపై నోరుపారేసుకున్నాడు. ఆ తరువాత తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడుతున్నట్టు వ్యాఖ్యానించాడు. ఇంతకీ ఎందుకు తిట్టాడు.. ఎందుకు పశ్చాత్తాప పడ్డాడు అనేకదా డౌట్.. అసలు సంగతేంటంటే.. డ్రగ్స్ మాఫియాపై కఠినంగా వ్యవహరించడమేగాక, ఆ వ్యాపారాన్ని అంతమొందించేందుకు పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన ఇటీవలే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన డ్రగ్స్ మాఫియాపై మాట్లాడుతూ.. ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంలో నిందించారు. ట్వీస్ట్ ఏంటంటే.. అది కూడా ఒబామాతో సమావేశానికి ఒక రోజు ముందు. ఇంకేముంది జరగాల్సింది జరిగిపోయింది. ఆయనతో భేటీని ఒబామా రద్దు చేసేశారు. అంతేకాదు నిజం తెలుసుకోవాలని తన సన్నిహిత అధికారులకు తెలిపారు. ఇక అంతా అయిపోయిన తరువాత కళ్లు తెరచిన రొడ్రిగో.. మీడియా ప్రశ్నలతో ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశారని.. నుచిత వ్యాఖ్యలపై రొడ్రిగో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు.