నదిలో కూలిన అల్జీరియా విమానం!!
posted on Jul 24, 2014 @ 5:44PM
విమానాలకు యమగండకాలం నడుస్తున్నట్టుగా వుంది. అందుకే వరుసపెట్టి విమాన దుర్ఘటనలు జరుగుతూ వున్నాయి. అల్జీరియా దేశానికి చెందిన అల్జీర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏహెచ్ 5017 నెంబరు గల విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యం అయిన విషయం విదితమే. ఒవగడౌగో నుంచి అల్జీర్స్ వెళ్తున్న ఈ విమానం నైజర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది వున్నారు. ఈ 116 మంది మరణించి వుండవచ్చని భావస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల విమానాన్ని దారి మార్చుకోవాలని సూచించిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రచండంగా వీస్తున్న గాలుల వల్లే ఈ విమానం కూలిపోయిందని అధికారులు భావిస్తు్న్నారు. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం నాలుగు నెలల క్రితం అదృశ్యం కాగా, దాని ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులలో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని క్షిపణి తాకడంతో అది కూలిపోయి అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించారు. బుధవారం నాడు తైవాన్‌కి చెందిన విమానం కుప్పకూలి 51 మంది మరణించారు. తాజాగా గురువారం నాడు అల్జీర్స్ విమానం 116 మందితో ప్రయాణిస్తూ కుప్పకూలింది.