విమాన ప్రమాదంలో ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు : సీపీ జ్ఞానేందర్
posted on Jun 12, 2025 @ 6:18PM
గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి అవకాశం లేదని ఆయన అసోసియేట్ ప్రెస్‌తో అన్నారు. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వారంతా దాదాపు చనిపోయి ఉంటారని పరోక్షంగా వెల్లడించారు. మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరింది.
ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోనట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.భారతీయుల తర్వాత అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగినది ఒక విషాదకరమైన ప్రమాదం. మేం చాలా మందిని కోల్పోయాం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని అన్నారు. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. సంబంధిత విభాగాలు తాజా సమాచారాన్ని అందిస్తాయని చెప్పారు. ‘సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం మనం వేచి ఉండాలి’ అని అన్నారు.