నటి అంజలి క్షేమమే
posted on Apr 10, 2013 @ 1:59PM
రెండు రోజులుగా అదృశ్యమైన సినీ నటి అంజలి క్షేమంగా ఉన్నారు. తల్లి, సోదరుడికి ఫోన్ చేసిన అంజలి కేసు విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా సోదరుడికి తెలిపినట్లు తెలుస్తోంది. బెంగుళూరులో షూటింగ్ హాజరయే అవకాశం ఉన్నట్లు సమాచారం. పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం మీద తీవ్ర ఆరోపణలు చేసిన అంజలి అనుకోకుండా మాయమయింది. అయితే ఆమె ఓ సినిమా షూటింగ్ పాల్గొనేందుకు బెంగుళూరు వెళ్లినట్లు తేలింది. ఆమె అదృశ్యమయిందని ఆమె సోదరుడు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తన పరువుకు భంగం కలిగించిందని దర్శకుడు కళంజియం కూడా అంజలిపై చెన్నై కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే గత నెల 31వ తేదీ సాయంత్రం మూడున్నర గంటలకు అంజలి హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆమె దస్‌పల్లా హోటల్‌లోని 307 గదిలో బస చేసినట్లు, అక్కడి నుంచే ఆమె కనిపించకుండా పోయినట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ హోటల్ నుంచే బలుపు సినిమా షూటింగ్‌కు వెళ్లి వస్తుండేవారని అంటున్నారు. సోమవారం బయటకు వెళ్లిన అంజలి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు సూరిబాబు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమె ఒక్కరే బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసిటివీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అంజలి వ్యవహారం టాలీవుడ్ తీవ్ర చర్చానీయాంశంగా మారింది.