Read more!

ప్రేమికులరోజు: అన్నాచెల్లెళ్లకు పెళ్లి, బంధువులు ఆగ్రహం

 

 

 

 

ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందే హెచ్చరి౦చారు. అయితే హైదరాబాదులోని కుషాయిగూడలో రాజు, గౌతమి అనే ప్రేమికులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈ పెళ్ళి వివాదానికి దారి తీసింది.

 

అబ్బాయి - అమ్మాయి తరపు పెద్దలు వచ్చి గొడవకు దిగారు. విషయం ఏంటని చూస్తే.. పెళ్లి చేసుకున్న రాజు, గౌతమిలు కజిన్స్. రాజుకు గౌతమి పిన్ని కూతురట. వీరికి దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. అయితే, ఈ విషయం దళ్ కార్యకర్తలకు తెలియదు. వారు కుషాయిగూడలో ఓ గుడికి వెళ్లి వస్తుండగా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డగించి కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం పెళ్లి చేశారు. తాము వరుసకు అన్నా చెల్లెళ్లమని చెప్పలేదట. దీంతో ప్రేమికులుగా భావించి దళ్ కార్యకర్తలు వారి పెళ్లి చేశారు. రాజు, గౌతమిల పెళ్ళిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.