బుల్లితెర నటి ఆత్మహత్య.. ఉరేసుకొని
posted on Mar 2, 2016 @ 10:07AM
బుల్లితెరపై నటించే శృతి అనే నటి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగుళూరులో టెలివిజన్ నటి శృతికి రమేష్ అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితమే వివాహమైంది. వీరిద్దరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే శృతికి తన ఇంటికి సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శృతి నిన్న రాత్రి శ్రీకాంత్ ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన కొద్ది సేపటికి శ్రుతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ అతని స్నేహితుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంది. దాంతో శ్రీకాంత్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు శృతి భర్త రమేష్ తన భార్య చనిపోవడానికి కారణం శ్రీకాంతే అంటూ.. అతనే శ్రుతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకాంత్ పై కూడా కేసు నమోదు చేశారు.