బీజేపీ కి జేడీయూ రాంరాం
posted on Jun 17, 2013 @ 10:06AM
జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముస్లిం ఓట్ల ముసలం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కుదుపు తెచ్చింది. చాలా కాలం నుంచి బీజేపీతో కలిసి ఉన్న జేడీయూ బీజేపీ నుంచి చీలిపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రచార సారథిగా నియమించడం జెడి(యు) కు నచ్చలేదు. ముస్లిం ఓట్లు ప్రభావిత స్థాయిలో ఉండే బీహారులో వారి ఓట్లు కాపాడుకునేందుకు జేడీయూ ఈరోజు సమావేశం నిర్వహించి బీజేపీ నుంచి బయటపడాలని నిర్ణయించింది. దీనికి విచిత్రంగా… తన కారణాలు తాను చూపకుండా అసలు కారణం దాచి బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకే నచ్చని నిర్ణయం మాకెలా నచ్చుతుందంటూ విరుచుకుపడింది. మొత్తానికి మోడీ కారణంగా జెడి(యు) బీజేపీతో పదిహేడేళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. శత్రువు వినాశనం ఆనందాన్ని ఇచ్చినట్లు ఎన్డీయేలో జేడీయూ విడిపోవడం కాంగ్రెస్ సంతోషిస్తోంది. అంతేకాదు జెడి(యు)ను తమ వైపుకు రప్పించుకునేందుకు కాంగ్రెసుతో పాటు థర్డ్ ఫ్రంటు నేతలు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.