పన్నెండేళ్ళ చుక్క పాత చింతపండు రంగుతో , పిప్పళ్ళ బస్తాలా వూరి, పొట్టి జడకు లావుపాటి బంగారపు కుప్పెలు, వళ్ళంతా బంగారపు లొడుగు దిగేసుకుని అలంకరించిన అమ్మవారిలా వుంటుంది. కీచుస్వరంతో మాట్లాడుతుంటే రాజుకి చుక్క ఎదుటనుంచి పారిపోవాలని పిస్తుంది. మామయ్య రఘుపతికి భయపడి చుక్కతో నవ్వుతూ మాట్లాడుతాడు.
చుక్కకి "చుక్క అందంగా వుంటుంది. చుక్కమంచిది." అంటేచాలు వినటానికి తయారుగా.
" రాజు ఇంకా కళ్లు మూసుకుని నుంచున్నాడు చుక్క చెప్పబోయే దానికి వినటానికి తయారుగా.
"మరేమో, ఇందాక నాన్న వచ్చాడు. బావ రాలేదా యింతువరకు ? అని అడిగారు. రాలేదని చెప్పను. వెళ్ళిపోయాడు."
రాజు గబుక్కున కళ్ళు తెరిచాడు. చుక్కవైపు కోపంగా చూచాడు.
"నే రాదేలదని ఎందుకు చెప్పావ్?" రాజు గదమయించాడు.
"వచ్చావేమిటి మరి-?"చుక్క నిరలక్ష్యంగా అంది.
"తుమ్ముమొద్దువి నీకేం తెలియదు."
"నేను మొద్దునా, నువ్వే మొద్దువి, ఎద్దవి అన్నీ. చూడత్తయ్యా బావ ఏమంటున్నాడో? వూ..... వూ....వూ...."ఎడంచేత్తో ఒక కన్ను మాత్రమే నులుముకుంటూ లోపలికివెళ్ళింది చుక్క.
వంటగదిలోవున్న తల్లివద్దకు వెళ్ళకుండా వాకిట్లోకొచ్చి చీడీల మీద కూర్చున్నాడు రాజు. వాడికి ఎవరిమీదనో కశిగావుంది.
'ఈ చుక్కకు ఏనుగు తలకాయ అంత తలకాయ వుందికాని, చదువు లేదు. తెలివి లేదు. మామయ్యతో బావ వచ్చాడు ఇప్పుడే అలా వెళ్ళాడని చెప్పకూడదూ? మట్టిబుర్ర మొద్దావతారం- యీ ఇంట్లో అత్త,అమ్మ యిద్దరే మంచివాళ్ళు. మామయ్య పెద్దరాక్షసుడు, చుక్క చిన్న రాక్ష,సి.
" రాజూ!ఇంట్లో కి రాకుండా ఇక్కడ కూర్చున్నావేమిరా." రాజురాంగానే సరాసరి తన దగ్గరకు వస్తాడు. అలా రాకపోవటం చూచి పార్వతమ్మ వంటింట్లోంచి బయటకు వచ్చింది. చీడీల మీద కూర్చుని ఆలోచిస్తున్న రాజుని చూచి భుజం మీద చెయ్యివేసి కుదుపుతూ అడిగింది.
"ఊరికే కూర్చున్నాను." చీడీల మీదనుంచి లేస్తూ అన్నాడు.
రాజు ముఖం చూచిపార్వతమ్మ నమ్మలేదు. మరేమీ ప్రశ్నించకుండా లోపలికి నడిచింది.
తల్లిపెట్టిన జంతికలు తింటూ అడిగాడు రాజు.
"మామయ్య వచ్చి వెళ్ళాడుటగా! నే రాలేదని అడిగాడా?"
రాజు మొహం ఎందుకలా వుందో అర్థమయింది పార్మతమ్మకు. "ఊహు నీ గురించి అడగలేదు. మంచి నీళ్లు తీగి వెళ్ళాడుఆచార్లుగారిని పిలుచుకువస్తానని." చిన్నగా నవ్వుతూ చెప్పింది.
రాజు జంతికలు తింటూ కూర్చున్నాడు.
కొడుకు రూపరేఖలు చూస్తుంటే భర్త మధుసూధనం గుర్తుకు. వస్తున్నాడు పార్వతమ్మకి . రాజుకి ఆరేళ్ళ వయస్సులో పిడుగు పడి మధుసూదనం మరణించారు. రాజుతో పుట్టింటికి చేరింది. అన్న రఘుపతి స్వతహ మంచివాడే .అదో రకం స్వాభావం ఊరికే కోపంవస్తుంది "కయ్యికయ్యి"మని అరుస్తాడు. ప్రతివాళ్ళు తన చెప్పు చేతల్లో వుండాలన్నట్లు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. అయిన దానికి కానిదానికి , మొదటిసారి మామయ్యను చూచినప్పుడే సదభిప్రాయం కలుగలేదు రాజుకి.నల్లగా తాటి చెట్టులా పొడుగ్గా ఇంతంత, చేతికర్ర.... మామయ్యను చూస్తే భయం వేసింది. పదేళ్ళు మామ య్య ఇంట్లో పెరిగినా మామయ్యను చూస్తే మరింత భయమే తప్ప చనువులేదు.
జంతికలు తినటం పూర్తయిన తర్వాత అడిగాడు. " ఆత్తయ్యకు ఆయాసం ఎక్కువయిందామ్మా?"
పార్వతమ్మ వంకాయ ముక్కలు నీళ్ళల్లో కడిగి షాపులోవేస్తూ నిట్టూర్పు విడిచింది. "ఆచార్లుగారు ఏం మందిస్తున్నారో, ఏమో? రోజు రోజుకి నీరసరం, ఆయాసం హెచ్చటమేగాని తగ్గుముఖం కనపడటంలేదు. మంచం మీదనుంచి కాలు కిందపెడితే అరగంట బాధపడుతుంది. " కూర కలేబెడుతూ చెప్పింది.
రాజు మంచినీళ్ళు తాగి అత్తయ్య గదిలోకి వెళ్లాడు.
మంచం మీద కళ్లు మూసుకు పడుకున్న రాజేశ్వరమ్మ అడుగులు చప్పుడు విని కళ్లు తెరిచింది.
అత్తయ్య నిద్రపోతుందేమో అని రాజు వెనుదిగిరి బయటికి రాబోతుంటే రాజేశ్వరమ్మ కాళ్ళ వద్ద కూర్చుంటూ అన్నాడు రాజు.
పేలవంగ నవ్వింది. రాజేశ్వరమ్మా.
"రాత్రింబవళ్ళు మంచం దిగని నాకు నిద్రేమిటి రాజూ! ఏకంగా శాశ్విత నిద్రే."