సరళా పబ్లికేషన్ యజమాని అయిన ఆత్మారామ్ రాష్ట్రంలోని ప్రముఖ పబ్లిషర్స్ లో ఒకడు....
ఆదినుంచి రచయిత్రుల నవలలు ప్రచురించి పాఠకులకు ప్రముఖ రచయిత్రులపై ఉన్న క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు.
కాని ఇది వైధేయ శకం.....
వైధేయని యువరచియిత హఠాత్తుగా సాహిత్య వినీలాకాశంలో ఉదయించి అనుచనంగా వస్తున్న సాహితీ సంప్రాదాయాన్ని చేధించి ఓ కొత్త ఒరవడికి నాంది పలికాడు.....
ఏం రాసేడూ అనేకంటే విషయమైనా కానీ ఎలా చెప్పాడూ అన్న సూత్రంపై పాఠకులలోకాన్ని తన వేపు తిప్పుకున్నాడు వైధేయ......
అతడు రాసేది గొప్ప సాహిత్యమేమీకాదు..... గొప్పగా రాస్తాడు అంతే.
ఆదిలో వైధేయతన కథల్లో దట్టించిన పెక్సుని వయోలెన్స్ నీ, క్రైంనీ చూసి అంతా ఇదేక్కడ సోధ్యమన్నారు......
అనక దాని గురించే పదేపదే చర్చించుకుని ఏమిటంత ఘోరంగా రాస్తున్నాడూ అనుకుంటూ అతడురాసిన ప్రతీదీ చదవడం ప్రారంభించాడు.
ఆ తర్వాత అతడి సాహిత్యం అందించే మత్తునుంచి తేరుకోలేక హిప్నటైజ్ చేయబడనట్టు మరో రచయితా కధనుగాని అంగీకరించని స్థితికి వచ్చేశారు....
ఇదే వేవ్.....
మనుషుల బలహీనతల్నీ అద్భుతంగా స్టడీచేసి వాటిపై వైధేయ చేస్తున్నా స్వారీ......
హొటల్లో ఓ మూల కూర్చున్నారిద్దరూ.
"ఎన్నోరోజులుగా మీ వెంటబడుతున్నాను.... అయినా మీరు పట్టించుకోవడంలేదు" కాఫీలకు అర్దరిచ్చిన ఆత్మారాం తన గోడు ప్రారంభించాడు.
రోజులుకాదు ఏళ్ళతరబడి వైధేయకి అడగడం కాదు అభ్యర్ధిస్స్తున్నాడు.
"ఎల్లకాలం ఒకేలా ఉంటుదన్న అపోహతో బేంక్ లోన్ తీసుకుని ప్రెస్ ని వృద్ధిచేశాను. ఇప్పుడు మీ వేఫ్ తో రచయితల నవలలేమి అమ్ముడు పోవడంలేదు . పెద్ద ఇస్లాబ్లీష్ మెంటు కావడంతో దిక్కు తోచక చచ్చిపోతున్నాను..... పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రెస్ మూసేయడమే కాదు చాలా స్వల్ప వ్యవధిలో బజారున పడిపోతానేమో కూడా.... మీరు వెంటనే నన్నాదుకోవాలి . అనుకున్న సమయానికి బాకీ తీర్చడంలేదని బేంక్ వారు చర్య తీసుకుంటానని రాసిన తాఖీదు చూడండి" అంటూ ఓ లెటర్ వైధేయ చేతిలో పెట్టాడు......
ఇవన్నీ ఓపిగ్గా చదివే వ్యవదిలేదు.
అయినా వుత్సుహగా చూసేడు.
"మీరు కాదంటే..... " చెప్పలేదు అత్మారం. ఆ క్షణం చేతులు మాత్రమే పట్టుకున్న ఆత్మారాం నిజంగా వైధేయ కాదంటే హాఠాత్తుగా కాళ్ళుకూడా పట్టుకునేట్టట్టున్నాడు.
బిజినెస్ ... అతడి మాటల్లో బిజినెస్ అభినయిస్తున్న బాధలో బిజినెస్......
"మీరు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకండి సర్..... మీరు ఊ అంటే తలతాకట్టు పెట్టయినా మీరు అడిగినంత చెల్లించుకుంటాను ."
సాలోచనగా చూసాడు.....
"ఇవ్వడానికి నాకేం అభ్యంతరంలేదు. కాని ప్రస్తుతం వస్తున్న సీ యల్ ఒరిజనల్ పబ్లికేషర్ కే మాటిచ్చేసాను."
"సరే" ఈ మాత్రం అవకాశానికే ఖచ్చితంగా తబ్భిబ్బయినట్టే ముందుకు వంగి___
"మీరు వేరేది రాసిచ్చినా రెక్టుగా నవల వేస్తాను.... అది చాలు నన్ను ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కించడానికి" అన్నాడు.
"కాని వెంటనే అంటే ఎలా...."
"మీరు తలచుకొవాలేగాని రాయడం ఎంతసేపు...."
"ఆలోచిస్తాను...."
"అల అంటే కుదరదు సరే..... ఇది చూడండి"
అత్మారాం చేతిలో సిద్ధంగా ఉన్న దినపత్రిక చూపించాడు.
'విజయవాడ హైవేలో పెట్రోల్ ఉన్న బంకు దగ్దం.
అ వార్తను చూపుతూ "మీరు కావానుకుంటే ఇది ఆధారంగా ఓ అద్బుతమైన నవల రాసేయగలరు" అన్నాడు మరింతగా మోహమాటు పెట్టేస్తూ.
వైధేయ మోహం జేవురించింది ఉన్నట్టుండి .
ఆ వార్త చూసినందు క్కాదు......
సమీపంలో ఓ టేబుల్ దగ్గర కూచున్న వ్యక్తిని చూసి.....
అతడు మరెవరో కాదు.....
ఉదయం వైధేయ డ్రాయింగ్ రూ౦లో కూచుని రాస్తుంటే బయట బస స్టాఫ్ లో నిలబడి తననే పరికించిన వ్యక్తి ...... కిరణ్ తనపైకి ప్రయోగించిన సి.ఐ.డి.
ఇక అట్టేసేపు అక్కడ సైతం స్థిమితంగా ఉండలేకపోయాడు.
ఉన్నట్టుండి కుర్చీలోంచి పైకిలేచిన వైధేయ వింత ప్రవర్తనకు ముందు నిశ్చేష్టుడయ్యాడు అత్మారాం....
"సర్..." ఏదో అనబోతుంటే "అలాగే రాస్తాను. సాయంకాలం ఇంటికి రండి. ఫైనల్ గా మాట్లాడుకుందాం " చెప్పిన వైధేయ వడివడిగా భయటకు నడుస్తూ క్షణంపాటు వెనక్కీ తిరిగాడు......