Previous Page Next Page 
ది రైటర్ పేజి 37

                                    ఆనందరావు భార్యను హత్య చేసాడా
                                       ఇందులో పోలీసుల పాత్రే౦త
   

    భార్యను హత్యచేసి తనను పోలీసు డిపార్టుమెంటులో ఉన్న పరపతితో అతిశాదరణమైనాచావుగా నమ్మించి శవాన్ని ఖననం చేశాడని నిజానిజాలు తేలాలంటే ఆమె శవాన్ని బయటకు తీసి పోస్టుమారటం జరపాలని రాసెడు హైడ్ __ ది ఇన్ వేస్ట్ గేటివ్ జర్నలిస్టు.
   
    ఆ వార్తను రెండుసార్లు చదివేడు.......
   
    హైడ్...... ది ఇన్వెస్టుగేషన్జర్నలిస్టు జర్నలిస్టు.
   
    కానీ అతడి మనసు తన ప్రస్తుత స్థితినుంచి తేరుకోలేక పోతూంది..... పరోక్షంగా దెబ్బ తీయాలంటాడు. కౌటిల్యుడు" మునివంట పెదవిని నొక్కిపేట్టి దూరంగా చూస్తూ అంది. "ఇప్పుడు మనం కిరణ్ ని పరోక్ష్యంగానే దెబ్బ తీయబోతున్నాం."
   
    అర్ధం కాలేదతనికి "ఎలా?"
   
    "నీ నవలలో ప్రత్యర్దుల్లా"
   
    అతడిలోని ఓర్పు సన్నగిల్లిపోతూంది.
   
    "పిచ్చి వైదీ" మృదువుగా నవ్వుతూ చూసిందతడ్ని "కిరణ్ ఆగడాలు కట్టాలంటే మనం అనందరావుని అడ్డం పెట్టుకోవాలి. నీ నవల్లోని ప్రత్యర్దుల్లా ఓ చిన్న పధకం వేయాలి"
   
    వైధేయకిఅంతా గజిబిజిగా ఉంది.
   
    అనందారవుని అడ్డం పెట్టుకుని కిరణ్ పై దెబ్బ తీయడమేలాగో అర్ధం కావడంలేదు.
   
    "ఇప్పటికి వివరాలకోసం అరాటపడకు వైదీయ ముందు ఈ రాత్రికే మనం మరో సాహసం చేయాలి"
   
    మరో పెట్రోలు బంకుని తగలబెట్టాలా.....
   
    ఉలికిపాటుగా చూసేడామేను .
   
    ఆమె నేత్రాలు విషాన్ని నింపుతున్నట్లు రాక్షసంగా చూస్తున్నాయి.
   
    "మనం ప్రమాదం నుంచి గట్టెక్కాలీ అంటే..... ప్రత్యర్ధిపై పగ సాదించాలనీ అంటే ఈ రాత్రికి స్మశానానికి  వెళ్ళాలి....."
   
    ముందు సరిగా తాను వినలేదేమో అనుకున్నాడు.
   
    "స్మశానానికా?" రెట్టించాడు.
   
    "అవును"
   
    "ఎందుకూ"విభ్రాంతిగా అడిగాడు వణుకుతున్న గొంతులో .....
   
    "ఆనందరావు భార్య శవాన్ని వెలికి తీయడానికి ...."
   
    "అంటే......" వైధేయ గొంతు తడారిపోయింది.
   
    "అర్దరాత్రి సమాధిని త్రవ్వి శవాన్నిబయటకి తీసే చెబుతాను."
   
    "రోషణీ __" వైదేయ ఉద్వేగంతో ఏదో అనబోతుంటే ___
   
    "తప్పదు వైదీ __ మనకోసం ఈ మాత్రం రిస్కు తీసుకోక తప్పదు" ఆమె వెనక్కి తిరిగింది "గెట్ రెడీ"
   
                                6
   
    వైధేయ వారపత్రిక ఆఫీసు నుంచి బయటకి వచ్చాడు.
   
    ఈ రోజు ఎప్పటిలా ఎడిటర్ ఎక్కువసేపు ముచ్చటిస్తూ కూర్చోలేకపోయాడు.
   
    ట్రాన్స్ లోకి జారినట్టు ముభావంగా రెండుమాటలు చెప్పి బయలుదేరాడు.
   
    అతని మస్తిష్కంలో పదేపదే రోషణి అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి.
   
                     ______________________________________
                                              హెచ్ ఫర్ హేవక్
                     _______________________________________

   
    "కిరణ్ పై వగసాధించాలంటే ఆనందరావు భార్య శవం మాయం కావాలి."
   
    "ఈ రాత్రికే జరగాలి.... లేనివాడు ప్రత్యర్ధిని దెబ్బతీసే మంచి అవకాశం చేజారిపోతుంది."
   
    ఆలోచిస్తున్న కొద్దీ వైధేయకు  ముచ్చెమటలు పోస్తున్నాయి.
   
    రాత్రివేళ స్మశానానికి వెళ్ళడమూ సమాధిని తవ్వి శవాన్ని ఉపయోగపడుతుంది.

    అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తూంది.
   
    కొన్ని నిముషాల క్రితంవరకూ విపరీతమయిన వేడిని నైలపైకి చిమ్మిన సూర్యుడు హాఠాత్తుగా మేఘాల చాటుకు తప్పుకున్నాడు....
   
    అటోకోసం అటూ ఇటూ చూస్తుండగా 'నమస్కారం' ఎవరో పలకరించారు.
   
    పక్కకి తిరిగాడు.....
\   
    ఆత్మారామ్ .... బుక్ పబ్లిషరు ......
   
    "మీకోసం ఇంటికి వెళ్ళాను. అమ్మాయిగారు చెప్పారు వారపత్రిక ఆఫీసుకి వెళ్ళారని." వినయంగా అన్నాడతను.....
   
    అయితే ఏమిటన్నట్టుగా చూశాడు వైధేయ ......
   
    ప్రస్తుత మానసిక స్థితిలో రోషణి సన్నిధిలో తప్ప మరెక్కడా వుండలేడు వైధేయ.......
   
    "పది నిముషాలు ..... బసేరాలో కూర్చుందామా" చేతులు నులుముకుంటూ అడిగాడు ఆత్మారాం........
   
    ఇష్టంలేదు .... అయినా నడిచాడు.....
   
    ఆత్మారామ్ అడగబోయేదేమిటో వైధేయకి తెలుసు.....

 Previous Page Next Page