Previous Page Next Page 
ది రైటర్ పేజి 31

    "ఆనందరావుదే"

    షాక్ తిన్నట్టు నోరు తెరుచుకుని వుండిపోయాడు.
   
                                                            *    *    *    *   
   
    "మిస్టర్ అనందరావ్."
   
    "యస్ .నేనే మాట్లాడుతున్నా " ఆనందరావు చేతిలోరిసీవారు వణుకుతూ౦ది.
   
    రాత్రి హేంగోవరునుంచి ఇంకా తేరుకోలేదతను__
   
    "ఇప్పుడేనా నిద్రలేవడం......"
   
    ఈ మధ్య స్నేహితులు ఫోన్ చేసినా ఉలికిపడుతున్నాడతను.

    అలాంటిది తెల్లవారగానే ఎవరో అమ్మాయి చాలా అత్మీయటగా పలకరిస్తుంటేఎందుకాస్చర్యపోడు.
   
    "ఎవరు మీరు" అడిగాడు అప్పటికి పూర్తిగా తేరుకున్న అనందరావు.
   
    సన్నగా ఓ నవ్వు వినిపించింది.
   
    "మాట్లాడరేం___ ఎందుకు ఫోన్ చేసినట్టు ."
   
    "మరేం లేదు ..... విజయవాడ హైవేలో ఇరవై అయిదో మైలురాయి దగ్గర నీకారు చాలా భద్రంగా వుంది. వెంటనే వెళ్ళి తెచ్చుకో.... అంతే కాదు...... పోలీసులకు ఫోన్ చేసి మీ కారేక్కడానికి పోలేదని ఇంటి దగ్గరే భద్రంగా వుందని, తాగినమైకంలో పొరపాటు పడ్డావని తెలియజేయ్యి."
   
    "నో....నేనెలా చెయ్యను" త్రోటుపాటుగా అన్నాడు.
   
    'ఏం___ ఎందుకని."
   
    "అసలెందుకు చెయ్యాలి."
   
    "ఎందుకంటే ణీ భార్య మరణం సంగతి గోప్యంగా వుండాలి కాబట్టి."
   
    వెన్నెముకనిఉక్కు పిడికిలితో ఎవరో పట్టుకుని లాగినట్టయింది.
   
    "అసలు....మీరు"ఆనందరావు గొంతు వణికింది.
   
    "ఎవరో చెబుతాను. ముందా పని వెంటనే కానివ్వండి లేదా"
   
    "ఏం చేస్తావు" ధైర్యం  కూడగట్టుకుంటూ అడిగాడు.
   
    "చెప్పేదా" వ్యగ్యంగా నవ్వు వినిపించింది. "మీ ఆవిడశవాన్నమళ్ళీబయటకి తీయించి ఆటాప్సీతో అసలు రహస్యాన్ని ."
   
    "ఇక చెప్పకు __" అతని శరీరం ఓ ఫార్మాస్యూటిక్స్ కంపెనీ అఫీసరుగా మీపరపతి దెబ్బ  తినకూదడనంటే  వెంటనే చెప్పినట్టు చేస్తారుకడూ...."
   
    "అసలు .....మీ.రే... వ... రు."నిస్సత్తువగా అడిగాడు.
   
    "నేనే ... రమేష్ కి ప్రస్తుత ప్రియురాలిని......" రమేష్ అంటే అనందరావు భార్యతో ఒకనాడు ఆక్రమసంబంధమున్న వ్యక్తి.
   
    అతని చేతిలో రిసీకారు జారిపోయింది.
   
    "అయితే నా భార్యను లొంగదీసుకోవడమేకాదు..... నన్నుకూడా సాదించాలను కుంటున్నడన్నమాట ....." ఆవేశంగా బయటకు అనేశాడు.
   
    పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోంచి బయటకునదిచిమ్ది రోషణి.
   
    ఆమె వూహించగలదు.
   
    ఆ తర్వాత ఎన్ని సంఘటనలు వేగంగా జరిగిపోతాయో..
   
                                                        *    *    *    *
   
    రెస్టారెంట్ ఆవరణ విధ్యూదీపాల తోరణాలతో ప్రకాశించిపోతూంది. లోపల్నుంచి పాశ్చాత్య సంగీతపు హొరు మంద్రంగా వినిపిస్తుంటే రోషణితో ద్వారం దాటబోయిన వైధేయ ఎవరో పిలవడంతో ఆగిపోయాడు.
   
    "ఎవరూ" చుట్టూ చూసాడు.
   
    "నేనే.... హైడ్ ..." ఆవరణంలోని ఓ నందివర్దనపు చెట్టు మాటు నుంచి బయటకు వచ్చేడు హైడ్......
   
    "నమస్కారం"
   
    ఎందుకో అతడు ఆక్షణంలో అక్కడ కనిపించడం వైధేయకు ఇబ్బందిగా అనిపించింది.
   
    "ఏమిటి" అన్నట్టుగా చూసింది రోషణి.
   
    "ఇతనూ హైడ్ ణి సేన సేషనల్ జర్నలిస్ట్ .... నా అభిమానికూడా" పరిచయం చేశాడు వైధేయ.
   
    "హాల్లో" పలకరించిన రోషణి "పేరుకు తగ్గట్టు ప్రతీక్షణం దాక్కుని వుండాలి ఏమిటి" అంది.
   
    "ఆదినుంచీ నాకిది అలావాటై౦ది మేడమ్..." రోషణితోఅనేసి"అవునూ......మీకుతెలిసిమ్డా" వైధేయని అడిగాడు.
   
    "ఏంటి....."
   
    "అదేనండీ..... పేపర్లో పడిందిగా......పెట్రోలు బంకు దగ్దం......"
   
    "ఆ విన్నాను...." నీళ్ళు నముల్తూ జవాబిచ్చాడు.......
   
    "వినడమెంటి .......చదవలేదా "
   
    "ఆహా! ఏదో నవల రాస్తూ ఆ బీజీలో ...."
   
    "చదవాలి సార్ ఇలాంటి సంఘటనలు మీ రచనలకీ చాలా ఉపయోగపడతాయి చాలా గమ్మత్తుగా జరిగిందట." వైధేయ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
   
    "ఎవరు చెప్పారు ...."
   
    "భలేవారే.... ఆ బంకు మేనేజరు గంట క్రితమే స్పృహలోకి వచ్చేశాడుగా ...."   
   
    "నిజమా" వైధేయ నుదుటిపై ముత్యాల్లా మెరుస్తున్నాయి స్వేద బిందువులు .........  

 Previous Page Next Page