అవతల్నుంచి మేనేజరు ఏదో అన్నాడు "టైములేదు రేపు ప్రొద్దుటి కల్లా మేటర్ ప్రెస్ లోకి వెళ్ళిపోవాలి ....?"
"ఎం చెయ్యాలో నాకు తోచడం లేదు." ఫోన్ పెట్టేశాడు.
గౌతం అలాగే నిశ్సబ్దంగా కూర్చుని వున్నాడు.
"మీరిక వెళ్ళొచ్చు" అన్నాడు సంపాదకుడు . ముఖంలో ప్రపంచంలో ఉన్న చిరకునంతా ప్రదర్శిస్తూ .
గవుతమ్ లేచాడు. ఒక్క మాటకూడా మాట్లాడకుండా తలుపు దాకా వెళ్ళాడు.
సంపాదుకుడి మెదడులో వున్నట్టుండి మెరుపులా ఓ అద్భుతాలోచన పుట్టింది.
"గౌతమ్ గారూ! ఒక్క నిముషం"
గౌతమ్ గారూ! ఒక్క నిముషం"
గౌతమ్ ఆగాడు.
"ఇలా రండి."
తిరిగి టేబుల్ దగ్గరకు వచ్చాడు.
"మీరు ఒక్క పని చేయగలిగితే మేనేజర్ గారితోచెప్పి మీ రడిగిన రెండువేలు యిపిస్తాను."
గౌతంలో చిన్న ఆశ ప్రశ్నార్ధకంగా చూశాడు.
నాదముని గారి సీరియస్ మన పత్రికలో వొస్తున్న విషయం మీకు తెలుసు. పాఠకులు ఎగబడి వెయ్యి కళ్ళతో ఎదురు చూసి చదువుతున్నారు. పత్రిక సర్క్యులేషనంతా ఆ నవలమీదే ఆధారపడి ఉంది. అయన మామూలుగా ఏ వారానికావారం మేటర్ పంపిస్తూ వుంటారు. వారమ్మాయి చనిపోయిన విరక్తితో వుండి యిహ రాయలేనిపని కలాఖండిగా చెప్పేశారు. పాత పత్రికలన్నీ మీ కిస్తాను అవి చదివి రేప్పోద్దుటి కల్లా అయన శైలినీ పద్దతులనీ అనుకరిస్తూ రాసిచ్చి అంతేకాదు మలుపులుతో మెలికలతో ,ఆడంబరాలతో నవలంతా చివరిదాకా రాయాలి .... ఏమిటి? అలా చేస్తానని మాట యిస్తేయిప్పుడే మేనేజరు గారితో చెప్పి ..... ఆయనకూడా చాలా టెన్షన్ లో వున్నారు..... మీరు ఊ అంటే ..... డబ్బు యిప్పుడే యిప్పిస్తాను."
గౌతమ్ ఒక్క నిముషం కూడా కనీసం ఒక్క సెకేను కూడా ఆలోచించలేదు . ఆ సమయంలో విరాజి తప్ప యింకో ధ్యాసలేదు. ఆమె కోసం ఏమయినా సరే చెయ్యాటానికి సిద్దపడి వున్నాడు.
"సరే" అనేశాడు .
ఆ నిర్ణయమే ఆ సరే! అనేమాటే అతని జీవితంలో ఆ క్షణం నుంచీ పెద్ద మలుపుకు నాంది పలికింది.
విరాజికి ఆపరేషన్ జరిగింది. జనరల్ ఎన స్తీషియా ఇవ్వడం వల్ల మధ్యలో ఎంతో కొంత తెలివి వచ్చినా, మర్నాటి ఉదయానికి గాని పరిసరాలు తెలిసి మాట్లాడే స్థితికి రాలేదు.
ఆ రాత్రంతా అతను జాగారంచేసి, ఒకవైపు ఆమెని కనిపెడుతూనే రెండోవైపు కాగితాలు ముందేసుకుని తనకిష్టంలేని కఠోర తపస్సు చేస్తున్నట్టు మనసు మెలికలు తిరుగుతొన్నా, చేతులు కొంకర్లు పోతొన్నా రాస్తూనే ఉన్నాడనీ, అతని జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయిందనీ ఆమెకు తెలియదు.
ప్రోద్దేక్కినకొద్ది క్రమంగా తెలివోచ్చి కొంచెం కొంచెం మాట్లాడే స్థితికి వొచ్చింది.
మొదట మసక మసగ్గా ఏమీ జ్ఞాపకం రాలేదు. తర్వాత ఒక్కొక్క టీగా అన్నీ జ్ఞాపకం వచ్చేశాయి.
"గౌతమ్ " అంది.
అతనామెకు చేరువలోనే కూర్చుని వున్నాడు. కాగితాల్లోంచి తల ఎత్తి పలకరింపుగా నవ్వేడు.
ఎంత అమాయకంగా , పసిగా ఉన్నాడు: వరసగా రెండు రాత్రిళ్ళు అతనికి నిద్రరాలేదు తన గురించి జట్టంతా రేగిపోయి, కళ్ళు లోతుకు పోయి గుండెను కలిచివేసేలా జుట్టంతా రేగిపోయి, కళ్ళు లోతుకు పోయి గుండెను కలిచివేసేలా వున్నాడు.
ఆపరేషన్ చెయ్యటం వల్ల కడుపంతా నరాలు తోడేస్తున్నట్లు. లోపలేదో భగ్గుమని మండుతున్నట్లు , మత్తు పూర్తిగా వీడక యిమ్తా నిద్ర పోవాలని వుంది.
"విరాజీ! ఎలా వుంది?" ఎంత ప్రేమ అతని గొంతులో! జవాబు చెప్పకుండా కళ్ళప్పగించి అతనివంకే చూస్తోంది. ఎవరితను? ఇతనికీ, తనకూ ఏమిటి సంబంధం? తాను పుట్టిపెరిగిన కుటుంబం "నా" ఆన్నవాళ్ళు అందర్నీ మరచిపోయింది. ఎక్కడ వున్నారో కూడా తెలియక ఆలోచించటం మానేస్థితిలో వుంది.
అతనూ ..... అలాగే......
ఇద్దరూ యీ ప్రపంచమనే సముద్రంలో యీది ఓ వొడ్డుకు చేరుకున్నారు. ఒకరి నీడలో ఒకరు ఓదార్పు పొందారు.
అతనడిగాడు, ఏమని?
అతను కోరాడు , ఏమని?
"నువ్వు .... నువ్వు .... నాకు ...."
ఎంత బాధలో వొంటరి తనంలో విలవిల్లాడిపోతూ తోడు కోసము అలమటిస్తూ అడిగాడు.
తాను నిరాకరించి౦ది.
ఎందుకు?
అతనికోసం అనుక్షణం హృదయం కలవరిస్తోన్నా నీ .... నీ ... అని స్వాగతం పలుకుతూన్న అతన్ని ఓ సంపూర్ణమైన రచయితగా తన ఊహస్వప్నమైనా కళాకారుడిగా చూడాలని ఆ శుభదినం తనకు ఎదురుపడాలనీ తాను మనిషిగా తనిలోని మధురిమలన్నీ చేరిపెసుకుంది తననితాను చంపెసుకుంది.
ఆమె కళ్ళవెంట జలజలా కన్నీరు.
"విరాజీ ఎందుకు? అయినా బాగానే జరిగిందిగా" గౌతమ్ అనునయముగా అంటున్నాడు.
ఆ కన్నీటి పొరల్లోంచి కదిలే పాదాలు , ఘల్లు ఘల్లున అందియ రవళులు........
గుండె ఝల్లుమంది .
రాదు. ఆ రోజురాదు? రాలేదు. తన జీవిత చరిత్రలోంచి నిర్దాక్ష్యిన్యంగా చెరిగిపోయింది.
ఇంకా పదిరోజులు.
తన శరీరం తెలుస్తోంది. కడుపులో కాల్చేస్తోన్న నిప్పు కణికలు జరగబోయే వాస్తవాన్ని చాటుతున్నాయి. తనకు శక్తి చాలదు.
ఆమె ఎందుకేడుస్తున్నదో అతనికి తెలుస్తోంది. ఆ కన్నీటి కణాలు విలపించే విషాద హృదయాన్ని కళా అర్తనాదాన్ని గానం చేస్తున్నాయి.
దగ్గరకు తీసుకోవాలనీ , ఓదార్చాలనీ "నేనున్నా" నని అభయమివ్వాలనీ పాపం లేత గుండె కొట్టుకుపోయింది.
కానీ ......
పూర్తీ చేయవలసిన పేజీలు ...... ఆతృతగా __ కోపంగా ఎదురు చూస్తోన్న సంపాదుకుడిని మొహం, గడిచిపోతున్న నిముషాలు , తన్లోని బాధ్యతను మేల్కోలిపి, నవ్వివూరుకుని, తలవంచుకుని కలాన్ని కదిలిస్తున్నాడు.
ఆమె ఆశ్చర్యంగా వుంది. "ఏమిటంత దీక్షగా రాస్తున్నావు? చాలా అర్జంటా?"
"నాకన్నా?" ఆమె నీరసంగా నవ్వింది.
అతనేదో జవాబు చేబుదామని పెదవి విప్పే లోపలే __ "నాకు తెలీని అర్జంటే ముందబ్బా " అన్నది మళ్ళీ తనే!
.... ..... .....
బహుశా ..... ఈ చెదిరిపోయిన సంఘటనలకు, గుండె చెదిరి ఏదో ఆపుకోలేని కొత్త __ కాదు గొప్ప ఆలోచన స్ప్రురించి వుంటుంది....." అని తనకుతానే సమాధానం చెప్పుకుంది.
* * * *
గౌతమ్ మేటర్ తీసుకెళ్ళేసరికి సంపాదుకుడు చాలా రెస్ట్ లెస్ గా వున్నాడు. మేనేజర్ దగ్గర్నుంచి అప్పుడే రెండుసార్లు రిమైండర్స్ వచ్చాయి.
"తీసుకొచ్చారా?" అన్నాడు గౌతమ్ ను చూసి చికాకుని కప్పిపుచ్చుకుంటూ!
గౌతమ్ తలవూపి మేటర్ అందించాడు.
సంపాదుకుడు కాగితాలు టేబుల్ మీద పేట్టి ఒక్కొక్క పేజీ చదవ సాగాడు. అతని ముఖంలో రంగులు మారసాగాయి. ఆశ్చర్యం , సంభ్రమం అనందం .....
చదవటం పూర్తయ్యాక సంతోషం పట్టలేక "ఎక్స్ లెంట్ " అన్నాడు
హమ్మయ్య అనుకున్నాడు గౌతమ్ గొప్ప రిలీఫ్ పొందినట్లుగా .
"చాలా బాగా రాశారు. అచ్చం నాదమునిగారి శైలిలాగా ఉంది. చివర్న ట్విస్ట్ కూడా అద్భుతంగా వుంది. ఇది వెంటనే డ్రాయింగ్ గీయించి ప్రేసు కి పంపించేస్తున్నారు. ఈ సీరియల్ నాదమునిగారే కంటిన్యూ చేస్తున్నారని అందరూ అనుకుంటారు."
గౌతమ్ మౌనంగా కూర్చున్నాడు. అలసిపోయి వున్న అతని మెదడు మొద్దుపారిపోయి వుంది.
"గో ఎ హెడ్ . వచ్చేవారం మేటర్ రెండు మూడు రోజుల్లో తయారయేలా చూడండి . టెన్షన్ లేకుండా వుంటుంది."