ఓ మహా పరీక్షకు నిలబడి, ప్యాస్ మార్కులు తెచ్చుకున్నట్లు గౌతం నిట్టూర్పు విడిచి అక్కడ్నుంచి బయటకు కదలాడు.
* * * *
రెండు రోజులు గడిచేసరికి విరాజి కాస్త కోలుకుంది. ముఖంలోకి కొద్దికొద్దిగా కాంతి ప్రవేశించింది.
ఆరిపోతున్న ఆశ మనస్సులో రహస్యంగా చిగురించసాగింది.
మూడోరోజు మధ్యాహ్నం డాక్టరుగారు చూడటానికి వచ్చినప్పుడు వుండబట్టలేక అడిగేసింది.
"డాక్టరు గారూ ఇప్పుడు నా అరోగ్యమేలా వుంది?"
"బావుందమ్మా చాలా తొందరగా యింప్రూవ్ అవుతున్నావు."
"నా స్టిచేస్ ఎప్పుడు విప్పుతారు"
డాక్టరు లెక్కవేసి "ఎనిమిదోరోజున అంటే వచ్చే బుధవారమవుతుంది" అని చెప్పాడు.
"అంటే, అప్పటికింకా మూడురోజులు టైముంటుంది ?" అన్నది విరాజి సాలోచనగా.
దగ్గరలోనో నిలబడివున్న గౌతమ్ ఉలిక్కిపడ్డాడు. "దేనికి ?" అనడిగాడు డాక్టరుగారు అర్ధంగాక.
"నా నృత్య ప్రదర్శనకు"
డాక్టరుగారు కూడా అదిరిపడ్డారు "ఆపరేషన్ చేసిన పదకొండో రోజుకు, కుట్లువిప్పిన మూడోరోజున డ్వాన్స్ చేస్తారా?" ఇంపాజిబుల్ "అన్నాడు.
విరాజి నవ్వింది. "డాక్టరుగారూ!" ప్రపంచ చరిత్రలో అలా జరిగిన సంఘటనలు ఒకటి రెండయినా వు౦డి వు౦డవా?" అనడిగింది.
"ఆ సంగతి నాకు తెలీదు . కాని మీరు మాత్రం చెయ్యటమనేది యింపాజిబుల్."
"ఒకవేళ చేస్తే ఏమవుతుంది?"
"ఏమయినా జరగవచ్చు."
"అంటే?"
డాక్టరు కొంచెం ఆలోచించాడు . రిస్కు తీసుకోవడం ఇష్టంలేక ఆమెను ధైర్యపరచడానికలా అన్నాడు. గాని సైంటిఫి క్ గా ఎక్స్ ప్లనేషన్ చెప్పడానికి పూర్తిగా కుదరలేదు.
"స్కీన్ మీద స్యూచర్స్ వారం రోజులకు తీసివేస్తాము. అది పరవాలేదు. కాని లోపల క్యాట్ గట్ వేసిన భాగాలు హిల్ అవటానికి మూడు వారాలు పడుతుంది వారం పదిరోజులకే ఒత్తిడికి గురిచేస్తే ఆ భాగాలు రఫ్ చరయిపోవచ్చు.
"రఫ్ చరయితే ఏం జరుగుతుంది?"
"షాక్ వచ్చి పేషంట్ కు ప్రమాదమేర్పడవచ్చు. తిరిగి ఎమర్జన్సీ అపరేస్జన్ అవసరం రావచ్చు./. షాక్ నుంచి రికవర్ కాకపోతే ఆపరేషన్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడవచ్చు."
"ఒకవేళ యివన్నీ జరక్కుండా వుండదనిక్కూడా అవకాశముంది కదా?"
"అంటే?"
"ఆపరేషన్ చెయ్యబడ్డ భాగం డ్వాన్స్ కదలికలవల్ల వత్తిడికి లోనయినా ఏ ప్రమాదం జరక్కుండా వుండటానిక్కూడా అవకాశం వుందికదా."
"అవకాశం లేకపోలేదు " అన్నాడు డాక్టర్ విధిలేక.
* * * *
హాస్పిటల్ నుంచి డిస్చార్జి అయివచ్చాక విరాజి గౌతమ్ చెప్పినా, వారించ ప్రయత్నించినా వినిపించుకోలేదు. నేను పోగ్రాం యిచ్చి తీరతాను. అని పట్టుబట్టి నిముషాలమీద ఆర్టిస్టులందరినీ ప్రోపుచేసి సాధన మొదలు పెట్టింది.
ఆమె చిన్న యిల్లు, ఆ పేదరికపు చిన్నారి యిల్లు ఆ క్షణం నుంచీ నిర్విరామంగా ఉప్పెనలాంటి కలా నిలయమై విజ్రుభణలాంటి కళావిన్యాసాల తరంగా భరితమై ఒప్పారింది.
అటు ఆమె శ్రమను చూస్తూ యిటు యిచ్చిన కమిట్ మెంట్ కు లొంగిపోతూ గౌతమ్ నలిగిపోతున్నాడు?
విరాజికింతవరకూ ఈ రహస్యం తెలియదు. తెలిస్తే ఏ పెను తుఫానులు చెలరేగుతాయో, ఏ అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయో తెలియదు.
తాను నాదమునిగారి స్కిప్ట్ పూర్తీ చేస్తున్నా సంగతి అయిన సీరియల్స్ వేస్తోన్న మిగతా పత్రికలవారికి కూడా తెలిసింది. వాళ్ళంతా రెక్కలు కట్టుకుని వచ్చివాలి, అతన్ని వత్తిడికి గురిచేసి డబ్బు విరజిమ్మి తనంగీకరించేలా చేశారు.
చెయ్యాలా, వొద్దా అన్న మీ మాంసనుండి చేసెయ్యాలి అన్న నిర్ణయానికి వచ్చేశాడు. గౌతమ్.
తన ప్రపంచంలో తానువుండి గవుతమ్ కోసం వచ్చిపోయే యీ నూతన వ్యక్తులను గురిమ్ని పట్టించుకోలేదు విరాజి.
* * * *
ఆ రోజు వచ్చేసింది. ఇచ్చిన పభ్లిసితీ మూలంగా అయితేనేమి, ఆహ్వానాలు విరివిగా పంచిబెట్టబడడం వల్లగాని జనం బాగా వచ్చారు. రవీంద్ర భారతి నిండిపోయింది.
ప్రదర్శనకుముందు సభనేర్పాటు చేయడంగాని, ముఖ్య అతిథిని పిలవటంలాంటి తతగంగాని ఏమీ చెయ్యలేదు.
లోపలనుంచి మైక్ లో నృత్య , ప్రదర్శన లక్ష్యం , దాని యితివృత్తం __ గవుతమ్ ఐదునిముషాలుపాటు వివరించారు. అతని కంఠస్వరం ఉచ్చారణ పెక్షకులని బాగా అలరించింది.
ఎందుకయినా మంచిదని విరాజికి ఆపరేషన్ చేసిన డాక్టర్ని ఆహ్వానించడమేగాకబలవంతముచేసి తీసుకువచ్చి ముందు వరసలో కూర్చోబెట్టాడు.
ప్రదర్శన మొదలయింది.
చాలామంది విధ్యపకులూ , మేధావులూ కళాకారులు జర్నలిస్టులూ ప్రేక్షకుల్లో వున్నారు. ప్రదర్శన ఎత్తుగడ, ఆరంభంనుంచీ తీసుకున్న శ్రద్ధ కదలికల్లో హావ భావాల్లో కొత్తదనం యితివృత్త లోని బిగువు అందరినీ ఆకర్షించింది.
ఒక రొటీన్ నుంచి, ఏదో పాత "రుబ్బుడు" నే కొత్తరంగులో చూసి విసుగెత్తి పోయిన అరుగులనుంచి గొప్ప రిలీఫ్ .
మనుషులని ఆహ్లాదపరచే ఓ విభ్రాంతి.
గవుతమ్ లోపల ఓ పక్కగా నిలబడి నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఈ విరాజి తన విరాజియేనా! మేకఫ్ లో , పాత్రలో ఎంత మహొన్నత౦గా కళాత్మకంగా ఎదిగింది! ఆమె రూపం , అభినయం , ముఖంలో క్షణ క్షణం మారే మహాభావాలు ఎంత అపూర్వంగా వున్నాయి.
అలా ద్రిగ్భాంతికి లోనవుతున్న ఆమె శరీర స్థితిని మరచిపోలేదు. ఆమె యాక్టివ్ గా కడులూతున్నప్పుడు, ఏదయినా మార్పు సంభవిస్తూ దేమోనని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.
రానూ రానూ ప్రేక్షకులు బుగువైన మూడ లోకి వెళ్ళిపోయి అద్భుతానుభూతిని లోనవుతున్నారు.
ఆడిటోరియంలో ఏదో అమృత రసాన్ని గ్రోలుతూన్న నిషా.
ప్రదర్శన చివరకు వస్తోంది. క్లయిమాక్స్ సమీపిస్తోంది.
ఈ క్లయిమాక్స్ గురించే గవుతమ్ భయపడుతున్నాడు. ఈ ఘట్టంలో సమాజపు వికృత చేష్టలకు ఆవేశానికి గురైన విరాజి పాత్ర ఆ మానిసికంగా ఉద్రేకాన్ని ప్రదర్శిస్తూ రకరకాల విన్యాసాలు ఆరుస్తూ యించు మించు పదినిముషాల పాటు నాట్యం చేయాల్సి వుంది.
ఆ ఘట్టానికి ముందు కొంతసేపు ఆమె స్టేజిమీద వుండవలసినంత అవసరం లేదు. మిగతా ఆర్టిస్టులతో కథనడుస్తూ వుంటుంది.
గ్రీన్ రూంలో ఓ ప్రక్కన నిలబడి రాబోయే దృశ్యాన్ని మానం చేసుకుంటూ విరాజి నిలబడి వుంది.
గ్రీన్ రూంలోనే వున్న ఫోన్ రింగయింది.
మే పట్టించుకోలేదు. అసలీ ప్రపంచములో లేదు.
కాని మిగతా అర్టిస్థలంతా స్టేజిమీద జరుగుతోన్న సన్నీవేశంలో అభినయిస్తూ దిమగ్నులై వుండటము చేత ఫోన్ ఎవరూ రిసీవ్ చేసుకోలేదు.
ఫోన్ రింగవుతూనే వుంది.
చివరకు విరాజికి వినిపించి అటూ ఇటూ చూసింది. ఎవరూ కనబడలేదు. డిస్టర్బ్ అవుతానని తెలుస్తావున్న విధిలేక రిసీవ్ చేసుకుంది.
"హలో! గవుతమ్ గారున్నారా?" అంది అవతలనుంచి ఓ గొంతు.
గవుతమ్ ఆమెకు అభిముఖంగా వున్నవైపు నిలబడివున్నాడు. కనుకోసలనుంచి ఆ విషయాన్ని నిమనించింది విరాజి.
"స్టేజికి అటువైపు వున్నారు. ఏం కావాలో చెప్పండి" అంది విరాజి.
"నేను .... పత్రిక సంపాదుకుడ్ని. ఈ సాయంత్రంలోగా సీరియల్ కి మేటర్ పంపిస్తానన్నారు. రాలేదు"
"మేతరేమిటి ? కొత్తగా ఏమీ రాయటం లేదుగా?"
"నాదమునిగారు షాక్ లో వుండి రాయలేకపొతే గవుతమ్ గారు పూర్తీ చేస్తున్నారు. "
విరాజి కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయింది.