Previous Page Next Page 
ది రైటర్ పేజి 25

    "సార్" ఆ కుర్రాడు గావుకేకపెట్టడంతో స్వప్నంలోంచి తేరుకున్నాడు మేనేజర్.
   
    "చూడండి సార్ __ ఆవిడ పంపులాక్కుంది __"
   
    "తప్పా! వంపు మీదైనా  టాంకు నాదిగా.... సరదాపుట్టింది నింపుకుంటున్నా."
   
    ఆమె నవ్విన నవ్వుకి మేనేజర్ ఎంతో సంబరపడిపోయాడు."మీరు కావలనాలేగాని  బంకు మొత్తం మీడిక్కీలో పెట్టెసుకోండి......" అనేయలన్నంతఊపోచ్చేసింది.
   
    "తప్పేంట్రా! ఎవరునింపితేనేం ....మీటరునుబట్టిడబ్బులిచ్చేస్తారుగా" మేలితిరుగుతూ ధర్మామీటరుకు అందని వేడి ఒంట్లో౦చి పుట్టుకోస్తుంటేకాంక్షగా ఆమెను చూశాడు.
   
    "థేంక్యూ" గోముగా చూసింది.

    లైట్ బ్లూకలర్  మేక్సీలో పాలనురుగులాంటి పొంకాన్ని గుట్టుగా దాచుకుని గాఢ౦గా నిట్టూర్చుతుంటే మాత్రాముగ్డుడిలా మారిపోయడతాను.
   
    "టే౦కు నిండింది.....తాళంవేసి ఇలా యివ్వు" పంపునాబ్ పైనుంచి వేలిని పక్కకు జరిపింది.
   
    మరో అరనిముషంలో కారు టే౦క్ లాక్ చేసి తాళాన్నిఆమె కందించాడు.
   
    "అవునూ ___ ఈ బంకు యజమానెవరు"
   
    టైము చూచుకుంటూ అడిగింది __ పది ముప్పుయ్యారు.
   
    సరిగ్గా అప్పుడే రోడ్డుపై నుంచి దూసుకువెళ్తున్న డాట్సన్ పై నడిందామె.దృష్టి........
   
    క్షణం పాటు తల బయటకి పేట్టి చూసిన వైధేయని గుర్తుపట్టడం ఆమెకు కష్టంకాదు.
   
    "మీరు చెప్పనే లేదు...." అంది ఇందాక అడిగిన ప్రశ్నకి జవాబెంటన్నట్టు.     
   
    "అరుణకూమారి కలలోలా జవాబిచ్చాడు మేనేజర్.
   
    "అరుణంటేబక్కగా వుంటాడు కదూ"
   
    "లేదండీ, బాగా లావుగా వుంటాడు "
   
    "ఇంతలావుంటాడా"
   
    ఆమె తన చేతుల్ని చాచింది అతడిని చేరి చుట్టూ చేతులనుంచి.
   
    ఆది వ్యక్తి ఊహించనిది.
   
    "లే...లేదు..... ఇమ్కాసంనగా వుంటాడు"
   
    "ఇంతా" ఆమె చేతుల్ని మరింత దగ్గరకి జరిపింది.
   
    ఆ క్షణంలో ఆవ్యక్తి ఎంతటి వివశాత్వానికి లోనయ్యాడూ అంటే ఆమె పంపునాబ్ ను నొక్కిన విషయంగానిఅప్పటికే పెట్రోల్ టో అతడి శరీరమంతా తడిసిన నిజమ్గాని ఆ కుర్రాడు కేకసేతంటవరకూ గుర్తించలేకపోయాడు.
   
    "అయ్యో...... ఇదేంటి"
   
    కుర్రాడు ముందుకు పరుగెత్తుకోస్తుంటే పంపులోని పపెట్రోల్ టో వాడ్ని పూర్తిగా తడిపెసింది రోషణి.
   
    "ఆ పంపుఇలా ఇచ్చేయండి "
   
    ఈసారి బంకు మేనేజర్ రెండుడుగులు ముందుకేసి ఆమె చేతిలోని అవుట్ లేట్ లాక్కోబోయాడు.
   
    "స్టాఫ్ దేర్" అరిచింది.
   
    ఇప్పుడామె చేతిలో ఓ లైటర్ వేలుగుతూంది.
   
    "మిస్టర్.... అగక్కడముందుకొచ్చావంటే నీబంకుతోపాటు నువ్వూ నీ అసిస్టెంట్ మాడిమసైపోతారు" పంపుని ఆపరేట్ చేస్తూ బంకుని చుట్టూ పరిసరాల్ని పెట్రోల్ తో తడుపుతూనే ఓ నవ్వు నవ్వింది.
   
    ఇప్పుడామె గంధర్వకన్యలా కనిపించలేదతనికి.
   
    ఓ మృత్యుదేవతలా రక్తం త్రాగే తోదేలులా అనిపించింది.  
   
    అతడు ఏదో అనబోతూ మరో అడుగు ముందుకు రాబోయాడు.
   
    "ఏం......హెచ్చరించింది. "చెబుతున్నది నీక్కాదూ"
   
    "ఇప్పుడిదతా..... ఏం కావాలని" మేనేజర్ గొంతు తడబడింది.
   
    "దట్స్ గుడ్...... అలావ్యవాహారంలోకి రా,చూడూ.... నే దగ్గరున్న ఆకేష్ బాక్స్ మొత్తం కారులో పెట్టించు"
   
    "అమ్మో నా ఉద్యోగం "
   
    "కాదంటే ....నీ ఉద్యోగమే కాదు నీ ప్రాణాలు పోతాయి. వ్యవధి లేదు. అయిందంకేలు లెక్కపెడుతున్నాను" లైబరీ వెలిగించింది.

    క్షణంపాటు మేనేజరు కల్లకడి శవాన్ని కాల్చే కోరివిలా అనిపించింది.
   
    "ఒకటి....." చూసింది.
   
    చలనం లేదు.
   
    "రెండు...." అమెకారువేపుగా నడిచింది.
   
    "మూడు..."
   
    నిస్సహాయంగా తలపట్టుకున్నాడు.
   
    "నాలుగు __ "
   
    "ఇచ్చేయరా " అరిచాడు మేనేజర్. లెదర్ కేష్ బాక్స్ ను కుర్రాడికి అందిస్తూ.
   
    రెప్పపాటులో కేష్ బాక్స్ ను కారులో వుంచాడు.
   
    అప్పటికే కారును చేరుకుందామే వంపును విసిరి.
   
    బంకు మేనేజరు ఒక్కక్షణం సంశయించి కారునెంబరు చూడ్డానికన్నట్టు బంకు సమీపంలోనుమ్చి కారు వెనగ్గా వచ్చాడు.
   
    కారు కదలింది......
   
    వెనగ్గా  ఎన్ని అడుగులు పరుగెత్తారో అసలుఅతాడు కారు నెంబరు చూసాడు లేదోమరి.  

 Previous Page Next Page