కంగారేక్కువై౦ది.
తనకున్న గడుపు కేవలం మరో ఇరవై అయిదు నిముషాలు మాత్రమె ___
సమయం మించిపోతుంటే ఏం చేయాలో పాలుపోనీ వైధేయ చాలా విసుగ్గా నడుస్తున్నాడు రోడ్డుపై.
వెనకనుంచి డీకొట్టాడో సైకిలిస్టు......
"ఏం సార్ ! రోడ్డంతా కాంట్రాక్టుకు తీసుకున్నట్టు ఆ నడకేమిటి కాస్త చూసుకుని నడవండి."
ముండుకుతూలిన వైధేయ ఆవేశంగా పైకి లేచి ఎడాపెడా రెండు వాయించాలన్నంత రోషంగా చూసాడు కాని ఇది అదను కాదనిపించింది.
"బాస్టర్" వెళుతున్న సైకిలిస్టు చూస్తూ తిట్టుకుని ద్రుష్ట వేనుకవేపు మరల్చాడు ___
పేంటు నిండా దుమ్ము అంటుకుంది.
బహుశా సైకిలు టైర్ తాకినప్పుడు అంటిన "దుమ్ము" కావచ్చు.
దుమ్ము..... దుమ్ము......
ప్లేష్ లా వెలిగింది వైధేయ మెదడులో.....
అంతే __ సమీపంలో వెళుతున్న ఆటోను చూస్తూ కేకవేశాడు.
అయిదు నిముషాల్లో ఆటో గమ్యాన్ని చేరింది.
మీటరు అయింది కేవలం మూడు రూఇపాయలు మాత్రమే..... అయినా అయిదు రూపాయలనోటు ఆటోవాడికిఅందించి అ చిల్లర మాటేత్తకుండా రెస్టారెంట్ కౌంపౌండ్ లో అడుగుపెట్టాడు.
లైటు వెల్తురు తప్పించుకుంటూ మెల్లగా గార్డెన్ లోనుంచికార్ పార్కింగ్ ఏరియాను చేరుకొని __ అక్కడినుండి చూసాడు.
విన్న రోషణి తనూ చూసిన స్థలంలోనే వుంది ఆ కారు. లైట్ ఎల్లో డాట్సన్ కారు __
దాని మీదకి రోషణి ఒరిగినపుడు ఆమెకు దుమ్ము అంటుకుంటుంది.
అప్పుడే అనుకున్నాడు రోజుల తరబడి ఆ కారునెవరో అక్కడ పార్క్ చేసి వుంచారని కాబట్టే అంతలా ధూళి పేరుకుపోయిందనీను __
అతడు రెండే రెండు నిముషాలు అక్కడ నిలబడి గమనించాడు పరిసరాల్ని.
రెస్టారెంట్ లో నుమ్చిసంనగా వినిపిస్తున్న సందడి తప్ప బయట అలికిడి లేదు__
డాట్సన్ కలు దగ్గరగా __ _ _ ఇంకా దగ్గరగా _ _ మరీ దగ్గరగా _ _ వచ్చేసాడు.
అతని చేయి హేండల్ మీదకి వెళ్ళింది.
అంతే..... హఠాత్తుగా కలకలం......
చటుక్కున హేండిల్ మీది నుంచి చేయి వచ్చి తూలుకుంటూ ఆగివున్న ఓ కారుని సమీపించి కారులో కూర్చునాడు......
అయిదారుగురు రెస్టారెంట్ లోంచిబయటకి వచ్చి తూలుకుంటూ ఆగివున్న ఒకరుని సమీపించి కారులో కూర్చున్నారు.....
మరో రెండు నిముషాల్లో ఆకారు వెళ్ళిపోయింది.
చీకటిలోనే ఎలక్ట్రానిక్ వాచీ చూసుకున్నాడు....... పదీ ఇరవై ఎనిమిది_ _
కేవలం పన్నెండు నిముషాల వ్యవధి మాత్రమె మిగిలింది.
డాట్సన్ కారు డోర్ తెరిచాడు.
జేబులో వున్న తాళాలగుత్తిలోని ఒక్కో తాళమూ తీసి ట్రైచేస్తుంటే ఒకీ సరిపోయింది.
అది తిప్పగానే విచిత్రంగా కారు స్టార్టయింది.
'గుడ్ గాడ్' అ కీ బంచ్ ఇచ్చిన రిషణికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని కారుని ముందుకు పోనిచ్చాడు.
అతని పెదవులపై సన్నని నవ్వొకటి పెరిసి మాయమైంది.
'ఆపరేషన్ ఒన్' పూర్తయ్యింది జయప్రదంగా ......
పదిన్నర _ _ _ _
పర్వాలేదు _ _ _
పర్వాలేదు _ _ రోషణి చెప్పిన వేళకి టంచనుగా గమ్యాన్ని చేరుకోవచ్చు.
మరో అయిదు నిముషాల కల్లా దాట్సన్ విజయవాడ హైవే మార్గంలో అడుగుపెట్టింది.
మెత్తగా సాగిపోతున్న డాట్సన్ నడుపుతుంటే అ రాత్రి తను ఆ స్వదించబోయే రోషణి అందం గుర్తుకొచ్చింది.
గుడ్ గ్రేషియన్ .......
* * * *
"చాలా అమ్మగారూ" అన్నాడు పెట్రోల్ బంక్ వంపు పట్టుకున్న పదిహేనేళ్ళ కుర్రాడు.
హైదరాబాద్ నగరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో హయత్ నగర్ కు సమీపంలో ఉన్న 'పెట్రోల్ బంక్' అది.
"ఉహూ! టే౦క్ పూర్తిగా నింపెయ్ "
కళ్ళలో కాంట్రాక్ట్ లెన్స్ తో ఏ వీదేశీ యువతో అన్నట్టుగా బాబ్ డ్ హెయిర్ సవరించుకుంటూ చెప్పింది రోషణి.
ఆమెను సమీపంలో నిలబడి చూస్తున్నాడు బంక్ మేనేజర్.
ఇంత అందమైన ఆ నిశ్శబ్ద సౌందర్యం అనుభవించతగ్గదిగానూ అనిపిస్తుంటే పరిసరాల్ని మరచి అమే నగ్న శరీరాన్ని ఊహించుకుంటున్నాడతను.
"ఏదీ..... ఇలాతే....." వంపు అవుత కూడదండి" అన్నాడు కాస్త వెనక్కీ జరుగుతూ.
"ఎడ్చావ్ లే ..." లాక్కుంది బలవంతంగా.