కళ్ళు చిట్లించి విప్పతోటలోకి చూశాడు.
ఖచ్చితంగా ఎక్కడుందో తెలీకపోయినా పులి ప్రస్తుతం ప్రాతంలో నక్కి వుందని అర్ధమైపోయింది.
వేటలో ఏంట అనుభవమున్నాఏ కొసరునుంచో మనిషిరక్తానికి అలవాటుపడ్డ ఓ పెద్దపులి తనను పరిశీలింస్తోందన్నఆలోచన ఎలాంటి వ్యక్తికైనా ఎంత అందోళనపరిచేది ఆ స్థానంలోవున్న వాళ్ళకితప్పఅర్ధంకాదు.
నుదుట పడుతున్న స్వేదాన్ని తుడుచుకుంటూ రెండు అగాల్లో ఇందాక పులి 'టగ్' మార్క్స్ కనిపించిన ప్రదేశానికి వచ్చి ఓ చిన్న పుల్లతో కొలతలు తీసుకున్నాడు. ఇసుకలో పాదం దిగినచోట పెద్ద 'టోస్కనిపించాయి. నడకలో ముందూ వెనుక పదాలమధ్య రిలీటివ్ ప్లేన్ మెంట్ అంచనా వేస్తూ క్షణం తర్వాత జీఫ్ దగ్గరకి వచ్చాడు.
"ఇట్స్ మేల్ టైగర్" డ్రైవింగ్ సీటులో కూర్చుంటూ అన్నాడు.
"కనీసం పడి అడుగుల పొడవున్న మగపులి అది చాలా ఆరోగ్యమ్గా వున్నా కుడిపక్క కొద్దిగా కుంటుతోంది.
"ఎలా తెలుసు " ఆ ప్రతిభడవుతూ అడిగాడు రమాకాంత్.
"ఎడమ పాదాల గుర్తులు బాగా లోతుగా దిగబడి వున్నాయి కాబట్టి."
"నేనూ చూసిరానా..." ఉస్తూకతంగా అన్నాడు రమాకాంత్.
"ఇప్పుడు కాదు..."
"అదేం."
ఆ పులి ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఎక్కడో వుందికాబట్టి."
"నిజమా" రమాకాంత్ వెన్నులో సన్నగా చలి మొదలైంది.
జీపుని వేగంగా ముందుకీ పోనిస్తూ అన్నాడు చైతన్య "ఉన్న అనుమానం చెరిగిపోయింది మిస్టర్ రమాకాంత్ ... అది మామూలు పులి కాదు.... మనిషి రక్తం మరిగిన చాలా శక్తివంతమైన ఫేరోషియన్ మేనీటర్..."
చైతన్య ప్రతిమాటా అతడ్ని ఆశ్చర్యంలోకి నెడుతుంటే అడిగాడు"అది మేనీటర్ అని హఠాత్తుగా ఎలా తెలుసుకోగలిగారు."
"మామూలు పులి ఇద్దర్ని ఒకేసారి చంపే అవకాశంలేదు. ఆకలితీర్చుకోవడానికి అయితే ఒక వ్యక్తిని చంపుతుంది..... అసలు మనుష్యసంచారానికి దూరంగా వుండటానికి ఇష్టపడే పులి సామాన్యంగా మనుషులపైచార్జి చేయదు. అదే పిల్లల్లున్న ఆడపులి అయితే తన పిల్లలికి మనిషి మూలంగా ప్రమాదం వాటిల్లుతుమ్దన్నుకున్నప్పుడుచార్జి చేసి ప్రాణాలు తీస్తుంది...."
"కాని ఇది మగ పులిగా"
"అది మాత్రమే కాదు. గాయబడిన పులి కాబట్టి బహుశా ఆ బలమైనా గాయమేదాన్ని మేనీటర్ గా మర్చివుంటుంది."
భయంతో బాదే... ఈ ప్రపంచంలో చాలా నేరాలకి కారణం ఆకలి బాదే అయినట్టు ఫెలిస్ జాతికి చెందిన పులి మేనితర్ గా మారటానికి అదే ఆకలిబాధ కారణమవుతుంది.
రమాకాంత్ ని చూడడంలేదు చైతన్య.... యదా లపంగా చెప్పుకు పోతున్నాడు.
"ఒకనాటి ఆటవిక వ్యవస్థలో మనిషి ఆహారంకోసం మృగాలని వేటాడే రోజుల్లో వీ పులుపు మనుషులకి చాలా దూరంగా వుండేవి. క్రమంగా నాగరికత పెరిగి మనిషి అరణ్యవాసాన్ని వదిలి నగరాల్ని నిర్మించుకున్నాడు. అడవిలో సంచరించే పులి, జిమ్కల్నీ, అడవిపందుల్ని ముళ్ళపందుల్నీ వేటాడ తూ ఆకలిని చాల్లర్చుకునేది. క్రమంగా పెరిగిన నాగరికత అడవుల్నీ నాశనం చేసేదాకా విస్తరించింది. దానితో సహజంగా లభ్యమయ్యేఆహార వనరులు క్షీణించిపోయాయి."
క్షణం ఆగాడు.....
"ఇది మౌలికమైన సమస్యయితే వన్య మృగ సంరక్షణకోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలుచేసినా అనుమతి లేని వేటగాళ్ళుఇంకా అడవుల్లో అడుగు పెడుతూనే వున్నారు. ఓ స్పావుర్తులా పులివేట ఇంకాసాగిస్తూనేవున్నారు. వందల పులులు అలా ప్రాణాలు కోల్పోతే కొన్ని గురితప్పినా వేటగాడి తూటాకి గాయబడివాటి ఆహారాన్ని సంపాదించుకునే సహజమైన శక్తిని, పోరాడి గెలుచుకునే బలాన్ని పోగొట్టి ఒక్కోమారు ముళ్ళపందిని నేల కూల్చ్గలేక ముళ్ళతోమరిన్ని గాయాల్ని చేసుకుంటుంది. ఉద్రుతమైన ఆకలి బాధ సునాయాసంగా వేటాడబడేజంతువు కోసం ఎదురుచూసే అవకాశాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు నాలుగు కళ్ళ జంతువుల్నివేటాడిలేని పులి తొలిసారితనను సమీపించిన రెండు కళ్ళ మనిషిపై చార్జి చేస్తుంది. సరిగ్గా ఇక్కడే పులికి అర్దమవుతుందిసులభంగా వేటాడగలిగేది మనిషినేనని దానితో మనులంటేసహజంగా వున్న భయం పోతుంది. అలా మనుషులపై అధిపత్యాన్ని నిరూపించుమనుష్యుల్ని చంపటానికి సిద్దబడుతుంది. అదే పులిని భయంకరంగా మార్చేదీ, వేటగాడిని భయపెట్టేదీ కూడా...."
"మీతోపాటు ఈ మేనీటర్ హంటింగ్ లో నాకూ పార్తిస్ పేట్ చెయాలనుంది." టక్కున అన్నాడు రమాకాంత్.
"ప్రమాదకరమైన కోరకది..."
"ఫర్వాలేదు సర్..... మీరున్నరుగా"
"పెళ్ళయిందా మీకు...."
"అయింది . మరో నేలా రెండు నెలల్లో తండ్రిని కాబోతున్నా కూడా..."
"దెన్ డోంట్ టేక రిస్క్ ..." స్వాభావికంగా అన్నాడు చైతన్య మందహాసం చేస్తూ.