లోయల్లో ఎదిగిన ఎత్తైన శిఖరాగ్రాల వంటి వక్షోజాలు అతడిలోని నిగ్రహాన్ని సవాల్ చేస్తున్న పిడిబాకుల్లా __ గుండెల్ని నులిపేస్తున్నాయి......
నిశ్శబ్దం.... ఉన్మాదాన్ని రేపే సద్దు.... అదీ క్షణకాలం పాటే ___
అమాంతం ఆమెను వాటేసుకున్నాడు __
"ప్లీజ్ __" వారించబోయింది.
అప్పటికే అతడి పెదవులు లోయల్ని తాకి తర్వాత ఏటవాలుగా వున్న కొండ చరియల్లో నుంచి శిఖరగ్రానికి చేరుకున్నాయి __
"ఆ__ బ్బా!" మూలిగింది రోషణి రెచ్చగోడుతున్నట్టు __
"ప్లీజ్" ఈ సారి వైధేయ అభ్యర్ధించాడు.....
"చెప్పానుగా వైదేయా? ఇవి కావాలంటే నువ్వేం చేయాలో" పెనుగులాడుతూ దూరం జరగాలని ప్రయత్నిస్తూందామె.
"అంతవరకూ ___"గోణికాడు.
"నేను ఓడిపోలేను. " నచ్చ చెప్పింది సూటిమెత్తగా అతడి చేతుల్లో నలిగిపోతూనే.
"నేను గెలవాలంటే వెంటనే ఏం చేయాలో చెప్పు " ఆలస్యాన్ని తాళలేనట్టు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు.
"చెబుతాను __ కొద్దిగా నన్ను వదులు __"
"సారీ __" అతడి శరీరమంతా స్వేదంతో తడిసిపోతూంది.
సున్నితంగా చాలా మెత్తగా అతడి నుంచి విడివిడి దూరంగా నిలబడింది. అంతటి నిగ్రహం ఆమెకు ఎలా అలవడిందో ఆ స్థితిలో కూడా అంతటి శక్తిని కూడగట్టుకుని ఎలా వెనక్కి జరగ్గగలిగిందో వూహించలేకపోయాడు వైధేయ__
"ఇది చాలా దారుణం ___
"ఏదీ __" అడగింది గోముగా నవ్వుతూ __
"ఇంతవరకూ రానిచ్చి ఆ తర్వాత దూరంగా నెట్టేయడం....."
"మళ్ళీ దగ్గరికి తీసుకోడానికేగా"
"ఎప్పుడు __"
నేనకున్న స్థితికి నువ్వేదిగాక"
"అలాంటప్పుడు ఇదంతా దేనికి?"
"అంత గొప్ప రచయితని ఈమాత్రం అర్ధం కాలేదా __ సగ్మండ్ ఫ్రాయిడ్ ని చదివితే బోధపడేది _ _ "
"ఏమిటి _"
"కోరికంటె ఏమిటో కేవలం ప్రేరణటో మనిషిని ఎంత బలంగా ఉత్తేజపరచొచ్చో" అర్దనిమీలిత నేత్రాలతో చూసింది.
భావరహితంగా నిలబడిపోయాడు ___
"ఆడదానితో అనుభవంకాని అనుభవంలో అనందం కాని అతనికి కొత్తకాదు తాను కోరిన ఆడదాన్ని ముగ్గులోకి దింపడంలోకాని కోరివచ్చిన ఆడదానికోర్కెల్ని బుసకొట్టించి కోటికొకడు అనిపించుకోవడంలో గాని సమర్డుడతను __
అతడి జీవితంలో తొలిసారి ఒక అద్బుతమైన అనుభవంలో మధ్యంతరంగా ఆగిపోవడం _ _
ఎందుకిలా ఓడిపోయాడు __
కారణం ఆమె అసాధారణ సౌందర్యమూ ____
కాదు __ అందాన్ని అస్రంగా వాడుకోగల ఆడవాళ్ళనేందర్నో మరాణాస్రాల్లాంటి మాటలతో జోకోట్టుగలిగాడు__
మరెందుకిలా జరిగింది ___
ఏ జన్మలోనో తను జార్చుకున్న ఓ అందమైన స్మృతీ శకలం మొదలి అతడ్ని వివశుడ్ని చేస్తున్నట్టు తిరిగి రాదనుకున్న ఏ పెన్నిధోకదలి తొందరపడి మళ్ళీ చేజార్చుకోవడం మూర్ఖత్వమన్నట్టు ముకుళించుకు పోతున్నాడు.....
అతడికే తెలీని ఓ వింత ప్రవృత్తి మొదలై౦దతడిలో.....
* * * *
ఉలికి పడినట్లుగా నిద్రలేచింది రోషణి....
భయకరమైన పీడకల .....
మంటలు ...... మంటలు ..... కార్చిచ్చులా వ్యాపించిన మంటలు.... సముద్ర గర్భాన్ని చీల్చుకువచ్చిన మంటలు.... మంటల్లో మాడిపోతున్న మనుషుల ఆర్తనాదాలు ...... ప్రపంచాన్ని చేట్టేసి ప్రకృతిని బాగభాగా మండించే దావానలంలో ఒంటరిగా గమ్యం లేకుండా పరుగెత్తుతున్న తను......
మొహమంతా స్వేదంతో తడిసిపోయింది......
బడలికగా లేచింది పశువుపైనుంచి.
గోడ గడియారం నాలుగు గంటలు సూచిస్తూంది.
అల్లరి చేసిన ఆకతాయి పిల్లాడు ఆదమరచి నిద్రపోతున్నట్టుగా ఓ వారగా, పడుకుని వున్నాడు వైధేయ....
రెప్పవాల్చకుండా చాలా సేపు అలాగే చూస్తూ వుండిపోయింది.....
ఏవో ఆలోచనలు ...... తెగని వూహలు......
కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది......
అంతటా నిశ్శబ్దం.....
తూర్పున అప్పుడే విచ్చుకుంటున్న వెలుగు రేఖల్ని చూస్తున్న ఆమె కళ్ళముందు.....
మళ్ళీ అవే మంటలు..... హేయంగా కౄరంగా కర్కశంగా.....
కిటికీ ఊచల చుట్టూ ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి......
చాలా క్రోధంగా రెండు నీటిబోట్లు ఆమె కళ్ళనుంచి జారి కిటికీ అంచునే పడ్డాయి .