"యూసీ .... హు యీజ్ దేర్" కదలబోయిన చైతన్య ఠక్కున ఆగిపోయాడు. అక్కడ ఆమెని సాగనంపాలని వచ్చిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆ వాక్కాయి చూస్తుండగానే ఉద్వేగంగా అంది. "మీ హయారార్కీ విషయంలో జైక్యం చేసుకోవడం నక్ అభిమతం కాకపోయినా తమ ఇన్ జార్జ్ గా వున్న అడవుల్లో పెంచబడుతున్న అరవై గంజాయిమొక్కలకి ఆయనే బాధ్యడునే ఈ దేశ శ్రేయస్సు దృష్ట్యా తేల్చాల్సిన బాధ్యత మీ మీద వుంది."
పుల్ స్టాఫ్ లేకుండా ఓ పెద్ద వాక్యాన్ని సంభందింవిసవిసా నడవ బోయిన దీక్షని చూస్తూ "హయ్ " అన్నాడు చైతన్య మందహాసంచేస్తూ క్షణకాలం తెప్పరిల్లలేక పోయింది అతడి పెదవులపై విడీవడని నవ్వునూ చూస్తూ.
అందమైన చైతన్య పెదవులు అలా నవ్వడం ఎలాంటిఅందమైన అమ్మాయినైనా ఓడించే అస్రాలని యింతకు పూర్వం రెండుసార్లూతీర్మానించుకుని వుండడంతో సూటిగా చూడలేక పోయింది.
"బాగున్నారా."
మీరు కోపంలో మరింత బాగుంటారని మొదటిసారి కలసినప్పుడు చైతన్య యిచ్చిన కాంప్లిమెంట్ గుర్తుకొచ్చి క్షణంపాటు తను అంతబాగుండకపొతే బాగుణ్ణుని కూడా అనుకుంది.
"కుడి ఎడమలు కలసి పనిచేయాల్సిన వాళ్ళం. యిలా కోపాన్ని వ్యక్తం చేస్తే బాగోదు."
ఆ వాక్య ప్రయోగం అధ్వాన్నంగా వుంది. ఇలా అయితే.... "
"ఈ దేశం ఏమైపోతుందని అనే హక్కు మీ అలవాటు రీత్యా మీకుంది. కాదనను కాని ఆ వాక్యంలో అశ్లీలత లేదు. అడవుల్లో గంజాయిని పెంచకుండా చూడాల్సింది నేనైతే పెంచేవాళ్ళని పట్టుకోవాల్సింది మీరు అలా మనది జంట పోరాటమెగా "
మళ్ళీ 'జంట పోరాటం' అంటూ ఇంకో అసందర్భ వాక్య ప్రయోగం జరిగిపోయింది డి.ఏస్ ఓ. చైతన్యకి 'బాస్' అయిన డెప్యూటీ కన్జర్వేటర్ కోసం గాలించిచింది కాని అతడెప్పుడో జారుకున్నాడని బోధ పడిపోయింది
"మిస్టర్ చైతన్యా...... నేను డ్యూటీ లో వున్న పోలీస్ ఆఫీసర్ని."
"అవునవును" ఆమెను అసాదదమస్తకం ఏకాగ్రతగా చూస్తుంటే అతడి చూపులు లేజర్ బీమ్స్ లా ఒంటికి తాకుతున్నట్టనిపించింది.
"సో..... అరవై గంజాయి మొక్కల విషయంలోఅంతలా హైరానా పడుతున్న మిస్ దీక్షాదేవి..... వాటిని పెంచిన నేరస్తుడ్నీ పట్టుకున్నారా."
"పాతిక మొక్కలతో పారిపోయాడు."
"మిగిలిన ముప్ఫై అయిదు మొక్కలూ పట్టుకుని మీరిలా వాచ్చారనుకుంటాను."
గట్టిగా తిట్టాలనుకుంది. తిరుగులేని పద్దతిలో ఖండించాలనుకుంది అయినా గతంలో రెండుసార్లలాగే ఒడిపోతుంది. చాలామంది ముందు దూకుడిగా మాట్లాడే తను చైతన్య ముందు మాత్రమె ఇలా అయిపోవడానికి కారణాలను ఈ మధ్య లోతుగా ఆలోచించింది. కాని సరైన జవాబు దౌరకలేదు.
"మిస్టర్ చైతన్యా.... ఇక్కడ నేను అవేశం వస్తున్నా ఎందుకు నిభాయించుకుంటున్నానూ అంటే...."
"అంతార్జాతీయ స్థాయిలో అందరికీ తెలిస్తే బాగుండదని."
"యూ అరిన్స్ల్టల్టింగ్ మీ."
"నో నో..... నాటేటాల్ . మీ లాంటి అందమైన అమ్మాయి యిలా రియాక్టయితే."
"అయితే."
"మరింత అందంగా కనిపించే అవకాశముంది కాబట్టి ఆ ప్రాయత్యాన్ని మానుకోవడం బెటరంటున్నాను" అన్నాడు నెమ్మదిగా.
"మీరు చాలా రిజర్వడుగా వుంటారని మీ డిపార్ట్ మెంట్ లో అందరూ ఎలా మోసపోతూన్నారో అర్ధం కావటంలేదు" ఇదీ కామన్వెల్తు దేశాలన్నీ ఆలోచించాల్సిన సమస్యలాగే మధనపడింది.
"గుడ్.... చక్కని స్టేట్ మెంట్ " ఆమె కోపం వీగిపోతుందని గ్రహించాడు. తన అందం గురించి అంగ సోష్టవం గురించి చాలా బలమైన నమ్మకం గల దీక్షని గతంలో ఎలా నియంత్రించాడో గుర్తుకొచ్చివెంటనే మరో అస్రాన్ని సందించాడు. "నిజమే నన్నంతా ముఖావంగా వుండే మనిషి అంటారు కాదనను. కానీ డార్విన్ గానీ అయన టాటా ఎరాస్మస్ డార్విన్గానీ జీవజాతుల పరిమాణవాదాన్ని గట్టిగా బలపరిచారని మీరు అంగీకరించాలి."
మేధస్సులో తనూ తక్కువ తినలేదని నిరూపించుకునే యిలాంటి క్షణాలు వృధా కాకూడదనుకుందేమో ఠక్కున అంది. "అంతకన్నా పరిణామ వాదాన్ని మరింత గట్టిగా బలపరిచినవాడు ప్రెంచి జాతీయుడైన జాబాస్టిస్ట్ లా మార్క్.... ఒక జీవజాతి నుంచి మరో జీవజాతి పరిణామం చెందిందని అతను చాలా దృఢంగా విశ్వసించాడు మగాడైనా."
"గుడ్ ... సమయానికి లామార్క్ ని రిఫర్ చేసి నాకుచాలా సహాకరించావు."
"అదేం" వ్యంగ్యంగా అంది.
"ఏ అజ్ఞాత యుగంలోకి ఓ జంతువు చెట్ల ఆకులని నాలుకచాచితినడం నేర్చుకుని వుంటుంది. కింది కొమ్మల్లోకి ఆకులూ అయిపోగా పై కొమ్మల్లోకి ఆకుల్ని అందుకోవడానికి మెడ బాగా చాచేవుంటుంది. ఆ తర్వాత పై కొమ్మలను అందుకోవాలని..."
"మెడ...... కాళ్ళు ..... నాలుక సాచే కొన్ని తరాల తర్వాత అది ప్రస్తుతం మనం చూసే జిరాఫేగా మారిందని లామర్క్స్ అన్నాడు..... సోవాట్...."
"అలాగే " నెమ్మదిగా ఆఫీసు స్టఫ్ ని చూపిస్తూ అన్నాడు.
"ఇక్కడ ప్రతి మగాడిమెడ ఆరునెలల్లో ఆరడుగుదాకా పెరిగింది."
"వాట్."
"నిజం దీక్షాదేవీ.... టైఫ్ మిషన్ కి అవలివైపు వున్న మార్గరేట్ అందాన్నే చూడాలని ప్రయత్నించిన మగాళ్ళు అలా మేడలు చాచి ఇప్పుడు లామర్క్స్ థియరీ నిజమని రుజువుచేశారు."