ఏమిటా తరిస్థితులు? అంత కొంపమునిగి పోయినంత ఏం జరిగింది మన మధ్య?"
"నీ దారిన నువ్వు, నా పద్దతిలో నేనూ యింత వేగంగా దూసుకుపోతున్నా యింకా ఏ కొంప మునిగిందా అని అడుగుతున్నావా గౌతం! భిన్న ధృవాల్లో మనం యింకా ఎంత దూరం జరిగిపోతున్నామో గుర్తించ లేదా?"
అతనామే ముఖంలోకి చూశాడు. అటువైపు కదిలాడు ఆమె అడుగు వెయ్యకుండా అలాగే నిలబడివుంది. అతని వైపు కన్నార్పకుండా చూస్తూ
దగ్గర కొచ్చి భుజాలమీద చేతులువేసి ముఖంలో ముఖంపెట్టి చూస్తూ అన్నాడు.
"ఎందుకు? ఎందుకలా జరిగిందో నిజం తెలిస్తే ఒప్పుకునేందుకు నిరాకరిస్తున్నావా విరాజీ."
"నిజం __ నీలోవున్న వ్యామోహనికి నిజం ముసుగుక్రప్పి ఆత్మవంచన చేసుకోవటల్లేదా గౌతం?"
అతను హతాశుడై ఆమె భుజాల మీదనుంచి చేతులు తీసేశాడు.
"నేను ఆత్మవంచన చేసుకుంతున్నానా? ఎంత తేలిగ్గా తీసుపారేశావు విరాజీ?"
విరాజి మాట్లాడకుండా కదలకుండా అలాగే నిలబడి వుంది.
"సమాజంలో ఎంతో పేరు సంపాదించాను. డబ్బూ కీర్తి అన్నీ ణను వెదుక్కుంటూ వెంటబడి తరుముతున్నాయి. ప్రజలు నాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఒకరు కాదు యిద్దరు కాదు సన్నారాదించేవారు వందల వెల్ సంఖ్యలో వున్నారు. నేను కనుసైగ చేస్తే చాలు వొచ్చి వాలేవాళ్ళు నా పొందుకోసం సిద్దపడేవాళ్ళు కోకోల్లల్లు."
"అయినా నా కోసం యింకా ఆరాటపడతావేం గవుతం? నీ చుట్టూ యింతమంది బారిభ్రమిస్తూ వుండగా."
"ఎందుకుంటే .... ఎందుకంటే .... నా మనస్సు వాళ్ళ నెవరిని అంగీకరించటము లేదు. వొంటరితనంతో నేను మ్రగ్గిపోతున్నాను. నీకోసం నీ స్మ్రుతులతోనే అల్లాడి పోతున్నాను. నా చుట్టూ జనం పెరిగినకొద్దీ నేను వొంటరివాడనయి పోతున్నాను. నాకు కావాలి విరాజీ, నువ్వు నాకు కావాలి."
"నేను నీకు దక్కను గవుతమ్ , నువ్వు నన్ను దారుణంగా పోగొట్టుకున్నావు.
హఠాత్తుగా విరాజిలోంచి దుఃఖం పొంగి పొర్లి వచ్చింది. సంవత్సరాల తరబడి సాధనతో నియమంతో కూడగట్టుకున్న నిగ్రహం ఒక్కసారి సడలి పోయినట్లయి౦ది.
రెండు చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
గవుతమ్ ఆవేదన నాపుకోలేకపోయాడు. ఆమెను సమీపించి 'విరాజీ' అని పిలుస్తూ దగ్గరకు తీసుకోబోయాడు.
విరాజి అతని చేతులనుంచి తప్పించుకొంటూ వెనక్కి జరిగింది.
"వొద్దు" అంది.
"విరాజీ!"
తెగిపోయిన బంధాన్ని తిరిగి అతకడానికి ప్రయత్నించవద్దు గవుతం.
"బంధం తెగిపోలేదు విరాజీ. తెగిపోదు శక్తి దానికి లేదు."
"కాని తెంచుకునే శక్తి ప్రలోభం మన యిద్దరిలో వున్నాయి గౌతమ్."
"లేవు. లేనంత దృఢ చిత్తుడ్ని కాదు. నా డబ్బూ కీర్తి స్థానం అన్ని వదిలేస్తాను. ఆ సమస్తము విడిచి పేట్టి నీతో వచ్చేస్తాను. వీటన్నిటి నుంచి విముక్తి కలిగించి నన్నిక్కడికైనా తీసుకెళ్ళిపో విరాజీ!"
"ఇక్కడ వుండే మన అన్వేషణ సాగించాలి గాని పిరికి వాళ్ళలా స్వరం త్యజించి ఎక్కడికో పారి పోకూడదు గౌతమ్! ఒకవేళ నాదే పొరపాటు కావచ్చు. కొంతకాలము యిలా ప్రయాణం చెయ్యనియ్యి గౌతమ్. విభిన్న దృక్పథంలో సాగే యీ సమాంతర రేఖల్ని కలపడానికి శుష్క ప్రయత్నాలు చెయ్యవద్దు. కళాకారుడిని సంఘర్షణ వుంటుంది. వేదన వుంటుంది లోపల అగ్నిపర్వతాలు బ్రద్దలవుతూ వుంటాయి. చివరకు మనము ఎక్కడికి చేరుకుంటాయో చూద్దాం గౌతమ్.
ఆకస్మితంగా బాట మళ్ళించడం యిద్దరకూ శ్రేయస్కరం కాదు."
"అంతేనా?" అన్నాడు గౌతమ్ విరశాగా .
ఆమె చూపులు "అంతే" అన్నట్లు జవాబు చెప్పాయి.
ఒక్క నిముషం నిర్ధాక్షిణ్యమైనా నిశ్శబ్దంతో దొర్లింది.
"గుడ్ బై విరాజీ!" అతను తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
* * *
దాదాపు రెండు రెండుమూడు సంవత్సరాల తర్వాత నాదమునిగారి యింటి తలుపులు తెరవ బడ్డాయి.
కారులోంచి బయటకు దిగి యింటి ముందుకు వెళ్ళి చాలాసేపు చూస్తూ నిలబడ్డాడు.
ఎన్నాళ్ళయింది యీ ఊరు విడిచిపేట్టి! తనలో జనించింది విరక్తి కాదు. తానుచేసింది ఓ తపస్సు. ఈ రెండుమూడేళ్ళ కాల వ్యవధిలో తనలో ఎన్ని మార్పులోచ్చాయో, తానెంతటి సంఘర్షణకు గురయ్యాడో ఎవరికీ తెలియదు.
ఇంటికి బూజులు అవి దులిపించి శుభ్రంచేయించి ఓ పద్దతిలో పెట్టటానికి యించుమించు వారం రోజులు పట్టింది.
అతనెక్కడ వున్నా టెలిఫోన్ సేఫ్ కస్టడీలో వుంచి ఎప్పటికప్పుడు రెంట్ పే చేస్తూనే వున్నాడు. ఊళ్ళోకి రాగానే టెలిఫోన్ అధికారులతో మాట్లాడి తిరిగి ఫోన్ ఏర్పాటు చేసుకున్నాడు.
నాదముని ఊళ్ళోకి వచ్చేశాడన్న వార్త నిముషాలమీద ఊరంతా వ్యాపించింది.
అతన్ని చూడటానికి పాత స్నేహితులూ, పత్రికాధి పతులూ రాసాగారు.
ప్రముఖ వారపత్రిక సంపాదుకుడు రమణమూర్తి అతన్ని కలిశాడు.
నాదమునిలో మునపటికన్న వయసేం మీరినట్లు లేదు మనిషి దృడంగా , ఆరోగ్యంగా వున్నాడు. కళ్ళు ఓ వింత తేజస్సుతో మెరుస్తున్నాయి.
"మీరు మళ్ళీ రావటంతో మాకు ఎంతో ఆశాజ్యోతి వెలిగినట్లయింది" అన్నాడు రమణమూర్తి.
నాదముని ఏమీ మాట్లాడలేదు.
"మీరు వెళ్ళిపోయాక ఆ గాఫ్ ని గౌతమ్ పూర్తీ చేశాడనుకున్నాం నిజానికి చేశాడు మీకంటే కూడా వేగంగా ఎదిగి పత్రికాలోకంలో కనీవినీ ఎరుగని పాప్యులారిటి సంపాదించాడు. ఒక రకంగా పత్రికా ప్రపంచాన్ని మకుటంలేని మహారాజులా పరిపాలించాడు. మూడేళ్ళలో పదేళ్ళ జీవితం జీవించాడు. కాని అనుకోకుండా సినిమాలోకంలో అడుగుపేట్టి ఊహించనంత బిజీ అయిపోయాడు. అతనిలో రాద్దామన్న తపన వున్నా టైములేక రాయలేక పోతున్నాడు. ఒక రకంగా విరమించుకున్నట్ట్లే . ఇప్పుడు మీరు గట్టిగా ఓ పట్టుబడితే దేశాన్ని ఊపిపారేస్తారు."
"నాదముని మాట్లాడలేదు. అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు .
ప్రస్తుతం మా పత్రికలో సీరియల్ లో వస్తున్న గౌతమ్ గారి సీరియల్ అయిపో వచ్చింది తర్వాత మీ నవల పారంభించాలని వుంది. మనము ఒక ఒప్పందానికొస్తే పభ్లిసిటీ మొదలు పెడతాను" అన్నాడు రమణమూర్తి మెల్లగా వ్యవహారంములోకి వస్తూ.
"పభ్లిసిటీ ఏమని యిస్తారు. రమణమూర్తిగారూ?" అన్నాడు నాదముని నవ్వి
"మొదట పుల్ పేజీ _ తిరిగి విజ్రుంభించబోతున్న మీ అభిమాన రచయిత. క్వశ్చన్ మార్కు తర్వాత వారం నవల పేరు. ఆ తర్వాత వారం మీపేరు __ యిలా పాఠకుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తూ ....."
"ఇది కోనేళ్ళగా జరుగుబోతున్న పద్దతేగా అన్నాడు నాధముని. సాహిత్యానికి నేను రంగప్రవేశం చేసి చాలావరకూ భ్రస్టు చేశాను. అభిరుచిని కాకుండా పాప్యులారిటీనే రచయితలు అనుకరించే స్థితికి తీసుకు వెళ్ళాను. తర్వాత గౌతమ్ దీన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళి సాహిత్యం అంటే ఇదేనన్న భ్రమను ఎస్టాబ్లిష్ చేసేది యిది తప్ప వేరేకటి చదవలేని అసహనంలోకి దుస్థితిలోకీ పాఠకులికి తీసుకెళ్ళి పోయాడు. అతని పాప్యూలారిటీ సూత్రాన్ని అనుకరిస్తూ డడన్ల కొద్దీ రచయితలు తయారయి పోయారు. తమ అవసరాలకోసం పభ్లిసిటీ మ్యాజిక్ వల్ల కొంతమంది నాన్ రైటర్స్ కూడా రైటర్స్ గా చాలామణీ అవుతూ రొమ్ములు విరుచుకుని విర్రవీగేస్థితికి సాహిత్యం దిగజారి పోయింది."
నాదమునిగారి నోటినుంచి ఇలాంటి వాఖ్య వస్తుందని ఊహించని రమణమూర్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
"నవల మొదలయీ. కాకముదే పాఠకులని యిన్ వాల్వ్ చేస్తూ పోటీలా?అ నవల్లో ఆ పాత్ర అయితే మీరేం చేస్తారు.? ఈ పాత్రఅయితే మీరేం చేస్తారు. ఈ నవల సినిమాగా తీస్తే ఏ పాత్రలకు ఏయే నటులు సరిపోతారు? జవాబుతో ఫోటో తప్పనిసరి పంపించాలి. ఒకప్పుడు పత్రికల్లో ఫోటో పడాలంటే రచయిత పెద్ద ఎచీల్ మెంట్ చేస్తే ప్రచురించబడేది. ఇప్పుడు ఏ పత్రిక చూసినా ఫోటోలమయం. పాఠకుల ఫోటోలు. ఏజంట్ల ఫోటోలు, రేపొద్దున మా పత్రిక ఫార్ చేజర్స్ అందరి ఫోటోలూ వేస్తానంటూ ఒక పత్రిక'ముందుకొస్తే, పర్ చేజర్ అయి ఉండనఖ్కర్లేదు. మా పరిక పాఠకులు అయివుంటే చాలు (ఒక్కో పత్రిక కనీసం పది పది హేనుమంది చదువుతారు.) ఫోటో ప్రచురిస్తాం అని ఇంకో పత్రిక'ముందుకు రావచ్చు. సెక్స్, వయోలెన్స్, సాహిత్యమంటే యిదే అన్న హీనస్థితికి మనం దిగజారిపోయాం"