Previous Page Next Page 
అసిధార పేజి 15

                                      10

    అక్కడంతా బురద ఇసుక కలసిన విధంగా వుంది. ఓ పక్కగా పైనుంచి నీతిధారజారుగా కిందపడి అక్కడినుంచి నలుప్రక్కలకీ పాకి సందుల్లోంచి పోతున్నాయి.

    వాళ్ళయిదుగురూ విసురుగా తలోపక్కకి విసిరేయ బడ్డారు. ఎక్కడి నుంచి వస్తున్న డో గాని అతి తక్కువ కాంతి ఆ చోటంతా విస్తరించి వుంది. దగ్గరగా మనిషి వున్న ఆనవాలు తెలుస్తోంది.

    ముందుగా కృతికి మెలకువ వచ్చింది . పల్చగా పారుతున్న నీళ్ళలో తాను పడివున్నానని తెలుస్తుంది గబుక్కున లేచి కూర్చుంది. ఒళ్ళంతా ఎవరో చితకబాదినట్లు ఒకటేనొప్పులు తానెక్కదున్నానో తెలియక కొద్దిసేపు అయోమయంలో మునిగి ఆపై జరిగింది మననంకాగా తెప్పరిల్లింది.

    టార్చ్ లైట్లు వేలుగుకూ పడువున్నాయి.

    అక్కడే తలోపక్కనా తనవాళ్ళు పడివున్నట్లు చూసి కొంతలో కొంత తృప్తిచెందింది వల్లేస్థితిలో వున్నారో తెలియదు. గబగబ లేచి అందుబాటులో వున్న లైట్లని అర్పెసింది. ఒక టార్చీలైటు మాత్రం చేతిలోకి తీసుకుంది. విజయ్ పడున్నచోటుకి వెళ్ళి అతన్ని చేత్తో కదుపుతూ విజయ్ , విజయ్!" అని పిలిచింది.

    కమల్ తెలివివచ్చి కదిలాడు . కృతి పిలుపు కమల్ కి వినపడింది" "ఏమయింది?" అన్నాడు ఏం జరిగిందో మననం చేసుకోకుండానే.

    "కమల్! లేచి నిశ్చల సంగతి సుబ్బు సంగతి చూడు" కృతి అంది. విజయ్ ని లేవబోయింది ఈలోగా అతనికి తెలివి వచ్చింది.

    విజయ్ లేచి కూర్చున్నాడు.

    నిశ్చల లేచింది.

    సుబ్బారావే బోర్లాపడుకుని వున్నాడు అయితే ముఖం పక్కకి తిరిగివుంది. ముడుచుకున్న చేతిమీద ముఖం వుండబట్టి సరిపోయింది. ముఖం కిందికి కూరుకుని పోయి వున్నట్లయితే వూపిరాడక ఎప్పుడో అతని ప్రాణం అనంత వాయువులో కలసిపోయి వుండేది.

    అందరూ కలసి సుబ్బారావుకి తెలివి వచ్చింది ఇద్దరు చేతులు ఆసరా అమ్దిస్తేగాని పైకి లేవలేక పోయాడు లేస్తూనే "చేయినేప్పంటూ" గిలగిల లాడాడు.

    "నా చెయ్యి విరిగిపోయిందిరోయ్! నాప్రాణం పోయింది నాయనోయ్! నెప్పితో చచ్చిపోతున్నాను బామ్మోయ్!"  నీళ్ళలోనే కాళ్ళు పారజాపి కూర్చుని ఎడంచేత్తో కుడిచేతిని పట్టుకుని రాగం తీస్తున్నాడు సుబ్బారావు.

    అతన్నా తీరులో చూస్తె జాలిమాట ఏమోగాని చూసేవారికి నవ్వురవటం ఖాయం.

    విజయ్ చుట్టూ ఓసారి పరికించి చూశాడు. ఎటు చూసినా దార్లు చూడు వీదిసంగతి నేను చూసుకుంటాను" అని చేతుకున్న తాడునువిప్పెసుకున్నాడు.

    కమల్ వెనుకనే నిశ్చలకూడా వెళ్ళింది.

    విజయ్ కృతి కలసి సుబ్బారావు వీపుకి తగిలించబడ్డ లగేజీ తీసి పక్కన పెట్టారు. "సుబ్బూ నువ్వు కంగారుపడి మమ్మల్ని కంగారు పెట్టకురా! ప్లీజ్ , చేయి విరిగిందో బెణికిందో తెలుసుకోకుండా ముందే విరిగిందని ఆ భయం ఏమిటిరా!" విజయ్ బతిమిలడుతూ అడిగాడు.

    "నా బాధ నీకేం తెలుసురా. బాబోయ్ నెప్పి. ఇది విరగాతమే సరీగా సగానికి విరిగివుంటుంది. అందుకే యింతనొప్పి నా బాధ నీకొస్తే తెలిసేది నాయనోయ్"

    "నాకొస్తే తెలిసేది కాదురా అదేదో నాకేవస్తే బాగుండేది. ఆ బాధ ఏదో నేనే పడేవాడిని" విజయ్ అనంగానే సుబ్బారావు నోరు మూసుకుని ములుగుతొఇఒ వుండిపోయాడు.

    "విజయ్!" కమల్ వస్తూ గట్టిగా పిలిచాడు.

    చటుక్కునలేచి నుంచుని "ఏమైంది?" అన్నాడు విజయ్.

    మళ్ళీ ఏం ప్రమాదం వచ్చి పడనుందో అనుకుంది కృతి.

    "ఏం కాలేదు. ప్రక్కన గుహల్లో రాతినేల మట్టినేలా వుంది. విశ్రాంతిగా గడుల్లాగా ఉన్నాయి అక్కడి కెళదాం పదండి" కమల్ చెప్పాడు

    కృతి .పరుగెత్తినట్లు కమల్ ప్రక్కనుంచి వెళ్ళింది.

    "విశ్రాంతి గదులేమితిరా కమల్ సుదర్శన్ రైల్వే వాళ్ళు మన కోసం విశ్రాంతి గదులు కట్టించారా ఏంటి బాబోయ్ ఈ చేతినొప్పి కాదు గాని నా ప్రాణం పోతున్నది. వరేయ్ ఆ గదుల్లో అదే గుహల్లో సింహాలు పులులు...... నాయినోయ్ చేయ్యినోప్పి......."

    "ఒరేయ్ సుబ్బూ! ఏమయిందిరా ! కొండరాళ్ళు ఎగిరేలా అరుస్తున్నావ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వుంది. నీచేతి సంగతి చూస్తాం ముందు ఇక్కడినుంచిలే. పొడి నేలమీద తీరుబడిగా కూర్చుని రాగం తీద్దువుగాని" అంటూ కమల్ చేయి అందించాడు.

    "నీవు కూర్చున్న తీరు బాగుందిరా సుబ్బాయ్" అంటూ సుబ్బారావు నడుం పట్టుకుని పైకిలేపాడు విజయ్.

    "కాళ్ళు తిమ్మిరేక్కాయిరా!" సుబ్బారావు మళ్ళీ కూలబడిపోబోతూ అన్నాడు.

    కమల్ నీవటు పట్టుకో నేనిటు పట్టుకుంటాను వూ ..... పదరా!" అంటూ విజయ్ సుబ్బారావుని కూర్చోకుండా చేసి ముందుకు నడిపించాడు.

    ముగ్గురూ పక్కగదిలోకి దారితీశారు.

    దానిని గుహా అనేబదులు గది అనొచ్చు విశాలంగా చక్కగా వుంది. సగంమేర పెద్ద బండరాయి పరచివుంది సగంమేర మట్టిఉంది. మనిషి ఆనవాలు తెలుస్తూ కొద్ది వెలుతురూ వుంది.

    వీపునున్న లగేజీ తీసి అంతా ఒపక్కన పెట్టరు.

    "కమల్! మనం ఎక్కడకొచ్చి పడ్డామో ఈ చోటు ఎలాంటిదో మనకి తెలియదు దీన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం . నీవు దూరంవెళ్ళక అటూ ఇటూ చూసు. కొంత పరిశీలించు చాలు. వీడి సంగతి నేను చూసుకుంటాను" అనంగానే కమల్ టార్చ్ లైట్ చేతికర్ర పట్టుకుని వెళ్ళిపోయాడు "కృతీ! ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఇవ్వు" అన్నాడు ఆ తర్వాత విజయ్.

    లగేజీ విషయంలో ముందు నుంచీ వాళ్ళు జాగ్రత్తపడ్డారు. అన్నీ ప్యాక్ చేసిమ్తరువాట పల్చని రవ్వరు కవరు వాటికి తొడిగారు. అందుకని ఏ సామానూ తాదవలేదు వాళ్ళు ధరించిన దుస్తులుకూడా వాటర్ ప్రూఫ్ దుస్తులే.

    కృతి తన ప్యాకేజీని విప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసిచ్చింది

    సుబ్బారావు చేయి విరగలేదు బాగా దెబ్బ తగిలి బెణికి౦ది అంతే. ఐడేక్స రాస్తే చాలని అర్ధం చెసుకున విజయ్ ఐడేక్స్ రాస్తూ చేతిని తోమాడు.

    ఆ ప్రదేశం ఎలాంటిదో తెలియదు కాబట్టి కమల్ వచ్చిందాకా అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నారు.

    కొద్దిసేపటిలోనే కమల్ తిరిగి వచ్చాడు.

    కమల్ రావటం చూసి "ఏంరా పులులు తోడేళ్ళు కనిపించలేదుకదా?" కాస్త భాధతగ్గిన సుబ్బారావు అడిగాడు.
"   
    "అవి కనిపిస్తే నేను మీకు కనిపించేవాడినికాదు , మైండిట్?" అంటూ కమల్ వచ్చి విజయ్ పక్కనే కూర్చున్నాడు.

    "విజయ్ ! ఈ ప్రదేశం ఏమిటో తమాషాగా వుందిరా! గుహాలోంచి గుహావుంది ఇటుపక్క కెళ్ళాలంటే అటుపక్కకెళ్ళే విధంగా ప్రతి గుహలోంచి పక్క గుహల్లోకి రెండుమూడు నాలుగు ద్వారా లున్నాయి పైగా అన్నీ ఒకేరకంగా వున్నాయి. దీనితుది మొదలు పట్టుకోవడం కష్టం."

    "దీనినిబట్టి ఆలోచిస్తే ఇలాంటి గుహాలు పదిదాకావుంటే ఫరవాలేదు లెక్కలేనన్ని వున్నాయనుకో తిఎరిగిన గుహలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటా౦ అవునా?"

    "సందేహంలేదు సరీగా అంతే. ప్రస్తుతం మనం విశ్రాంతి తీసుకుని . తర్వాత ఏమి చేయవలసింది ఆలోచిద్దాం" కమల్ అన్నాడు ధరించిన బట్టలు విప్పేస్తూ.

    "కొద్దిగా ఆహారం తీసుకుని తీరుబడిగా మేనువాల్చి ఏం చేయాలో చర్చిద్దాం కృతి నిశ్చల మీపని మీరు కానీండి . ఇక్కడ పడుకోవటానికి చోటువుంది. పక్కనే తాగటానికి నీళ్ళు వున్నాయి. ప్రస్తుతానికి ప్రమాదకరమైన జీవులు లేవనే అనుకుందాం . ప్రమాదమంటూ ముందుకొస్తే అందరం కలసి చావో బ్రతుకో ఎదుర్కో౦దా౦, అన్నట్లు మరోమాట ఎవరూ ఇమ్తరిగా తమాషాగా చూద్దామని ఒకగుహా లోంచి మరో గుహలోకి పోవద్హు ఇక్కడ అన్ని గుహలూ ఒకేలా గున్నాయని ప్రతి దాంట్లోంచి మార్గం వుందని కమల్ చెప్పాడు. అలా వెళ్ళిపోయావంటే మన మార్గాలు వెరవుతాయి. తర్వాత ఎఅనుకున్నా లాభంలేదు" విజయ్ ద్రాస్ విప్పి మరో ద్రాస్ ధరిస్తూ అన్నాడు.

    "నేనుమాత్రం పోనురాబాబూ" సుబ్బారావు అన్నాడు.

    "నెప్పి కాస్త తగ్గినట్టుంది. హుషారుగా వున్నావ్?" కమల్ అడిగాడు.

 Previous Page Next Page