Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 14

    అంతేకాదు __ ఆమె తనూ శైలజ, బాబులతో కలసిపోయి వాళ్ళలో ఒకతెగా మసలడం నేర్చుకుంది.
    బాబుకు ఆ విధంగా వసంతలక్ష్మి కూడా బాగా అలవాటయింది. శైలజ చెప్పానవసరంలేకుండానే బాబుకు వసంతలక్ష్మి పైన సదభిప్రాయం కలుగుతున్నది.
    తను ఉదయకు పోటీనుంచి తప్పించినట్లూ, ప్రసాదు ను సాధించినట్లు వసంతలక్ష్మి భావించసాగింది.
                                    17
    ప్రసాదుతో మాట్లాడివచ్చేక నిరంజనరావు ఉద్యోగం విషయమై బాగా ఆలోచించాడు.
    ఈరోజుల్లో ఉద్యోగం దొరకడం మాటలుకాదు. అదృష్టదేవత కరుణించడమంటే ఇదేకాబోలు. ప్రసాదు పెట్టిన షరతుకూడా అవమానకరంగా లేదు. నిజంచెప్పాలంటే ప్రసాదు యోగ్యుడు. మొహమాటానికి పోయి తనకేమీ కాని ఒక ఆడపిల్ల పెళ్ళి కోసం తాపత్రయ పడుతున్నాడు. తానె అతడికి అనవసరంగా అన్యాయంచేశాడు. బాబుమనసులో విషంపోశాడు. తాను పోసిన విషాన్ని తానె వెనక్కు తీయాలి.
    ఆ సంగతలాగుంచితే తానిప్పుడు ఉదయ, వసంతలక్ష్మిల్లో ఎవరిని ఎన్నుకోవాలి?
    ఇద్దరూ అందమైనవాళ్ళు మంచివాళ్ళు అప్పుడప్పుడు మాటలతోతనను భాధించినా అది ఉద్దేశ్యపూర్వకంగా కాదు.
    ప్రసాదు ఉద్యోగంగురించి  చెప్పనప్పుడు ఆ అమ్మాయిలిద్దరిపైనా నిరంజనరావుకు దురభిప్రాయం  ఏర్పడింది. కానీ తన భవిష్యత్తు వారితో ముడిపడి ఉందనీ తెలియగానే అదితనకు అనుకూలంగా ఉన్నదని గ్రహించగానే అతడు మనసును సరిపెట్టుకుని ఆ అమ్మాయిల్లోని మంచి గుణాలన్నీ విశేషాలుగానూ, చెడ్డగుణాలన్నీ మానవ సహజంగానూ భావించాడు అదీగాక ఆడదానికెంత పోగారున్నా పెళ్ళి కాగానేభర్తకు పూర్తిగా లొంగికతప్పదని అతడు నమ్ముకున్నాడు. అలా తను లొంగదీసుకోగలిగిన అమ్మాయి ఆ ఇద్దరిలో వసంతలక్ష్మి మాత్రమె అని అతడి ఉద్దేశ్యం, ఉదయ అంటే అతడికి కాస్తభ్యముంది చాటుగా అమెగురించి ఏమనుకునా ఎదురుగా అమెనేమీ అనలేడతడు. వసంతలక్ష్మి కాస్త మెతనిమనిషి.    
    తన వసంతలక్ష్మి వివాహంచేసుకోవాలని ఆతడనుకున్నాడు. అందువల్ల మరో ప్రయోజనంకూడా వుంది. ఇద్దరిలో టాను వసంతలక్ష్మిని ఎన్నుకున్నాడంటే ఉదయ మనసు గాయపడుతుంది ఇద్దరిలో టాను వసంతలక్ష్మి ని ఎన్నుకున్నాడంటే ఉదయ మనసు గాయపడుతుంది. మరోవిధంగా ఆమె ఆహాన్ని దెబ్బతీయగల అవసరం ఇంతవరకూ అతడికి రాలేదు.
    ఈనిర్ణయానికి వచ్చేక అసలు సమస్యఎదురయిందతడికి. తనకుద్యోగం వస్తే ఆడపిల్లలు తల్లిదండ్రులు  తన చుట్టూ తిరగాలితప్పితే తనే ఓ అడపిల్లను __ పెళ్ళిచేసుకుని అడగడం చిన్నతనంగా వుంటుంది. వసంతలక్ష్మికి తన సందేశం ఎలా అందుతుంది?
    బాగా అలోచించక అతడిలో ఉపాయం తట్టింది.
    ఒకసారి ఉదయ మగవాళ్ళను మగవెధవలని తిట్టింది. నిరంజనరావు. కుధ్యోగంవస్తే అతడిలో మార్పువస్తుందనీ,  ఆశయాలు మరచిపోగాలడనీ సవాలుచేసింది.
    అసవాలుకు బదులిచ్చే అవకాశం ఇప్పుడోచ్చింది.
    వివాహ విషయంలో నిరంజనరావు తల్లిదండ్రులను సంప్రదించదల్చుకోలేదు. తన ఎన్నిక పూర్తయినాక వారికి తెలపాలని ఆతడనుకున్నాడు.
    రెండురోజుల్లో అతడికి అవకాశం వచ్చింది.
    ఆ రోజున అతడు శివరావు ఇంట్లో ప్రయివేటుపూర్తీచేశాక  అక్కడికి వసంతలక్ష్మి వచ్చింది. ఆమెను చూస్తూనే అతడు "ఈమధ్య మీ స్నేహితురాండ్రిద్దరినీ కలిపిచూసింది చలాతక్కువ ఈరోజు నేను మీ ఇద్దరికీ కలిపి ఒక విశేషం చెప్పాలనుకుంటున్నాను" అని ఇంకా అక్కదేమన్న రవితో __"ఒక్కసారి వెళ్ళి మీ అక్కను పీల్చుకునిరా. నేను రామ్మనాననీ అక్కడే శివరావు అక్కకూడా వున్నదనీ చెప్పు" అన్నాడు.
    రవి ఇంటికి వెళ్ళేసరికి ఉదయ నీలతో మాట్లాడుతున్నది. బాబు శైలజపైనే మోజుపడుతూ నీలనూ నిర్లక్ష్యం చేస్తున్నాడని అది వాపోతున్నది. ఉదయ అసహనాన్ని తనలోనే అణచుకుని __ "సైలూ తేలివైనది. నువ్వు మావుద్దువి అందుకే నీతో ఆడటంలేదు. అవునా?" అంది.
    "అదేంకాదు శైలజకు మంచి అమ్మవుంది. మా అమ్మ మంచిదికాదు. వాళ్ళమ్మ ఎంతమంచిదంటే నాకూ వెళ్ళివాళ్ళింట్లోనే ఉండిపోవాలనిపిస్తోంది" అంది నీల అమాయకంగా.
    ఉదయ ఇంకా ఏదో అనేలోగా రవివచ్చి విషయంచెప్పాడు. నిరంజనరావు తామిద్దరితోనూ కలపి మాట్లాడుకోవాలనుకోవడం  ఆమెకు విడ్డూరంగా తోచింది, ఇందులో వసంతలక్ష్మి పాత్ర ఏదీలేదుగదా అని కాస్తభయపడిందికూడా.
    బాబు మనసు గెలవడంలో వసంతలక్ష్మి తన్నోడించింది. కానీ తను కోటలోనే పాగావేయాలి.  ఎలాగోఅలా ప్రసాదు ని వివాహం చేసుకోగలిగితే అప్పుడు బాబుమాత్రం ఏంచేయగలడు?
    ఉదయ నిరంజనరావుతో మాట్లడాటానికి వెళ్ళింది. నీల వాళ్ళింటికి వెళ్ళిపోయింది.
    అమెరాగానే "రండి , రండి__ మీకోసమే ఎదురుచూస్తున్నాను" అన్నాడు నిరంజనరావు.
    వసంతలక్ష్మి కూడా అతడేంచెబుతాడా అని కూతుహలంగా ఎదురు చూస్తోంది.
    అప్పుడు నిరంజనరావు "ఇందులో పెద్ద సస్పే౦షయలేదు. మగాళ్ళు అవకాశవాదులనీ, వాళ్ళ ఆశయాలు తాత్కాళికంగా ఒకసారి మీరన్నారు ననుద్దేశించి అనకపోయినా మగవేధవలనే పద ప్రయోగం కూడా చేశారు. ఇప్పుడు నాకు ప్రసాదుగారి కంపెనీలో వుద్యోగం వచ్చింది. నెలకు ఏడో౦దలయాభై జీతం. ఇప్పటికీ నా ఆశయాలేంమారలేదు. కానీ కట్నంలేకుండా పైసా పెళ్ళి ఖర్చు లేకుండా పెళ్ళిచేసుకొదలిచిచాను. కానీ కట్నంలేకుండా పైసా పెళ్ళిఖర్చులేకుండా పెళ్ళిచేసుకోదల్చుచాను. ఈ విషయం ఏ ఆడపిల్ల తండ్రికైనా మీరుచెప్పొచ్చు" అన్నాడు.
    వసంతలక్ష్మి , ఉదయకూడా ఆశ్చర్యంగా __"మీరేమంటున్నారో అర్ధం కావడంలేదు" అన్నారు.
    నిరంజనరావు సగర్వంగా తన ఆశయాల గురించి చెప్పుకుని _-"నేను మాటంటే మాటే! నేను అవకాశ వాదిని కాదు. మీరనే మగవెధవలజాతికి చెందను. ఒకనాడు మీరు నన్ను సవాలుచేశారు కాబట్టి పిలిచి ఈవిషయం చెబుతున్నాను." అన్నాడు.
    వసంతలక్ష్మికీ, ఉదయకూ అతడి అభిప్రాయంఅర్ధమయింది నిస్సం దేహంగా అతడు తనలో ఒకరిని వివాహం చేసుకోవలనుకుంటున్నాడు ఐతే ఇద్దరూ కూడా అప్పటికా విషయమేమి తేలకుండా అతన్ని అభినందించి __ "మీ వంటి యువకులే మహిళలకు ఆశాజ్యోతులు. భావిపౌరులకు మార్గదర్శికులు " అని పొగిడారు.
    ఉబ్బిన ఛాతీలో అక్కణ్ణించి వెళ్ళాడు నిరంజనరావు.
                                  18      
    ఉదయ తీవ్రాలోచనలోపడింది.
    నిరంజనరావు మంచివాడు. అమాయకుడు అలాంటివాడు భర్తయితే తను కొంగున ముడివేసుకుని ఆడించగలదు. జీవితంలో సుఖపడనూగలదు.
    ఇది అనుకోకుండా  వచ్చిన  అవకాశం .
    ఈ రోజుల్లో మధ్యతరగతి  అడపిల్లకు  ఇలాంటి అవకాశాలు అరుదు.
    ఇప్పుడు తనెంచేయాలి?
    తల్లికీ విషయం చెప్పాలా?  చెబితే ఈ పెళ్ళి జరిగిపోతుందా? మరి వసంతలక్ష్మి ఈ విషయమై పోటీపడదా?
    వసతలక్ష్మి ఎందుకు పోటీపడుతుంది? ఆమెకు ప్రసాదు ఉండనే వున్నాడు. తను నిరంజనరావును పెళ్ళిచేసుకుంటే పోటీ తగ్గుతుందని ఆమె సంతోశిస్తుందికూడా !
    అంటే వంసతలక్ష్మి  తనతో పొట్టీపడదు. మొదటి పెళ్ళి నిరంజనరావును వదిలి రేండోపెళ్ళి ప్రసాదు నే చేసుకుంటుంది. అప్పుడు.....
     ఆప్రయత్నంగా  ఆమె ఆ పురుషులిద్దరినీ సరిపోల్చుకుంది.
    వయసులో నిరంజనరావు చిన్నవాడు. ఇంతవరకూ అవివాహితుడు. అనగా స్త్రీ స్పర్శ ఎరుగనివాడు.
    "నా సుపద్ర" __ అన్నమాటలు ప్రసాదు నోటవిన్నప్పుడామేక దోరకమైన జుగుప్సాభావం కలిగింది. నిరంజరావుతో జీవనంలో అటువంటి భావాలకు అవకాశంలేదు. ఇద్దరూ ఒకరికి ఒకరు...... ఒకరికోసం ఒకరు.....
     అటుపైన బాబుఒకడు. ప్రసాదుని వివాహం చేసుకుంటే బాబుకు  తల్లి కావాలి, వాడు తనను అమ్మా అనో పిన్నీ అనోపిలుస్తాడు. వాడికీ తనకూ ఏవిధమైన అనుభందమూలేదు. కానీ ప్రసాదు కు మరో స్త్రీతో ఉన్న అనుబంధానికి చిహ్నంవాడు. ప్రసాదు కు తన రెండవభార్య అన్న విషయం అనుక్షణం గుర్తుచేస్తాడు వాడు.
    నిరంజనరావు తో అయితే _అటువంటి ఇబ్బందేమీ వుండదు.
    ఉదయ అలోచుస్తున్నకొద్ది నిరంజనరావు  భర్తగా లభించడం అదృష్టమన్న భావన పెరిగిపోసాగింది. అదేసమయంలో ఆమె లోతుగా భవిష్యత్తు లోనికి వెళ్ళింది. అందుకు కారణం తనుసుఖజీవనంచేస్తూ  వసంతలక్ష్మి పై  జాలిపడవలెనన్న కోరిక....
    వసంతలక్ష్మి రేండో పెళ్ళివాడి భార్య, అతడి మొదటిభార్య బిడ్డకు తల్లి. అప్పుడామే మనఃస్థితి ఏకా వుంటుంది? అందులోనూ ఉదయ, నిరంజన రావుల దాంపత్యజీవితం చూసినప్పుడు......
    అమెతప్పక కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది పోసుకుని.....
    పోసుకుని ఏంచేయగలదు? తనను గానీ నిరంజనరావుగానీ ఆమె ఏం చేయగలదు?
    అప్పుడు అసలు విషయం స్ఫురించింది ఉదయకు....
    వసంతలక్ష్మి భర్త కారణంగానే నిరంజనరావుకుద్యోగం వచ్చింది. అమెతలచుకుంటే నిరంజనరావు వుద్యోగం పీకించగలదు.
    ప్రసాదు అధికారి భార్య. తను గుమస్తాభార్య.
    ఆమెకార్లో తిరిగితే తను రిక్షాలో వెళ్ళాలి. ఆమె తనముందు మహారాణిలా తలఎత్తుకుని తిరుగుతూంటే తనుబహవం భయంగా తలవంచుకుని తిరగాలి. అమెకోరితే  చిన్నచిన్నపనులు చేసిపెట్టాలి తనఅవసరకోసం ఆమెను మంచి మాటపడాలి. తనభర్త ప్రగతి ఆమె అభిమానంపై ఆధారఅప్దివున్నది.
    వసంతలక్ష్మిది  ఎత్తైన అంతస్థు తనది.....
    ఆ ఊహా భయంకరంగా తోచింది ఉదయకు.
    ముందిత లోతుగా అలోచించలేదామే. చూస్తూ చూస్తూ తను స్నేహితురాలికి ఊడిగం చేయలేదు.

 Previous Page Next Page