Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 13

    నిరంజనరావు తెల్లబోయాడు. సవతి తల్లి గురించిన భయంకర గాధలన్నీ తానె చెప్పినట్లు బాబుగానీ  ఆయనకు చెప్పేశాడేమో, అందుకే చీవాట్లు పెట్టడానికి తనను పిలిచాడని అతడనుకున్నాడు. ఉన్న ఫలంగా అనుకోకుండా ఇలా ఉద్యోగం ఆఫర్ వచ్చేసరికి అతడికి కాసేపు అంతా అయోమయంగా తోచింది. వీలైనంత త్వరగానే తేరుకున్నాక __"మనకున్న పరిచయం అంతంతమాత్రం. ఇలా మీరు పిలిచి నా గురించి ఉద్యోగం చూడడం. ఆశ్చర్యంగా వుంది" అన్నాడు నిరంజనరావు.
    "ఇది  నాకూ ఆశ్చర్యంగానే వుంది. ఉద్యోగాలంటే సిఫారసులోపో, లంచాలూ కావాలి. లేదా ఏళ్ళ తరబడి ఎదురుచూడాలి. వెతుక్కుంటూ ఇలా ఉద్యోగం రావడమన్నది చాలా అరుదు. అయితే ఏ ప్రయోజనమూఅశించకుండా నేను మీకీ సాయంచేయడంలేదు" అన్నాడు ప్రసాద్.
    నిరంజనరావు అనుమానంగా ప్రసాదు వంక చూశాడు. ఈ రోజుల్లో ఇలా పిలిచి ఉద్యోగమివ్వడమంటే తప్పకుండా ఏదో ప్రయాజనముండే ఉండాలి అదేలాంటి ప్రయోజనమో __ తనకు అనుకూలమైనదో, కానిదో!
    "చెప్పండి " అన్నాడు నిరంజనరావు.
    "ప్రయోజనమన్నానని స్వార్దం అనుకోకండి మన సంప్రదాయాలకు సంబంధించినకొన్ని దురాచారాలకు ఖండి౦చడానికి  ఉడతాభక్తిగానే చేస్తున్న నేను ఇది" అన్నాడు. ప్రసాదు ఉపోద్ఘాతంగా తర్వాత అతడు తనకు గంగాధరం గారితోటి, సుభ్రమణ్యంగారితోటీ ఏర్పడిన పరిచయం గురించి చెప్పాడు.
    "మాటల సందర్భంలో వాళ్ళు నాతో అన్నారు __ వాళ్ళపిల్లలమేమైనా సంభందాలు చూసిపెట్టమని! ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లిలంటే మాటలు కాదు కట్నలోకఎత్తు. పెళ్ళిఖర్చులు మరోఎత్తు ...." అన్నాడు ప్రసాదు.
    సంబాషణ దేనికి దారితీస్తుందో నిరంజనరావుకు అర్దమయింది.
    గంగాధరం, సుబ్రహ్మణ్యంగారాలు అతడికీ తెలుసు. అతడిలో వారేప్పుడూ పెళ్ళి గురించి మాట్లాడలేదు. ప్రసాదు తో మాట్లాడేరెంటే __ అతడిని సంబంధాలు చూడమనికాదు. అతడినే పెళ్ళి కొడుకుగా వారు భావిస్తున్నారు. ప్రసాదుకావిషయం అర్ధమయ్యే ఉంటుంది. అతడికి వాళ్ళిద్దరూ నచ్చలేదో లేక రెండోపెళ్ళిఅయినా పెద్దేత్తులో ఉన్నదో! అతడి దృష్టిలో తనుపడ్డాడు. ఉద్యోగాన్ని ఎరగా చూపించి చవగ్గా పెళ్ళికుదర్చాలనుకుంటున్నాడు.
    తనేం చేయాలి?
    "పెళ్ళి ఆర్భాటంగా జరక్కూడదు కట్నం ప్రసక్తి ఉండకూడదు. అయిదువేలరూపాయల్లో మొత్తం పెళ్ళి ఖర్చు తేలిపోవాలి. ఈ షరతుల మీకు అంగీకారయోగ్యమైతే రేపెవచ్చి మీరు ఉద్యోగంలో చేరవచ్చు. కానీ ఉద్యోగంలో చేరేముందో పెళ్ళి జరిగిపోవాలి . పెళ్లయ్యాక నే ఉద్యోగం " అన్నాడు ప్రసాదు.
    ప్రసాదు తన షరతులను కచ్చితంగానే చెప్పాడు. అందుకు నిరంజనరావు కోప౦రాలేదు.
    పెళ్ళిచూపుల్లో ఆడపిల్లకు కన్నోంకరా కాలోంకరా ఉన్నదేమోనని పశువును పరీక్షించినట్లు పరిశీలిస్తారు. అసహయురాలైన ఆడపిల్ల సహిస్తుంది.
    ఉద్యోగమిచ్చేటప్పుడు అవమానకరమైన షరతలు విధిస్తున్నారు. నిరుద్యోగి భరిస్తాడు.
    ఆడపిల్లకు పెళ్ళి __ మగవాడికి ఉద్యోగం......
    ఈదేశంలో అరుదైన వరాలవి!
    ప్రసాదు చెప్పకుని పోతున్నాడు. ఆ ప్రకారం వసంతలక్ష్మి ఉదయాలలో ఒకామెను నిరంజనరావు వివాహం చేసుకోవలసి వుంది.
    "ఇది నా జీవితానికి  సంభందిచిన సమస్య! మా పెద్దలతో సంప్రదించేకబాగా ఆలోచించుకుని మీకుచెబుతాను" అని నిరంజనరావు వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళిపోగానే ప్రసాదు తేలికగా నిటూర్చాడు.
    వసంతలక్ష్మి, ఉదయ వీరిలో ఎవరినేన్నుకోవాలో తెలియక అతడు సతమతమావుతున్నాడు. ఇద్దరూ అందంగా వుంటారు. ఇద్దరూ తనకోసం ప్రయత్నిస్తున్నారు. ఇరుకుటుంబాలూ అతడిపట్ల సహృదయాన్ని ప్రకటిస్తూన్నాయి.  అటువంటి పరిస్థితుల్లో వారిలో ఒకరిని మాత్రమె ఎన్నుకుని రెండేవవారితో శత్రుత్వం తెచ్చుకోనడం అతడి మనసుకు నచ్చలేదు.
    మొదట్లో అతడు తన పూర్తిగా మిగిలిన అమ్మాయికి తనే వరుణ్ణి వెతికి తెవాలనుకున్నాడు. కానీ రెండు కుటుంబాలనుంచి వస్తున్నా  ఒత్తిడిచూసేక  ఇద్దరిలోనూ ఒకరిని తప్పిస్తే తప్ప తనకు శాంతి ఉండదని అతడు గ్రహించాడు.
    ఇప్పుడు నిరంజనరావు ఆ ఇద్దరమ్మాయిల్లోనూ  ఒకామెను ఎన్నుకుంటే మిగిలిన అమ్మాయిని అమ్మాయిని  తను కలసి బాబు మనసును మార్చావచ్చును.
    దోషం తనమీదకు రాకుండా వుండడంకోసం  ప్రసాదునిరంజనరావుని ఎన్నుకున్నాడు. అటుపైన ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు.
    అయితే ఫలితం తనూహించని విధంగా వుంటుందని అప్పటికితడికి తెలియదు.
                                                                        16
    మొదటి రోజునే శైలజ బాబును నీలకుమించి ఆకర్షించగలిగింది. ఐతే అది వసంతలక్ష్మి గురించి బాబుకు ఏమీ చెప్పలేదు.
    అన్నీ తన  తల్లినిమించి ఉదయను పోగొట్టడం డానికి నచ్చలేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా తల్లి తర్వ్తనే అని దాని నమ్మకం .
    కాసేపు డానికీ నీలకు వాదన అయింది.
    "నీవన్నీ అబద్దాలు. అమ్మ నువ్వు చెప్పినట్లేమీచేయదు. " అంది నీల
    "ఏమో __ మా అమ్మకూడా నాకలాగేచేసేది" అన్నాడు బాబు. వాడికి తల్లి గుర్తుకువస్తోంది.
    "చూశావా __ బాబుకూడా నా పార్టీయే " అంది శైలజ.
    నీలకు దుఃఖం వచ్చింది "నేను నిజం చెబుతున్నాను.  మరి మామ్మ అలాచేయదు" అంది.
    నీల తల్లిదండ్రులిద్దరూ  ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో నీల తండ్రి విధవక్కగారు సాయంగా వుంటున్నది. నీల తల్లి ఎప్పుడూ చిరాగ్గా వుంటుంది. సాయంగావుంటున్న విధవక్కగారికి ఎప్పుడూ రోగమే! పనిచేయదు. సరిగదా  అదపడుచు అధార్టీ కూడా ఎక్కువ. ఆవిడా నోటికి భయపడి నీల తండ్రికూడా ఏమీ అనడు. ఆవిడగురించి ఇంట్లో తరచుగా దెబ్బలాటలవుతుంటాయి.
    నీలకు తల్లిదండ్రులు అన్నీ కొంటారుకానీ ఆదరణ ఒక్కటే కొంటే లభించేది కాదని వారు తెలుసుకోలేకపోయారు. నీలకు ఇల్లొక నరకం. అదెప్పుడు  బయట తిరగాలనే చూస్తుంది. అది ఇంటిపట్టునవుండదని పెద్దవాళ్ళ ఫిర్యాదు. ఇంట్లో దాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు జరగడంలేదనికానీ అలా జరగవలసిన అవసరమున్నదనిగానీ  వారు గుర్తించరు.
    పిల్లలనాట్టే చేరదీయని ఉదయవద్దకు నీలతనే స్వయంగావెళ్ళి కబుర్లు చెబుతూండేది. క్రమంగా ఉదయకు అదంటే ముద్దుపెరిగింది వీలునపుడల్లా దానితో కబుర్లు  చెప్పేది. ఉదయకబుర్లు ఆసక్తికరంగా ఉన్నా లేకపోయినా అసలంటూ తనతో కబుర్లు చెబుతోందికదా అని ఆమెను వదిలేది కాదు ఇటీవల ఉదయకు నీలపిల్ల ప్రయోజనంకూడా కనిపించింది.  ఆ విధంగా బాబుకూ దానికీ పరిచయమయింది.
    తనకు చేతనైనంతలో ఇంటి పరిస్థితులు నీలవాళ్ళ కు చెప్పేది.
    "అయ్యో __ పాపం__ మీ ఇద్దరీ ఒకటే కథ" అని శైలజ వాళ్ళిద్దరి మీదా జాలిపడింది. అంతేకాకుండా "పోనీ మాయింటికివచ్చి అడుకోకూడదు అమ్మకూడా సాయంచేస్తుంది" అని వాళ్ళకు చెప్పింది.
    బాబుకు శైలజ తల్లిని చూడాలనివుంది.
    ఆరోజునుంచి నీల, బాబు, శైలజ ఇంటికివెళ్ళి ఆడుకునేవారు అక్కడ నిజంగానే వాళ్ళకు ఆటపాటల్లో వరలక్ష్మి ఎంతగానో సహకరించేది.
    గుజ్జున గూళ్ళు వండుకుంటామంటే వాళ్ళకు కొద్దికొద్దిగా పప్పులవా అవీ ఇవ్వడమేకాగ చిన్నగిన్నెలో పిండివంటకూడా చేసిపెట్టేది.
    "మా అమ్మ పిలక బ్రహ్మడికథ ఎంతోబాగా చెబుతుంది__ "అని పిల్లలిద్దరికీ చెప్పి __ తల్లిచేత వాళ్ళకూ ఆకథ  చెప్పుంచేది.
    వరలక్ష్మి పిల్లలకు ఆసక్తికలిగే విధంగా, వాళ్ళను నవ్వించేవిధంగా పిలక బ్రాహ్మడి కథనుచెప్పెది.
    రోజూ అదేకథవిన్నా ఆపిల్లలకు విసుగువచ్చేదికాదు. అడిగిమరీరోజూ ఆకథ చెప్పించునేవారు.
    బాబుకు క్రమంగా శైలజ ప్రాణం అయిపోయింది. ఈ మాత్రం వీలుదొరికినా  వాళ్ళింటికీ పోతాననీ గోలపెట్టేవాడు.
    శైలజ ధర్మనూ అనిబాబు పిల్లలలోకంలో పడ్డాడు.  ఆ వీధిలోని తమ ఈడు పిల్లలతో కలుసుకుని వాడు సరదాగా అడుకునేవాడు. ఆటల్లో ఎవరినీ శైలజవంటిమీద చేయివేయనిచ్చేవాడుకాదు. ఒకసారి ఓ ఆరేళ్ళ కుర్రాడు శైలజ మీద దుమ్మువిసిరి పారిపోతే __ బాబువాడిని తరిమితరిమి పట్టుకుని నాలుగు ఉతికాడు. ఆ కుర్రవాడు బాబుకంటే బలంగావున్నాడు. బాబుచేత దెబ్బలుతినగానే వాడికి పౌరుషం వచ్చి తనూ బాబును నాలుగుతన్నాడు. బాబుకు పెదిమిచిట్లి రక్తంవచ్చింది. వాడుభయపడి పారిపోయాడు.
    శైలజ బాబుకు తన ఇంటికి తీసుకుని వెళ్ళి జరిగింది చెప్పింది. వరలక్ష్మి వెంటనే వాడికి ప్రధమ చికిత్సచేసి__ "అల్లరిపిల్లతో అడకండి. చక్కగా మా యింట్లో కూర్చుని ఆడుకోండి." అని సలహాకూడా ఇచ్చింది.
    బాబు శైలజనూ, వరలక్ష్మి నీ నిశితంగా  పరిశీలిస్తూలిండేవాడు వాడికి తల్లి గుర్తుకువచ్చి ఏడుపుకూడా వచ్చేది. వాలిద్దర్నీ అలా చూస్తుంటే వాడికి తనేం పోగొట్టుకున్నాడో స్ఫురించేది.
    వరలక్ష్మి  వాడి బాధను కొంతైనాఅర్ధంచేసుకుంది. తల్లిలేని పిల్లడాన్న జాలితో ఆమె వాడికి తనవద్ద కన్నబిడ్డకుండాల్సిన చనువుకూడా ఇచ్చింది.
    మధ్యమధ్యలో వసంతలక్ష్మి శైలజకు అడుగుతూండేది. __ బాబుకు తన గురించి చెబుతోందా అని!
    శైలజకు బాబు దగ్గరున్నప్పుడు వసంతలక్ష్మి విషయం గుర్తుండేది కాదు, అయినా వసంతలక్ష్మి ఏమంటు౦దోనన్న భయంతో చెబుతున్నానని అబద్దం చెప్పేది.
    అయితే వంసంతలక్ష్మి తన పట్టువిడలేదు. ఆమె బాబు వరలక్ష్మి పట్ల ఆసక్తుడవుతున్నాడని గ్రహించి తనూ ఆమెకు శిష్యరికం చేయసాగింది. వరలక్ష్మి లోని ఏయేలక్షణాలు బాబును ఆకట్టుకుంటున్నవో గ్రహించి అవన్నీ తానూ అలవర్చుకుంది.
    ఇప్పుడు వసంతలక్ష్మి కి పిలకబ్రహ్మడికథేకాదు__ పొట్టిరాక్షసుడికథ కూడా పిల్లలకు ఆసక్తికరంగా చెప్పడం వచ్చేసింది.

 Previous Page Next Page