Previous Page Next Page 
విరాజి పేజి 17

   

  "భోజనాల మాటకేం గాని పెళ్ళికూతురెక్కడు౦ది కనబడదేం?" అనడిగింది విరాజి.

    పేళ్ళయాక కూడా యింకేదో చిన్న చిన్న పూజలుంటాయి. కదండీ. అవన్నీ పురోహితుడు లోపల చేయిస్తున్నాడు. మీరు భోజనాలకానీయండి" అంటూ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక టేబుల్ ముందు కూర్చోబెట్టి తాను దగ్గరుండి సర్వ చేయించాడు.

    "తీసుకోండిఅయ్యగారూ" అన్నాడు గౌతమ్ మొహమాట పడటంచూసి.

    ఆకలి మోహమాటాన్ని  జయించండి. వెజిటెబుల్ బిరియానీ రెండు స్వీట్లూ కూరలు .

    "గౌతమ్ ఎందుకలా సంశయిస్తావ్? యిది మనయిల్లే" అంది విరాజి.

    బోజనాలయినాక పెళ్ళి కూతురిని పెళ్ళి కొడుకుని తీసుకొచ్చి యిద్దరికీ  దడ్నం పెట్టించాడు.

    పెళ్ళికూతురి ముఖం చాలా కళగావుంది. గౌతమ్ విరాజి వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు.

    "చాలా పొద్దుబోయింది. ఇహా వెళతాము" అంటూ విరాజి అక్కడ నుంచి కదిలింది.

    పెళ్ళి పెద్ద రోడ్డు వరకూ వచ్చి సాగనంపాడు.

    అతను లోపలకు వెళ్ళాక బార్య యింట్లో౦చి బయటకు వచ్చి "ఏమండడీ! నేను వాళ్ళిద్దరిని గుర్తుపట్టలేదు. ఇంతకూ వాళ్ళేవరు?" అనడిగింది.

    "ఏమోనే గుర్తురావడ౦లేదు నేనూ అదే యిందాకట్నుంచీ ఆలోచిస్తున్నాను." అన్నాడు.

    "ఒకవేళ యింకో పెళ్ళికి వెళ్ళబోయి మనింటికివచ్చారేమోనని....."

    "అయినా కావచ్చు. అయితేనేం అలాంటి వాళ్ళు మనింటికి వచ్చి బోంచేశారంటే సామాన్యమైన విషయమా? వాళ్ళ మొహాల్లో ఎంత కలా ఎంత వర్శస్సూ " అన్నాడతను తృప్తిగా.

                                                    *    *    *    *

    గుండె అనే అగ్నిపర్వతంలో లావా రాజుకుంటోంది. మానవ జీవితంలోని బలహీనతల్ని కరువుగట్టి స్వార్ధాన్ని భీభత్సాన్ని దాపరికంలేకుండా బలీయమైన యితివృత్తి౦లో బిగించి యధాతతంగాసృష్టించ గలిగితే?

    అతను మొదటి పదిరోజులు కాగితంమీద కాలం పెట్టలేదు. ఏదో రాయటం కాదు. సజీవమైన పాత్రలతో ఎక్కడా అక్షరం పొల్లుపోకుండా చెయ్యి మనస్సు నుంచి స్వాధీనం తప్పకుండా రాయ గలగాలి.

    యిది వరకేన్నడూ లేనంత భావోద్వేగంఉద్రేకత అతనిలో అగ్నిని కదిలిస్తున్నాయి.

    రచయితకు తాను జాగ్రత్తగా రాస్తున్నానా? లేదా అన్న ఆత్మ విమర్శ వుండాలి. అర్ధంలేని ఆత్మ విశ్వాసం కన్న యీ ఆత్మ విమర్శ ఎంతో గొప్పది.

    కొన్ని వేలమంది పాఠకుల్ని మోసం చెయ్యటం కన్న పదిమంది ఉన్నత శ్రేణిపాఠకుల గుండెల్లోకి చొచ్చుకు పోగలిగితే అరచయిత ధన్యుడే.

    విరాజి తరచూ వస్తోంది. అతను రాసిన పేజీలన్నీ చూపించేవాడు.

    ఆమె ఒక్కసారి మెచ్చుకొనేది.

    అవసరమైనప్పుడు నిష్పక్షపాటంగా విమర్శ౦చేది.

    ఇద్దరూ కలసి ప్రతి చిన్న విషయం మీద గంటలకు గంటలూ చర్చించుకునేవారు.

    గౌతమ్ కు ఓ నూతన సత్యం అర్దమయింది. నిజయైటి గల రచయితకు రాయటమనేది అతను పడే శ్రమలో పదో వంతు మిగతా తొమ్మిది వాంతులూ అతని సంఘర్షణ నిరంతరం అంతరంగా మధనం _ వీటితో నిండిపోయి వుంటాయి.

    రచయితకు తనకు తట్టే యితివృత్తాలన్నీ యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం ఉపయోగించకుండా రాయగలిగితే కొన్ని వందల రచనలు పుంఖాను పుంఖాలుగా తయారుచేసి పారెయ్యగలడు. మస్క్తిష్కంలో స్పురించే వందయితివృత్తాలలో తొంభయితొమ్మిదిని వదులుకో గలిగి సాధికారంతో నిర్వహించగలిగితే ఒక్క యితివృత్తాన్ని చేపట్టగలిగిన వాడు ఉత్తమ రచయిత కాగలడు.

                           *    *    *    *   

    " ఈ నవల నీ సాహిత్య జీవితంలో ఒక మలుపు తీసుకు రాగలిగాలి గౌతమ్" అనేది విరాజి.

    కొన్ని కొన్ని అధ్యాయాలు అయిదారుసార్లు కూడా రీరైట్ చేయించేవి.

    "గౌతమ్ నువ్వో ఉత్తమ రచయిత కావాలి. డాంబికాలతో, దర్పాలతో భేషజాలతో , జిమిక్స్ తో అధికారం చేలాయిస్తున్న యీ విషవాతావరణంలో నువ్వో కాంతికిరణం కావాలి" అని తన ఆవేదన వెళ్ళబోసుకునేది.

    ఎంతగొప్పతోడు? ఎంత మధురాతి మధురమైన సహకారం? కళా కారుడు యింత కన్న కోరుకునే దేముంటుంది?

    తాను తన కోసం రాయటం లేదు. పాఠకుల కోసం రాయటలేదు.  విరాజీ కోసం రాస్తున్నాడు. ఒక్క విరాజిని మెప్పించగలిగితే పాఠక లోకాన్నంతటినీ మెప్పించినట్లే లెక్క.

    ఒక రోజు ఉదయం రాయటం విరాజి చేతిలో ఓ వార పత్రికలో చాలా ఆతృతగా వచ్చింది.

    గౌతమ్ ! మనం ఈ హడావుడిలో పడిచూసుకోలేదు. ఈ వారపత్రిక ఓ నవలల పోటీ నిర్వహిస్తోంది. టైమింకా పదిరోజులు కూడా లేదు. అయిదువేల రూపాయలు మొదటి బహుమతి. ఈ పోటీలో ఎలాగైనా పాల్గొనాలి." అంది.

    గౌతమ్ ఆ పత్రిక అందుకని చూశాడు. చాలా ప్రముఖ వారపత్రిక అంతేకాదు. ఆ రోజు తాను నవల కోసం వెళ్ళి సంపాడుకుడితో మాట్లాడివచ్చిన పత్రికే. ఆ సంపాదకుడే తననవల బాగా లేదని తిరిగి ఇచ్చేశాడు.

    "లాభంలేదు విరాజీ! ఆ పత్రికకు కమర్షియల్ రచనలు నచ్చురాయి. ఈ మాదిరిని వాళ్ళ మనసులూ దూరపు" అన్నాడు నిస్ప్రుహతో.

    "కాదు గౌతమ్ కేవలం సీరయల్స్ గా వెయ్యటానికి వాళ్ళు  అనుసరించే పద్దతులు వేరు, బహుమతులు ప్రకటించినప్పుడు పాటించే విలువలు వెరపు, దానికోసం ప్రత్యేకంగా రాయటం లేదు. ప్రయత్నించి చూస్తే తప్పేముంది ?"

    "కాని మనం తయారు చేసినవన్నీ దేనికని విడివిడిగా వున్నాయి. ఇవన్నీ ఓ పద్దతి ప్రకారం ఆర్డర్ లో పెట్టాలంటే పదిరోజుల వ్యవధి సరిపోదు."

    "సరిపోతుంది. గౌతమ్. పట్టుదలఉంటే పదిరోజుల్లో ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చు."

    తిరిగి అతనికి ప్రోత్సాహం.

    ఆ తర్వాత పదిరోజులూ యిద్దరూ చాలా శ్రమపడ్డారు, అతను చాలా సంత్రుప్రిగా వచ్చిందనుకున్నచోట ఈ వాక్యం మళ్ళీ రాయి గౌతమ్, అనుకున్నంత బాగా రాలేదు అది తాను అనుకున్న ఎఫెక్ట్ వచ్చే వరకూ మళ్ళీ మళ్ళీ రాయించేది.

    ఒక ఐ.ఎ. ఎస్. పరీక్షకు వెళ్ళే విద్యార్ధి కష్టపడేదాని కన్న ఎక్కువగా కష్టపడ్డారు గౌతమ్ .

    మొత్తంమీద కావాల్సిన వ్యవధిలో నవల పూర్తీచేశాడు గౌతమ్.

    పేరు 'ఆక్రందన ' అని పెట్టారు  యిద్దరూ ఆలోచించి.

    నవల పత్రికకు పంపించేశాక గుండె మీద నుంచి పెద్దబరువు తొలగిపోయినట్లుగా ఫీలయ్యారు.

    "గుర్తుంచుకో గౌతమ్! ఇది మన ఇద్దరికీ పుట్టినబిడ్డ" అన్నాది విరాజి.

    నరాలు జివ్వుమని వణికాయి. శరీర౦మీద పన్నీరు చిలకరించినట్టు అయింది, ఏదో వెదుక్కుంటున్నట్టు! కనీ ఆమె విశాల వినీల నేత్రాలు ఎ భావాన్నీ వర్షించలేదు.

    "గౌతమ్! పది పదిహేనురోజులదాకా నేను కనబడను" అది విరాజి.

    "ఎందుకు?" అన్నాడు గౌతమ్ దిగులుగా.

    ఈ నవలా ప్రపంచంలో పడి నాత్యూషన్స్ బొత్తిగా నేగ్లేట్ చేసేశాను. సరిగ్గా రాకపోతే నన్ను తప్పించి వేస్తానని అల్టిమేటమ్ ఇచ్చారు వాళ్ళు."

    "అయ్యో" అనుకున్నాడు బాధగా.

    "అదేగాక" అంది విరాజి నవ్వుతూ. ఇన్నాళ్ళు వరసగా కలుసుకుని కొన్నాళ్ళు కలుసుకోలేకపోతే అదో థ్రిల్!"

    ఆమె వెళుతొంటే _ ఏదో శూన్యం ఆవరిస్తోనట్టు ఫీలయి "నేను కూడా వచ్చి కొమ్దదూరం సాగనంపుతాను" అన్నాడు.

    "వద్దు నువ్వు చాలా అలసిపోయి వున్నావు. విశ్రాంతి తీసుకో. అదీ గాక నేనింటికి వెళ్ళటం లేదు. నాదమునిగారి దగ్గరకు వెడుతున్నాను."

    "అన్నట్లు వాళ్ళపాప డాన్సు ఎలా నేర్చుకుంటోంది?"

    "త్రిపుర చాలా అద్భుతమైన పిల్ల. ఆ అమ్మాయిని నేను అనుకున్నట్లు తీర్చిదిద్దగలిగితే మనదేశానికి ఓ వరాన్ని అందివ్వగలను."

    ఆమె కళ్ళలోని ఆత్మవిశ్వాసం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది.

    త్వరలో ఆమె నాట్యప్రదర్శన ఇవ్వాలని నాదమునిగారి తాపత్రయం _ అరగేట్రానికి నేను తొందరపడటంలేదు. నేననుకున్న విన్యాసాలు రావాతంకోసం సర్వశక్తులూ ధారాపోస్తున్నాను _ అంది విరాజి.

    ఆమె వెళ్ళిపోయాక గుమ్మం దగ్గరే చాలాసేపు నిలబడి వుండి పోయాడు.

 Previous Page Next Page