Previous Page Next Page 
విరాజి పేజి 16

 

     ఓ సంపన్నుడు కారులోవెడుతూ పాపనిచూసి  దిగారు. ఓ నిముషం పాటు పాపవంక తదేకంగా చూశాడు. అటూ ఇటూచూసి పాపని చేతుల్లోకి తీసుకుని కారువైపు కదిలాడు.

    కొంతదూరంలో చెట్టుచాటున నిలబడి ఆతృతగా చూస్తోన్న తల్లికళ్ళుమెరిశాయి. ఆశతో.

    ఒక్కక్షణం ......

    అతని ముఖకవళికలు మారాయి. ఏదో ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి పాపను యదాస్థాయిలో ఉంచి కారెక్కి వెళ్ళిపోయాడు.

    తిరిగి నిరాశ.

    అలా రకరకాలుగా మరికొందరు.

    చివరకు ఓ బిచ్చగాడు అటుకేసి వస్తూ పాపనిచూసి ఆగాడు ఓ క్షణం ఆలోచన అటూ ఇటూ చూసి ముందుకువంగి పాపని చేతులోకి తీసుకున్నాడు.

    ఆ స్రీ అయ్యో అని అరవబోయింది.చెట్టుచాటునుంచి బయటకు రాబోయింది.

    ధైర్యం చాలలేదు.

    బిచ్చగాడు పాపను తీసుకుని వెళ్ళిపోయాడు.

    ఆమె  అటూ ఇటూ చూసిపాకలోకి అడుగుపెట్టింది. ఓమూల చిన్న దీపం వెలుగుతోంది. మధ్యలో చింకిచాపమీద పాప పడుకోబెట్టపడింది.

    ఆతృతగా సమీపించి క్రిందకు వాగి పాపని అందుకోబోయి కెవ్వుమని అరిచింది.

    పాప......

    అతని బ్రతుకుతెరువుకోసం

    కళ్ళుపోయి ....

    చేతులు విరవబడి....

    కాళ్ళు వంకరచేయబడి......

    బిచ్చమెత్తుకునెందుకు స్పెసిమెన్ గా సిద్దంచెయ్యండి ఉంది.

                                     6

    రాత్రంతా మంచికధ రాశానన్న తృప్తితో తనివితీరా పడుకోవడం వల్ల మరునాడంతా ఉల్లాసంగా  ఉంది.

    సాయంత్రానికి స్నానంచేసినతయారై యివేళ విరాజిని కలుస్కోవాలి అనుకున్నాడు.

    అణగద్రొక్కి అణగద్రొక్కి వున్న కోరిక బయటకు ఎగజిమ్మనట్లు ఒళ్ళంతా ఓరకం పులకింత వ్యాపించింది.

    "విరాజీ" అన్నాడు గోడకున్న అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ.

    "ఓయ్"

    తృళ్ళిపడి వెనుదిరిగాడు. అక్కడ నిజంగా విరాజి నిలబడి వుంది.

    "నరుడా ఏమీ నీ కోరిక?"

    "నిజం చేపమంటావా? అబద్ధం చెప్పమంటావా?"

    "అబద్ధం అందంగా ఉంటుంది. నిజం హయిగా వుంటుంది. రెండూ కలిపి చెప్పు.

    "నీతోకలిసి భోజనం చెయ్యాలి."

    "ఇది చాలా నిజమయిన కోరిక! అబద్దమేదీ లేదే!"
   
    "కోరిక కోరటంలో నిజముంది. తీరదని తెలసీ అడగడంతో అబద్దం ముంది.

    "ఎందుకని"

    "నా దగ్గర ...."

    విరాజి నవ్వింది. "అరమయింది."

    "మరి"

    "నేను ఉన్నానుగా...."

    "నీ దగ్గర .....

    "నేను ఉన్నానుగా" అంది మళ్ళీ "పద బయటకు వెడదాం."

    "ఎక్కడకు?"

    "చేబుతాగా!"

    అతను తలుపులు వేస్తోంటే "ఓ గమత్తు చెప్పనా?" అంది.

    "ఏమిటి"

    "మనమిద్దరం కలసినప్పుడల్లా ఆకలి భగ్గుమంటూ వుంటుందేమిటి!"

    "అది ఫిప్టీ ఫిప్టీ కంటె తీరడంలేదు గనుక.
   
    గది తలుపులువేసి _ యిద్దరూ రోడ్డుమీద కొచ్చారు.

    "ఆకలి చాలా పన్లుచేయిస్తుంది' అంది విరాజి నవ్వుతూ.

    'ఎలాంటివి?"

    "దొంగతనం , మోసం _ ఇలాంటివి"

    "మనమిప్పుడు  ఆ రెండూ చేయబోతున్నామా?"

    విరాజి నవ్వింది. అవేంకాదు సహజంగా జరిగే విషయం చెప్పాను."

    రోడ్లన్నీ జనసమ్మర్ధంగానే ఫర్లాంగుల దూరం నడిచారు.

    'ఇక్కడే ఎక్కడో వుండాలే' అన్నది విరాజి కళ్ళతో వెదుకుతూ

    'పెళ్ళివారిల్లు'

    'ఎవరిదీ ?'

    'ఒకమ్మాయికి నేను డ్యాన్సు చెప్పాను, ఆ అమ్మాయి పెళ్ళి, బాగా దిగువతరగతికి చెందినవాళ్ళు . పాపం ఎంతో ఆపేక్షగా పిలిచారు'

    "ఇప్పుడు మనం పెళ్ళి బోజనానికి వెడుతూన్నామా?"  అన్నాడు గౌతమ్ చాలా యిబ్బందిగా .

    "అవును."

    "నువ్వెళ్ళు నేను రాను."

    "ఏం?"

    "నువ్వయితే వాళ్ళకు డ్యాన్సు టీచర్ వి. నేను పరాయి వాడ్ని.

    "నా ప్రక్కనుంటే నువ్వు పరాయివాడివెలా అవుతావు."

    "వాళ్ళకిఅవుతాను."

    "నేను చేబుతానుగా."

    "ఏమని?"

    "నా ప్రియ స్నేహితుడువని."

    "ఈ స్నేహుతుడు పిలవని పేరంటానికి వొచ్చాడేమిటా అని చికాకు పడరా?"

    "నీ కంత మొహమాటంగా వుంటే ఒక పని చేద్దామా ?

    "ఏమిటది?"

    "నువ్వు నా భర్తవని చెబుతాను. మాకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నారేమీటని అడిగితె అర్జంటుగా అనుకొని పరిస్థితుల్లో జరిగిందని చెబుతాను."

    అత సప్రయత్నంగా ఆమే ముఖంలోకి చూశాడు. ఏ భవమూ కనబడలేదు. ఎంత పెద్ద మాటనైనా కల్మషంలేకుండా ఎంత తేలిగ్గా అనేస్తుంది.

    ఇద్దరూ ఒక సందు మలుపు తిరిగారు ఓ చిన్న యింటి ముందు షామియానా వేసివుంది. చుట్టూ తగు మాత్రంగా దీప తోరణాలు అమరివున్నాయి. షామియానా క్రింద పాతిక ముప్ఫయి మంది కూర్చుని భోజనాలు చెయ్య తగ్గట్టుగా కోర్చీలూ బల్లలు అమర్చివున్నాయి. అప్పటికి కొన్ని బ్యాచీలు తిని లేచి వుండటం వల్ల కాబోలు టేబుల్స్ ముందు పెళ్ళపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.

    "అదిగో ఆ ఇల్లే" అంటూ విరాజి అతను జవాబు చెప్పే అవకాశం యివ్వకుండా చెయ్యి పట్టుకుని గబగబా అటుకేసి తీసుకు పోయింది.

    పెళ్ళి పెద్ద చాలా చిన్న కుటుంబీకునిలా కనిపిస్తున్నాడు. పంచా, లాల్చీ వేసుకుని హడవుడిగా అటూ యిటూ తిరుగుతున్న వాడల్లా ఓ రకం పర్చసుతో వేలుగుదోందన్న ముఖాలతో లోపలకు వస్తున్న యువతీయువకుల్నీ  ఓ నిముషం పరాకాయించి చూసి తర్వాత రెండు చేతుల్లూ జోడించి నమస్కారం చేస్తూ. "రండి రండి" అన్నాడు.

    విరాజి మేదవుల మీద చిరునవ్వు చిందిస్తూ "ఆలశ్యమైపోయింది పెళ్ళికి అందుకోలేకపోయాం." అన్నది.

    "ఎంతమాట మీరోచ్చారు. అంతేచాలు అంటూ రెండు కుర్చీలు తెప్పించి అందుకోలేకపోయాం." అన్నది.

    "ఎంతమాట మీరోచ్చారు అంతేచాలు అంటూ రెండు కుర్చీలు తెప్పించి యిద్దరికీ వేయించాడు.

    అక్కడున్న వాళ్ళంతా యించుమించు ఒకే తరగతికి చెందినవాళ్ళు . బహుశా పెళ్ళి పెద్ద టాక్సీ డ్రయివరు కొనకు చెందిన వాడయి వుంటారు. అక్కడ మనుషలంతా ఆ స్థాయికి చెందిన వారిలా కనబడుతున్నారు. వాళ్ళంతా యీ యువతీ యువకుల వంక చోద్యంగా చూసి బయటకు వొచ్చి చూస్తున్నారు.

    "వొరేయ్ _ ఆ టేబుల్ ఖాళీ అయింది కాని అయ్యగారికి స్పెషల్ గా సీట్లు ఏర్పాటు చెయ్యండిరా _" ఆ ప్రక్కన కనబడుతున్న ఓ యువకుడ్ని పిలిచి పురమాయిస్తూ.

 Previous Page Next Page