Previous Page Next Page 
డాళింగ్ పేజి 8

 

    డాడీ జ్ఞాపకాలలోంచి చాలాసేపటికి గానీ బయటకు రాలేకపోయింది మాధురి.
    --    సమయంలో ఆమెకు చటుక్కున విమల్ గుర్తు కొచ్చాడు .
    విమల్,
    విమల్ ని ఎంత తప్పుగా అర్ధం చేసుకుంది తను.
    విమల్ ని ఒక హీరోగా, అవుటాఫ్ మూడీ ఫెలో గా అర్ధం చేసుకున్న మాధురి ----
    అతని మనసుని , వ్యక్తిత్వాన్ని,అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. అతని పట్ల తను చేసిన తప్పేవిటో సడన్ గా గుర్తుకు రావడంతో తనలో తనే బాధపడింది మాధురి.
    అవును,
    తనకోసం అంతచేసిన విమల్ కు కనీసం ఒక్క థాంక్స్ యినా చెప్పలేదు.
    ఏమనుకుంటాడు విమల్?
    ఎప్పుడూ ముభావంగా వుండే అతని అందమయిన ముఖం, మెల్లగా పెదవులు విప్పకుండా నవ్వే నవ్వు, అందమైన కళ్ళు, ఆ కళ్ళ వెనుక తొంగిచూసే ఏవేవో భావాలు.......
    తనకిప్పుడు ఫ్లయిట్ లో కాకుండా కార్లో ఉన్నట్టుగా వుంది మాధురికి.
    పైలెట్ సీట్లో విమల్ కూర్చున్నట్లుగా ఉంది.
    "థాంక్యూ విమల్.........థాంక్యూ వెరీ మచ్.......' తనలో తనే అనుకున్నట్టుగా బయటకనేసింది.
    మాధురి పక్కన ఓ బెంగాలీ జంట కూర్చుని వుంది.
    మధురి మాటలు ఆ అమ్మాయికి స్పష్టంగా వినిపించాయి.
    "మీ డాళింగ్ గుర్తుకొచ్చారా? అప్పుడే?! ఇప్పుడే కదా మిమ్మల్ని ఫ్లేయిట్ ఎక్కించి వెళ్ళారు" అని బెంగాలీ అతను అంటే-
    "దటీజ్ రియల్లీ లవ్ ... మీ మగాళ్ళకు అంత డీప్ లవ్ తెలీదులే.........." అని బెంగాళీ యువతి అంది తన భర్త నుద్దేశించి.
    ముసిముసిగా నవ్వుకుంది మాధురి. అంత టెన్షన్ లోనూ ఏదో మధురమైన భావన......స్పందన ఆమెను కదిలించి వేసింది.
    

                                                   *    *    *    *

    విమల్ కుడిచేతిలో సన్నజాజి మాల.
    ఎడం చేతిలో స్టీరింగ్.
    రోడ్డు మీద పాదరసం జారిపోతున్నట్టుగా మారుతికారు పరుగులు పెడుతోంది.
    సరాసరి, షూటింగ్ స్పాట్ కెళ్ళకుండా హోటల్ షూట్ కొచ్చేశాడు .
    అక్కడ -
    డైరెక్టరూ, ప్రొడ్యుసర్ అతని కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డారు.
    "ఏమిటి సార్ హీరోయిన్ ని తీసుకుని సడన్ గా వెళ్లిపోయానని కోపంగా నిలబడ్డారు" నవ్వుతూ ప్రశ్నించాడు విమల్.
    అలా హేపీ మూడ్ లో నున్న విమల్ ని విమల్ ని చూడలేదు ప్రొడ్యుసర్ ఎప్పుడూ.
    "లేదే, అలాంటిదేం లేదే ఏవండీ డైరెక్టర్ గారూ నేనేమైనా అన్నానా.......అన్నాన్నా ఎంత మాట ఇవాళ వేస్టయినా, మీరు తల్చుకుంటే రెండు రాత్రుళ్ళు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చెయ్యరూ!"
    నవ్వుతూ , పక్కనే వున్న కుర్చీని చూపెట్టాడు ప్రొడ్యుసర్.
    విమల్ కూర్చుంటూ.
    "ప్రొడక్షన్ మానేజర్ ఎకక్డున్నాడు? ఒక్కసారి పిలవండి" సీరియస్ గా అన్నాడు.
    "ఏం? ఏం జరిగిందండి అర్జంటుగా అతనేందుకు" డైరెక్టర్ అడిగాడు ఒకింత కంగారుపడుతూ.
    "ఏం లేదు ఇలాంటి వెధవ పనులు ఎప్పుడూ చెయ్యొద్దని చెప్పుచ్చుకుని కొట్టడానికి."
    "ఏంచేసాడండీ?" ప్రొడ్యుసర్ కంగారుపడ్డాడు.
    "నిన్న నా అవుటాఫ్ మూడ్ కి కారణం నా పర్సనల్ అనుకోండి. కానీ ఇవాళ - హీరోయిన్ మధురినీ సడన్ గా షూటింగ్ లోంచి తీసికెళ్ళి పోవడానికి కారణమేంటో తెల్సా........మాధురి డాడీకి సీరియస్ గా ఉందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించారని టెలిఫోన్, మెసేజ్ వచ్చినా, టెలిగ్రాం ఇచ్చినా, మన ప్రొడక్షన్ మానేజేర్ కనీసం ఆమెకు ఒక్కమాట చెప్పలేదు. అందుకే మాధురిని తీసుకెళ్ళి ఫ్లయిట్ ఎక్కించొచ్చాను" జరిగింది చెప్పాడు విమల్.
    విమల్ చెప్పింది విని అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు , తేరుకుని పీలయ్యారు.
    ప్రొడక్షన్ మేనేజర్ ఇలా చేసాడా? టూ బేడ్ ఇటీజ్ టూ బేడ్ " నోచ్చుకున్నట్టుగా అన్నాడు ప్రొడ్యుసర్.
    "అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను ఏదో సీరియస్ కాజ్ లేకపోతే విమల్ అలా చెయ్యడని. ఏవండి ఏవంటారు?" ప్రొడ్యుసర్ వేపు చూస్తూన్నాడు డైరెక్టర్.
    "విమల్ గారితో నైట్ సీన్స్ "ప్రొడ్యుసర్ జ్ఞాపకం చేసాడు డైరెక్టర్ కి.
    "డోంట్ వర్రీ ఇవాళ నైట్ సీన్సన్నీ ఫినిష్ చేసేద్దాం" హీరో విమల్ మాటకి ప్రొడ్యుసర్ ముఖం పెట్రో మాక్స్ లైట్ లా వెలిగిపోయింది.
    "లంచ్ చేసి రెస్ట్ తెసుకోండి మళ్ళీ కలుద్దాం" ప్రొడ్యుసర్ లేస్తూ అన్నాడు.
    "సి యూ" విమల్ లేచి తన సూట్ వేపు నడిచాడు.
    "ఏమిటి హీరో గారి చేతిలో సన్నజాజి పూలున్నాయి లాఫింగ్ ఫేస్ చూడగానే నాకప్పుడే అనుమానం వచ్చింది. హీరో , హీరియిన్ను లవ్ లో గాని పడ్డారేంటండీ బాబూ" ప్రొడ్యుసర్ అన్నాడు.
    "ఏం పడకూడదా!" త్రిబుల్ ఫైవ్ వెలిగిస్తూ డైరెక్టర్ రెట్టించాడు.
    "పడనీ , బాగా పడనీ మీకేం బాధ. నాకు బాధగానీ, హీరోయిన్ కి నెల తప్పించదనుకో ........ఎవడికయ్యా బాధ."

 Previous Page Next Page