Previous Page Next Page 
సృష్టి పేజి 8


    "బిజినెస్ లో నీకన్నా నేనే జీనియస్ అని నిరూపించుకోడానికి" నవ్వుతూ అందామె.

 

    "గుడ్ ! ఐ లైక్ దట్ స్పిరిట్! నీకెంత డబ్బు కావాలి?" వెంటనే అడిగాడు అమరదేవ్.

 

    "నో..... ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. ఐ కెన్ ఎర్న్ మై ఓన్ మనీ. దాంతో నా బిజినెస్ ని నేను స్టార్ట్ చేస్తాను."


    
    "ఓన్ మనీ, ఓన్ బిజినెస్. ఇవన్నీ అమెరికన్ ఇండివిడ్యువాలిటీకి గుర్తులు. గుడ్! నీ ఇష్టం. నీ బిజినెస్ లో నీకేదయినా సలహా కావాలంటే నన్నడగటం మరిచిపోకు" అన్నాడాయన.

 

    ఆయన నెలకు ఇరవైరోజులు అమెరికాలోనే గడుపుతాడు.

 

    ఇండియాలో ఎవరూ చేయని బిజినెస్ తను స్టార్ట్ చెయ్యాలి. కంప్యూటర్  ముందు కూర్చున్నా, వీడియోలో సినిమా చూస్తున్నా, స్విమ్మింగ్ ఫూల్లో స్నానం  చేస్తున్నా చీనాంబర ఆలోచన బిజినెస్ మీదే.

 

    ప్రస్తుతం....

 

    చీనాంబర స్విమ్మింగ్ ఫూల్లోంచి బయటకొచ్చి ఒడ్డునున్న పొడవాటి కేన్ ఛైర్లో స్టయిల్ గా కూర్చుంది.

 

    అంతవరకూ-

 

    పాలగ్లాసును పట్టుకుని దూరంగా నుంచున్న పనిమనిషి ఆమె దగ్గరగా వచ్చి చేతికి గ్లాసునందించింది.

 

    పాలను తాగి, మెత్తటి  టర్కీ టవల్ తో శరీరాన్ని అద్దుకుని  లేచి బెడ్ రూమ్ లోకి నడిచి-

 

    అరగంటసేపు బీరువాలో చీరలన్నిటినీ కలగాపులగం చేసేసి  ఒక  చీరను అందుకుంది.

 

    మరో ఇరవై నిమిషాలు గడిచాయి.

 

    లైట్  ఎల్లో గార్డెన్  వరేలీ శారీలో సన్ ప్లవర్లా వుంది చీనాంబర.

 

    బ్రేక్ ఫాస్ట్  పూర్తిచేసేసి-

 

    స్టార్  టీవీలో బిబిసీ న్యూస్ చూస్తూ ఆ రోజు పేపర్ని తిరగెయ్యడము  ప్రారంభించింది.

 

     రోజంతా సినిమాలు చూడటం, లేకపోతే అమెరికాలోని ఫ్రెండ్స్ తో  గంటలతరబడి ఫోన్లో మాట్లాడడం బోరుగా వుందామెకు.

 

    విశాలమైన బిల్డింగు! తనూ..... తల్లి......అంతే! తల్లి కుముద్యతీదేవి సెంటర్ కేబినెట్ లో మినిస్టర్  ఫర్ ఉమెన్స్  వెల్ ఫేర్.

 

    ఆ పొలిటికల్ వాసనంటే చీనాంబరకు అసహ్యం.

 

    "ఎందుకమ్మా ఆ  రాజకీయాలు...... ఆ మినిస్టర్ పదవులు" అప్పుడప్పుడు తల్లిమీద విసుక్కుంటుంది చీనాంబర.

 

    "ఫూర్ బేబీ! హై సొసైటీస్ లేడీస్ కి ఏదో కాలక్షేపం వుండాలి. మహిళా సంఘాలో, మినిస్టర్  పదవులో ఈ క్రేజీ  నీకు అర్థం  కాదులే" అనేసి బిజీగా  వెళ్ళిపోయే తల్లిని చూస్తే నవ్వొస్తుంది. ఇండియన్ లేడీస్ తమ ఎనర్జీని ఇలాంటి సిల్లీ  క్రేజీలకు వుపయోగించటం తల్చుకుంటే కోపం వస్తుంది.

 

    ఆడవాళ్ళు లేడీస్ క్లబ్ ల చుట్టూ తిరుగుతున్నంత కాలం ఈ దేశం బాగుపడదనేది ఆమె స్టేట్ మెంట్!

 

    అం చూపులు డైలీ ఎంగేజ్ మెంట్స్ కాలంమీద పడ్డాయి. సిరి ఫోర్ట్  ఆడిటోరియంలో ఫిల్మోత్సవ్..... క్లోజింగ్  ఫంక్షన్ చీఫ్ గెస్ట్ అమితాబచ్చన్.

 

    నెహ్రూ మెమోరియల్ హాల్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బెనజీర్ భుట్టో స్పీచ్.

 

    సౌత్ ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ హాల్లో....

 

    ఆర్ట్ గ్యాలరీ..... పెయింటింగు కాంపిటీషన్..... ఎగ్జిబిషన్ కమ్ సేల్. చీనాంబర  చూపులు అక్కడ ఆగిపోయాయి.

 

    చీనాంబర లైక్స్ పెయింటింగ్స్ .

 

    దానిక్కారణం  అమెరికాలో ఆమె క్లోజ్  ఫ్రెండ్ పెయింటర్ కావడమే.

 

    చీనాంబరకు బోర్ కొట్టేస్తున్నా దేశ దేశాల్లోని పెయింటర్స్ పెయింటింగ్సు గురించి కబుర్లు చెప్పేది.

 

    పెయింటింగ్సు గురించి జీవితాన్ని ధారపోసిన వ్యక్తులున్నారు అని తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలకు యిప్పటికీ  ఆశ్చర్యపోతుంది చీనాంబర.

 

    ఆప్ట్రాల్ పెయింటింగు కోసం  జీవితాన్ని ధారపోయడం ఎందుకు? ఇండియాలో పెయింటర్స్ గురించి ఆమెకు ఎక్కువ తెలీదు.

 

    "ఓసారి వేళ్ళొస్తే పోలే. మంచి పెయింటింగు కనిపిస్తే కోని ఫ్రెండుకి పంపించొచ్చు."


    
    ఆలోచన రాగానే మళ్లా బీరువావేపు కదిలి మరో చీర మార్చి మేకప్ పూర్తిచేసుకుని......

 

    బయటికొచ్చింది చీనాంబర.

 

    
                                            *    *    *

 

    సౌత్ ఇండియాన్ ఆర్ట్స్ అకాడమీ హాల్....

 

    బ్రిటీష్ కాలంనాటి విశాలమైన హాలు గోళాకారంలో వుంది. హాలు ముందు పోర్టికోలో ఆగుతున్న ఖరీదయిన కార్లు, ఖరీదయిన మనుషులు. పావుగంట క్రితం ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేసి సెంట్రల్ మినిస్టర్ వెళ్ళిపోయాడు.

 

    హాలు నిండుగా అమర్చిన వందలాది పెయింటింగ్సు!

 

    విజిటర్స్ డౌట్స్ ని క్లారిపై చేయడానికి బృందాల వారీగా నిర్వాహకులు..... దూరంగా లాన్స్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆర్టిస్టులు. ఎగ్జిబిషన్  లో పెట్టిన పెయింటింగ్సు అన్నిటినీ గబగబాచూసేసి పరుగు పరుగున వచ్చింది కావ్య.

 

    పోకచెట్టు కింద రాతి అరుగు మీద కూర్చుని ఏదో పెయింటింగు బుక్ ని తిరగేస్తున్నాడు అభినవ్.

 

    "గురూజీ! మొత్తం చూసేశాను. అన్నీ ఏవరేజ్ గా వున్నాయి. మీ  పెయింటింగ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. నో డౌట్. మీకే ఫస్ట్ ప్రైజ్" పచ్చికలో కూర్చుంటూ అంది కావ్య.

 

    "కాకిపిల్ల కాకికి ముద్దు. కోయిల పిల్ల కోయిలకు ముద్దు" వెంటనే  అన్నాడతను.

 

    "ఏంటీ పోయిట్రీయా? నిజమండీ బాబూ. బెట్..... లక్ష రూపాయాలు  మీకే....... అవార్డొస్తే  నాకేమిస్తారు" కొంటెగా నవ్విందామె.

 

    "రానివ్వండి చూద్దాం" నెమ్మదిగా అన్నాడతను.

 

    "జడ్జీలు ఎవరనుకున్నా రండీ బాబూ? ఎమ్.ఎఫ్. హుస్సేన్, సబావాలా బూపేన్ కక్కర్. వాళ్ళు నాసిరకం దాన్ని సెలక్ట్ చేస్తారని నేననుకొను."

 

    ఎం మాట్లాడలేదతను.

 

    "మీరు నాతో వస్తారా?" అడిగిందామె.

 

    "ఎక్కడికి?"

 

    "అక్బర్ రోడ్ కి. ఓ యాడ్ ఏజెన్సీకి వెళ్ళాలి. అక్కడ ఓ ఫ్రెండ్ వుంది.   

 Previous Page Next Page