శ్రీ శాస్త్రిగారితో నాకు ప్రధమపరిచయ భాగ్యము 1939మే నెలలోకల్గెను. అప్పటికి సుమారు పడి నెలల నుండినేనుతీవ్రానారోగ్యముతోపీడింపబడుచుంటిని. నాయనారోగ్యము తొలుత 106డిగ్రీల మలేరియాతో నారంభ మైనది.అంతటిలో నాగిన నెట్లుండెడిదో! ఆవైద్యపద్ధతిలో క్వైనా వాడుదు రనియు, అది శరీరమునకు మంచిది కాదనియు,హొమియోపతి వైద్యములో క్వైనా వాడరనియు, ఆ పద్ధతి శ్రేష్ఠ మనియు ఎట్లో తలకెక్కెను.దానితోమరిరెండునెలలుగడచెను. లాభము లేదు. పిదప ఆయుర్వేదము పై చిత్తము ప్రసరించెను ఎన్నో చేదు మందులు మ్రింగితిని. అందు కలకత్తావారి పంచతిక్త మని యొకటి గలదు.పేరుకు పంచాతిక్తమే కాని నిజముగా నది ప్రపంచతి క్తము. పగవానికైన వలదీ చేదులు! ఆ మిఁదట కేవలము నాటుమందులు వాడితిని. ఆ వైద్యుఁడు చురుకైన వాఁడే! నాటుమందులపై నాకుఁ గలయనాదరణను పోగొట్టుటకు కొన్ని తీయని మందుల నిచ్చి ఆహారవిషయములో కొంత స్వేచ్చ నిచ్చెడివాఁడు. కాని లాభము లేకపోయెను. తిరిగి అల్లో పతీకి చేరితిని. అప్పటికి నా శరీరస్థితి చాలమార్తు చెందెను. ఇరువది పౌనుల తూకము తగ్గినది. సాయంకాలమునకు 99.5 జ్వరము వచ్చెడిది. మానసికముగా ఎట్టి నిబ్బరమును లేదు. నరములు జిగి తగ్గి స్వల్పా వేసమునకే శరీరము తాళ లేకుండెడిది. నిద్ర లేదు. ఏమి తిన్నను వంట బట్టదు. ఈ స్థితిలో అల్లోపతి వైద్యము కొలఁదిగా సాయపడెను కాని వ్యాధి బోధపడ దు. ఎచటనైన భయపడతి నేమో యని వైద్యుఁ డనును.
ఈ స్థితిలో చెన్నపట్నములో లాఅప్రెంటిసు పరిక్షకు వెళ్ల వలసి వచ్చెను. నేను రైలు దిగి ట్రాము బస్సులలో ఎక్కగలనా యను సందేహముతో నుంటిని. తుద కెట్లో చెన్నపట్నము చేరి స్టేషనువద్దకు రావించుకొన్న మిత్రుని సాయముతో హొటలు చేరిపరిక్షలుగించుకొంటిని.తరువాత పేరుగన్న ఒక డాక్టరుగారిని చూచితిని. ఆయన కొక నర్సింగుహొము కలదు.రోజు కైదురూప్యముల నిచ్చి పది రోజు లందున్న నే గాని రోగనిదానము తెలియ దనిరి. నే నందు చేరెడిదినము స్థిర పఱచుకొని హొటలుకు వచ్చితిని.
గుంటూరు నుండి బయలు దేరునపుడే శ్రీ శాస్త్రిగారి యోగమాహాత్మ్యమును గూర్చి ట్రీటెంటును గూర్చి శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణగారికి నొక పరిచయ లేఖను తీసికొంటిని.ఆ లేఖ తీసికొని త్రోవలో నాలుగు కమలాఫలములను కొని ప్రొద్దుటనే తిరువలి క్కేణి వెంకటరంగం పిళ్ళె వీధి లోని నాల్గవ నెంబరు ఇంటి కేగితిని.తలుపు తట్టి లోని కేగుదునుగదా ఆశ్చర్యము పై నాశ్చర్యము!
శ్రీ శాస్త్రిగారి రచనలను చదివినపుడు వారి యాకార, వేష, భాషాచారములను గూర్చి నాకు తెలియక యే మనసులో నొక రూప మేర్పడెను. వారు సన్నముగాక లావుగాక బంగారువన్నెగల స్ఫురద్రూపి యగు ఆ చారపరాయణుఁ డని నా భావన! లావుగా, చామనచాయ మెఱుపు మేనితో నున్న వారిని పోల్చుకోలేక పోతిని. "ఏం! నాయనా! ఎవరు నీవు!" అని వారు స్నిగ్ధగంభీరమగు స్వరముతో నన్ను పలుకరించిరి.
నా యూహలో ఆ కంఠధ్వని యట్లుండు ననుకొనలేదు.నేను తేరుకొని వారికి నమస్కరించి " మాది గుంటూరు..." అని చెప్పునంతలో శ్రీలక్ష్మి నారాయణగారు లోనుండి వచ్చి నన్ను పరిచయము గావించిరి. వారి నచట కలియుడు నని నే నెఱుఁగను. ఏదో పనియుండి చెన్న నగరము వచ్చి ఆ క్రిందటి రాత్రియే వారిటకుఁ జేరిరట!
శ్రీ శాస్త్రిగారు నేను వారింటికి చేరుసరికి దంతధావన చేయుచుండిరి. అప్పటి కేడు గంటలు దాటియుండును. ఆసరికి వారు స్నానజపాదులను ముగించి యుందురణి తలచిన నా కిది క్రొత్తగా నుండెను. వారితో పరిచయము పెరిగిన పిమ్మట తెలిసికొంటిని. సాయంకాలమందు యోగ చికిత్సకై వారికడ కేతెంచు నార్తులతో వారికి పెందలకడ తెమలదు. అందఱు వెళ్ళినపిమ్మట గూడ చాల ప్రొద్దు పోవువఱకు వారి వారి రోగ కారణాదుల నాత్మోద్బోధనము తెలిసికొనుటతో నిదుర యుండదు.ఒకప్పుడొక నిదురపోయి లేచి తెల్లవారు లా చింతతోనే కాలము గడపుదురు. ఇందుచే ప్రొద్దెక్క లేచుట జరిగెడిది. వేకువనే ఆచారపరాయణువలె వేషము సవరించుట కెక్కడ! అన్ని ఆచార ములను వారు జీవకారుణ్య యజ్ఞాగ్నిలో వ్రేల్చిరి.