మ్యూజియము వస్తుసేకరణలో పెక్కు చిక్కు లుండెడివి. దారి డొంక లేని యొక కుగ్రామములో నొక చారి త్రాత్మక సుందర శిలా విగ్రహము కల దనియు, దానికై యెవరో బొంబాయి నుండి ధనవంతులు వచ్చిరనియు, ఆలస్యమైనచో తెలుగునాడుదాటిపోవుననియుతెలిసెడిది! సరి! అంతటితో శరీరశ్రమను లెక్కసేయక ఏదో రీతి నటకు చేరెడి వారు శ్రీ శాస్త్రి గారు. ఆ విగ్రహ మే పుంత లోనో పడియుండెడిది. పసులకాపరులు కత్తి నూరుకొనుటకో, బాటసారులు కాలిబాడి వదల్చు కొనుటలో అది ఉపయోగపడుచుండెడిది. త్రవ్వి తీయుటకు తోడు దొరకరు. వెలికి తీసి దాని ప్రాముఖ్యమును దెలిపిన పిమ్మట ఊరివారు ఆ విగ్రహము నంచుకొని మేమే ఆరాదించుకొందుమని యడ్డగింతురు. వారిని సమాధానపఱచిఆయా వస్తువులను తిరుపతి చేర్చుట యన లక్కయింటి నుండి ఏక చక్రపురమునకు చేరు నంతటి కధ! ఈ పని నంతయు శ్రీ శాస్త్రిగారు తమ ప్రియాంతే వాసులను, అందును ఉదయగిరి శ్రీనివాసాచార్యులను నూతగఱ్ఱగా గొని ఏ డెన్మిది నెలలలోబ్ బహు స్వల్ప వ్యయముతో నిర్వహించిరి. వేరొకరైనచో మంది సిబ్బందులతో గూడియైన, ఎంత ధనమో వెచ్చించియైన, నిరువ దేండ్లలోపున నైన ఈ పనిని సాధింప గల్గుదురా యని యెఱుక గలవారల చ్చెరువుఁజెందిరి.
ఈ సందర్భమున నొక విషయము స్ఫురణకు వచ్చుచున్నది. గుంటూరులో నొక నూత్న పరిచయునికడ శ్రీ శాస్త్రిగారు కొన్ని గంటల కాలము వ్యయించి ఒక చిన్న పాలరాతిముక్కను తెచ్చిరి. దానిపై నేదో చెక్కడపు భాగము గలదు. ఈ రాత్రికే వారు తిరుపతి ప్రయాణము. సామానుల సర్దుగడలో దానిని మఱతు రేమో యని పలుమారులు సరిచూచికొనిరి. గాజుకు ప్పెలను భద్రము చేసినంత జాగ్రత్తతో దానిని సర్దించిరి. మాకీ యాందోళన బోధపడలేదు." ఇదియమూల్యశిల్పము. డూబ్రేలు అయినచో దీనికి పదివేలు రొక్క మిచ్చును" అని రైలుకడఁ జెప్పిరి. ఈ చిన్న వస్తువు మాటయే యిటులుండ వారు సేకరించిన మ్యూజియమునకు విలువ గట్టుట యసాధ్యమని తోచును.
ఇప్పడీ శిల్పకళాఖండము లన్నియు తిరుపతి దేవస్దానపు మ్యూజియములో మూగవోయి యున్నవి. వాని కాలనిర్ణయముఁజేసి, వాని సాంఘిక రాజకీయ ప్రాధాన్యతను, కళా ప్రాశ స్త్యమును గుర్తించి, వానిని పలుకు బొమ్మలనుగా జేయుగుతురబాధ్యత దేవస్దానము వారి యెడఁగలదు.
ఇటు మ్యూజియముకై తిరుగులాట తోను, అటు అపూర్వగ్రంధసంస్కరణ ముద్రణములు యొత్తిడితోను నలిగులియై శ్రీ శాస్త్రిగారి యారోగ్యము కొంత చెడినది. ఇంతలో గుంటూరు జిల్లా ఎద్దనపూడి యను గ్రామములో నొక బావిలో నేవో మహత్తరశిల్పములు గుప్తపఱుపఁ బడెననియు, వానిని సేకరింపవచ్చుననియు ఆసవెట్టిదుర్విధి శ్రీ శాస్త్రిగారి నటకుఁగొంపోయెను. జడివాన మోఁ కాటి బంటి నల్ల రేగడి బాడి. జోడెద్దుల బండి సైతము నడువ వీలు లేదు.కాలుదీసి కాలువేయ సాధ్యము గాదు. ఇట్టి మిత్తియడకత్తెరలోఁక్కికొనిఅఱువదేండ్లవృద్ధు, భారపు మానిపి యగు శ్రీ శాస్త్రిగారు తీవ్ర జ్వరముతో నింటికిఁ జేరు కొనిరి. అప్పటికే వారి యారోగ్యము పూర్తిగా డినది. దానిని లెక్కచేయక నిరంతరము మంచము మిఁదనుండియే చివరి వఱకు వారి మామూలు కార్యముల నిర్వహించుకొనుచుండిరి. వారు తమ యోగకార్యముల నిర్వహించుకొనిచుండిరి. వారు తమ యోగ మహాత్మ్యమున పలువురను మృత్యుదంష్ట్రుల నుండి వెలికి లాగిరి. అట్టి వార మనేకులము వారి చుట్టు నుండియు తుదకు నా మహానియుని దక్కించుకొన నేరమైతిమి. ఈ హఠా ద్వార్త విన్న మహాకవి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు చకితులై "తుదుకు నిన్నే జయించె మృత్యువు మహాత్మా" యని అప్రయత్నముగ వగచిరి.శ్రీ సత్యనారాయణగారు తమకు తెలియక యే, శ్రీ శాస్త్రిగారి ప్రేమ పాత్రులందరు ఆ నిముసమున భావించినదే పల్కిరి. అస్సాము భూకంప ములో హిమాలయ శృంగములు కొన్ని యదృశ్యమైన వన్న వార్తలతోపాటు, శ్రీ శాస్త్రిగారి నిర్యాణ వార్తను మేము వార్తాను మేము వార్తాపత్రికలలో జూచి వాపోయితిమి.
తుదకు వారెంతో మక్కువతో బృహద్గ్రుంధముగా రచింపఁజూచిన ప్రజ్ఞాప్రభాకర మి తిరున నసంపూర్ణముగా, దుఃఖపుపుక్కిలింతగా ప్రకటింప వలసి వచ్చినది. దీని ముద్రణకగు వ్యయ మును శ్రీ శాస్త్రిగారి కిర్వదియేండ్ల నుండి ప్రియ శిష్యులైన చెన్నపురివాసి శ్రీ కంభంపాటి సత్యనారయ న శ్రేష్టిగ్స్స్రు భరించి గురుదేవుల యెడఁ గల భక్తి ప్రపత్తులను వెల్లడించుకొనిరి. వీరి వృత్తి వెన్న వ్యాపారము. హృదయ ప్రవృత్తియు నవనీతసమానమే! శ్రీ శాస్త్రిగారు చెన్నపురి విచ్చేసినపు డెల్ల అచటి ఆప్తులందరును వీరియింటనే సమావేశమై వీరి యాదరణకు పాత్ర మగుచుండెడివారు. నేటికిని వారి యాదరణకు మేము ఋణపడియున్నాము.