స్వామీజీ మండిపడ్డాడు.
"ఇన్ని మంచి ఆధ్యాత్మికమయిన పనులు చేస్తే నాకు నరకమా? అతి భయంకరమయిన నేరాలు చేసిన వాడికి స్వర్గమా?" అంటూ యమధర్మరాజుని నిలదీశాడు.
"ఇక్కడ నువ్వో ముఖ్యమయిన విషయం గమనించలేదు స్వామీజీ! లాలూ ఎన్ని దుర్మార్గాలు చేసినా అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీహార్ ప్రజలంతా పెద్దాచిన్నా తేడా లేకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని 24 గంటలు భగవన్నామస్మరణ చేశారు- ఆపని నీవల్ల కాలేదు కదా- అందుకని లాలూకి స్వర్గం తప్పదు-" అన్నాడు యమధర్మరాజు.
లాలూ స్వర్గంలోకి అడుగుపెడుతూనే ప్రతిజ్ఞ చేశాడు. "స్వర్గం ఇంత అందంగా ఇన్ని సుఖాలతో నిండి ఉంటుందని నాకు తెలియలేదు. కానీ మా బీహార్ ముందిది దిగదుడుపే! దీన్ని కూడా పది రోజుల్లో బీహార్ లాగా మార్చేస్తా"
బీహార్ లోని ఒక స్కూల్లో-
టీచర్ : ఒరే నితిశ్! నువ్ పెద్దాడి వయాక ఏం చేస్తావురా?
నితిశ్ : మా నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ముఖ్యమంత్రి నవుతాన్సార్
టీచర్ : ఓ చాలామంది ఆశయం రా! అంటే మీ నాన్న ఎప్పుడయినా ముఖ్యమంత్రిగా చేశారా?
నితిశ్ : ;లేదు సార్! ఆయన దొంగ-
ఎలక్షన్స్ సమయంలో లాలూ ఒక ఓటర్ తో మాట్లాడుతున్నాడు.
లాలూ : ఏమిటోయ్ - చాలా సంతోషంగా కనబడుతున్నావ్! నాతో కలిపి ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు. తెలుసుకదా నీకు?
ఓటర్ : బాగా తెలుసండీ- అందుకేనండీ సంతోషం!
లాలూ : అసలు మా అందరి గురించీ నువ్వేమనుకుంటున్నావ్?
ఓటర్ : ఇందులో ఎవడో ఒక్క లుచ్చాగాడే గెలుస్తాడు కదాని చాలా సంతోషంగా ఉందండీ-
లాలూ జపాన్ టూర్ వెళ్ళివచ్చాడు. అతని చెంచాలందరూ విమానం దిగ్గానే దండలేసి కౌగలించుకున్నారు.
"లాలూజీ- మీకేమో హిందీ తప్పుతే ఇంకో భాష రాదు- జపాన్ వాళ్ళకేమో హిందీ రాదు- మరి మీకు ఇబ్బంది కలుగలేదూ?" అడిగాడో విలేఖరి.
"నాకెందుకూ ఇబ్బంది- జపానోళ్ళే చచ్చారు- నేనేం మాట్లాడుతున్నానో అర్ధంకాక"
లాలూ ప్రసాద్ తన బీహార్ గురించి భారతదేశంలో పత్రికలూ, టీవీ చానెల్సూ, అవాకులూ చెవాకులూ రాస్తూంటే వళ్ళుమండి బీహార్ యదార్ధ పరిస్థితిని తెలుసుకోడానికి టూర్ మొదలుపెట్టాడు.
చాలా భాగం టూర్ చేశాక ఓ రోడ్ మీద అత్యాచారానికీ, హత్యకూ గురయిన ఒక స్త్రీ మృతదేహం కనిపించింది.
వెంటనే తన వాన్ లో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు ఆమె ప్రాణం ఎప్పుడో పోయిందని చెప్పారు.
"అయితే ఈ విషయం పోలీస్ కి ఫోన్ చేసి చెప్పండి!" అన్నాడు లాలూ.
"అలాగే సార్!" అన్నారు డాక్టర్లు వినయంగా.
"ఈమెని ఎవరో రేప్ చేసి మర్డర్ చేశారనీ, ఈమె బాడీ ఫలానా హైవే మీద పడి ఉందనీ ఒక లెటర్ ఏమయినా రాసిమ్మంటారా?" అడిగాడు లాలూ.
"అబ్బే- అన్ని వివరాలు అవసరం లేద్సార్- ఈమె బీహార్ పౌరురాలు' అని మీరు సర్టిఫై చేస్తే చాలు- ఆటోమేటిగ్గా మిగతావన్నీ అర్ధమయిపోతాయ్-" చెప్పారు డాక్టర్లు.
లాలూని ఓ టీవీ చానెల్ వాళ్ళు ఇంటర్ వ్యూ చేస్తున్నారు.
"లాలూజీ! మీరు పవర్లో ఉన్నప్పుడు అడ్డమయిన గడ్డీ తిన్నారని పేపర్ వాళ్ళు తెగ రాస్తున్నారు కదా! మీరు పరువు నష్టం దావా ఎందుకేయటం లేదు?"
"భలే వాడివే- నేనే పిచ్చాడినేంటి? ఒక్క పైసా ఖర్చులేకుండా అన్ని పేపర్లూ రోజూ నా ఫోటో వేసి ప్రచారం చేస్తూంటే ఇంక దావాలెందుకు?" అన్నాడు లాలూ ఆనందంగా.
దేవుడు భారతదేశాన్ని సృష్టించాక తన భార్యను పిలిచి "చూశావా! ఈ దేశాన్ని ఎంత అందంగా తయారు చేశానో" అన్నాడు గొప్పగా.
"కానీ నాథా - ఇన్ని అద్భుతమయిన వనాలూ, వనరులూ, నదులూ, పర్వత శ్రేణులూ అన్నీ ఈ ఒక్క దేశానికే అనుగ్రహిస్తే మిగతా దేశాలన్నిటికీ అన్యాయం చేసినట్లు కాదా?" అందామె అమాయకంగా.
"పిచ్చిదానా! ఆ మధ్యలో 'బీహార్' అనే ప్రదేశం ఉంది చూడు! అదొక్కటి చాలు- మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడానికి-" గుంభనంగా నవ్వుతూ జవాబిచ్చాడు దేవుడు.
గుజరాత్ లో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది.
"ఇలా ఎందుకు జరిగిందో మాకర్ధం కావటం లేదు. మా పార్టీ వాళ్ళు ఎలక్షన్ టైమ్ లో టాక్సీ ఎక్కినా, ఆటో ఎక్కినా మీటర్ మీద అయిదు రూపాయలు ఎక్కువిచ్చి బి.జే.పీ.కే ఓటు వేయమని అడిగేవాళ్ళం" అన్నాడు ఒక బి.జే.పీ. నాయకుడు.
పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకుడు అతనిని చూసి నవ్వాడు.
"మేమూ అదే పని చేశాం-మీకూ మాకూ చిన్న తేడా ఏంటంటే మేము మీటర్ చార్జికంటే అయిదు రూపాయలు తక్కువ ఇచ్చి బీ.జే.పీ.కే ఓటు వేయమని అడిగేవాళ్ళం" అన్నాడు ఆనందంగా.
బాల్ థాకరే ఓసారి ఓ పెద్ద హాస్పిటల్ కెళ్ళాడు. అక్కడ సిబ్బందీ, డాక్టర్లూ ఆయనకు దండలేసి హాస్పిటల్ అంతా తిప్పి చూపించారు.
ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ కి ఇంజక్షన్ ఇస్తున్న డాక్టర్ ని చూసి-
"అదేం ఇంజెక్షన్?" అనడిగాడు థాకరే!
"లోకల్ అనస్తీసియా సార్" జవాబిచ్చాడు డాక్టర్.
బాల్ థాకరే ఆనందంగా డాక్టర్ భుజం తట్టాడు.
"శభాష్! మన పార్టీ నినాదం కూడా అదే! లోకల్స్ కే అవకాశాలు రావాలి! కీపిటప్!" అనేసి వెళ్ళిపోయాడు.
బీహార్ లో ఒక స్కూల్ టీచర్ పిల్లలను 'దొంగ' అనే పదం ఉపయోగించి ఒక వాక్యం రాయమని చెప్పింది.
ఓ కుర్రాడు "లాలూకి మరోపేరు దొంగ" అని రాశాడు.
టీచర్ అది చూసి ఆ కుర్రాడికి అయిదు రూపాయలు ఫైన్ వేసి మళ్ళీ అదే పదం ఉపయోగించి ఇంకో వాక్యం రాయమంది.
"దొంగకి ఇంకో పేరు లాలూ" అని రాశాడు ఆ కుర్రాడు.
ఒక ఫజిల్ పూర్తి చేస్తూన్న లాలూ హఠాత్తుగా బిగ్గరగా అరచాడు.
"కంప్లీట్ చేశా- సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశా!"
పక్కనున్న వారంతా ఉలిక్కిపడ్డారు.
"ఏమిటది?" అడిగాడొక మినిష్టర్.
"ఇదిగో - ఈ పజిల్ ఎంతో కష్టపడి నాలుగేళ్ళల్లో కంప్లీట్ చేశా!"
వాళ్ళింలా ఆశ్చర్యపోయారు.
"పజిల్ కంప్లీట్ చేయడానికి నాలుగేళ్ళు పట్టిందా?"
"పిచ్చివాళ్ళల్లారా! దీనికింద ఏం రాశాడో తెలుసా? నాలుగు నుంచి ఆరేళ్ళ లోపు మతఃరమే అని రాశారు-" హాపీగా అన్నాడు లాలూ.
ఎస్సార్ బొమ్మయ్, లాలూ ఓ రోజూ లాలూ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుంటూండగా పోస్ట్ మెన్ ఆరోజు వచ్చిన లెటర్స్ తెచ్చిచ్చాడు.
వాటిల్లో ఒక కవర్ మీద అడ్రస్ స్థానంలో "దొంగల్లో కెల్లా నికృష్టమయిన దొంగగారికి"అని రాసి ఉంది.