"అవును వీర్రాజుగారూ! మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని చెప్పింది మనూరి కరణం కూతుర్నో, లేక తెలుగు పండిట్ గారి మనవరాల్నో, చూసి కాదు, మహార్జాతకులైన కిన్నెర లాంటి గంధర్వ కన్యల విషయంలోనే. అంటే.....స్వర్గంలో నిర్నితమైన ఆ పెళ్ళి వ్యవహారం ఓ తాఖిదులా నేలకు వచ్చి ఆ శుభఘడియ మిమ్మల్ని తాకేదాకా మీరు ఆగాలా వద్దా?"
ఈ విశ్లేషణ విర్రాజుకు ఎంత నచ్చింది అంటే ఈసారి రాయుడు గ్లాసులో తనే లిక్కర్ పోశాడు ఉత్సాహంగా.
"అందుచేత మీరు నిశ్చితంగా వుండండి. నచ్చిన ప్రతి పెళ్ళికొడుకుని మొహం వాచేట్టు తిట్టి మీ అమ్మాయి తరిమేస్తున్నా, ఈ లోగిల్లో ఒక్క మగపురుగైనా అడుగు పెట్టె సాహసం చేయని పరిస్థితులను కిన్నెర సృష్టిస్తున్న , స్వర్గంలో నిర్ణయం ఇక్కడో మార్గాన్ని సుగమం చేసేదాకా మీరు మందు కొడుతూ కూర్చోండి.'
ఇది భూషణో, దూషణో మందు మైకంలో అర్ధం కాలేదు వీర్రాజుకు, "అంతే నంటావ్!"
"మరంతే!"
"కాని వాడు.....ఆ భోజరాజు....."
"మహానుభావుడు...." కొంచెం కవిత్వం పిచ్చి వున్న రాయుడు మందు నిషాలో భోజరాజు కళాపోషణ గురించి ఏదో మాట్లాడబోయాడు.
కాని, అర్దోక్తిగా ఖండించాడు వీర్రాజు. "మేము మాట్లాడుతున్నది నా ప్రత్యర్ధి గురించి."
ఉలిక్కిపడ్డాడు రాయుడు. నాటులాగా ఫారెన్ లిక్కర్ తాగితే ఎంత అనర్ధమో అర్ధం చేసుకున్నవాడై కించిత్తు కంగారు పడ్డాడు-- "క్షమించండయ్యా......నేను ఈ భోజరాజు అనుకోలేదు" అంటూ మొహాన్ని ఏవగింపుగా పెట్టాడు రాయుడు. అక్కడికి ఈ భోజరాజంటే చాలా నీచమైన అభిప్రాయం వున్నట్టు.
"నువ్వలా మొహం పెట్టకు. అక్కడికి నీకూ, భోజరాజుకు పరిచయం లేనట్టు."
మృదువుగానే నవ్వేశాడు రాయుడు. "అయ్యా! ఓ మాట చెప్పనా! దేశాన్ని ప్రాంతాలుగా రాజకీయనాయకులు పంచేసుకుంటు ఆలోచిస్తున్న తరుణంలో, ఓ పల్లెను దిక్కులవారిగా కాకులు సైతం పంచేసుకోగలిగే ఉరిది. పడమటిదిక్కున లోగిలిపై వాలిన కాకి ఇటు రాదు, వచ్చినా, ఈ లోగిలిపై వాలదు ఇక్కడి కాకులు ఆ లోగిలిమీద వాలవు. అది రెండు మూడుతరాలుగా ఇక్కడి నియమం. మరలాంటప్పుడు ఒకే రాజ్యాన్ని పాలిస్తున్న ఇద్దరు శత్రురాజుల వంటి మధ్య కమ్యునికేషన్ కు నాలాంటి వాడు అవసరముందంటారా, లేదంటారా? లేకపోతే ఇప్పుడు ఎం.పి గా వున్న భోజరాజు నాలుగు నెలలో జరగబోయే ఎలక్షన్లో కూడా తనే నిలబడపోతున్నాడుకాని, క్రితం సారి అతని మీద పోటీ చేసి ఓడిపోయిన మీకు ఈసారి డిపాజిట్టు సైతం రాకుండా చెస్తానన్నాడని కాని మీ కేలా తెలుస్తుంది? అసలు పోస్ట్ మేన్ కుల మతాలతో , కక్షలతో సంబంధం ఉండకూడదండి. ఎవరింటికైనా ఉత్తరాలు పట్టుకెళ్ళాలి. ఎవరి ఉత్తరమైనా డబ్బాలో నుంచి బయటికి తీయాలి. అది ఆనవాయితీ మరి నే నంతేగా?"
"అంటే ఏమిటి?" ఓ షాక్ న్యూస్ విన్నట్టు సీరియస్ గా లేచాడు వీర్రాజు. "పెద్దమనుషులమాట కాదని ఈసారి కూడా తనే పోటీ చేస్తానంటున్నాడన్నమాట!"
ఒక్క ఈ పల్లెకే కాక ఆ చుట్టు పక్కల వందల గ్రామాలకు తెలిసిన ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు వీర్రాజు , భోజరాజు.
ప్రతిసారి పార్టీ టిక్కెట్టుకోసం ఇద్దరూ ప్రయత్నించడం అనవాతిగా పెట్టుకున్న ఇద్దరిలో ఏ ఒక్కర్నీ కాదనలేక అధిష్టానవర్గం, ఇద్దరిమధ్య సయోధ్య కుదర్చలేక, యిద్దర్నీ, ఇండిపెండెంట్ కాండిడేటుగా అనుకోవడం అలవాటు చేసుకుంది.
అయితే క్రితంసారి లోక్ సభ ఎన్నికల్లో వీర్రాజు , భోజరాజు మధ్య పోటీ పాతిక మంది దాకా ప్రాణాలు పోవడానికి కారణమైంది. భోజరాజు గెలిచాడు. అయినా యింకా రక్తపాతం కొనసాగిస్తుంటే, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రిగారి మధ్యవర్తిత్వంలో యిద్దరి నడుమా రాజీ కుదిరచ్చారు.
దాని ప్రకారం ఓ టేర్మ్ భోజరాజు ఎం.పి అయితే, మరో టేర్మ్ వీర్రాజు ఏం.పి .కావలి.
ఇప్పుడు భోజరాజు ఆ విషయాన్ని ఉల్లంగిస్తున్నాడు.
"అంటే భోజరాజు రక్తపాతానికి సిద్దపడుతున్నాడన్నమాట." సద్దుమణిగిన పల్లె చీకటిలోకి చూస్తూ అన్నాడు వీర్రాజు. "వాడి గురించి వాడేమనుకుంటున్నాడు? పెద్ద మనుషుల మాట గాదంటే మేము చేతులు ముడుచుక్కుంచుంటామనుకుంటున్నారా?"
వచ్చింది మందుకైతే పాయింట్ మరెక్కడికో డినియేట్ అయిపోయిందని అర్ధం చేసుకున్న రాయుడు వీర్రాజు ఆవేశాన్ని చూసి కంగారు పడలేదు. వీర్రాజు గురించి కాని, భోజరాజు గురించి కాని ఎంత స్టడీ చేశాడని!
నవ్వేశాడు రాయుడు మహర్షిలా. "ఇలా భోజరాజుగారు అనుకోవటానికి ఓ కారణముంది వీర్రాజుగారూ! అతని టేర్మ్ అయిదేళ్ళు ఇంకా కాకముందే మధ్యంతర ఎన్నికలు వచ్చేటట్టున్నయిగా!"
"దానికి మేము పూచీ కాదు.....మాటంటే మాటే!"
"భోజరాజు చంక లేగరేయటానికి మరో కారణం ఉంది."
"ఏమిటో?"
"వాళ్ళమ్మాయి భవ్య లెదూ.....అదే....ఓ ఆర్నెల్ల క్రితం పెళ్ళయింది.....ఆమె నెల తప్పిందట."
"అంతమాత్రం చేత తను మాట తప్పాలా?" ఇంకా తన కూతురు కిన్నేరకు పెళ్ళే కాకపోవడం కించత్తు బాధ కలిగించింది. "నెల తప్పాడమెంతని? పశువులకు, పందులకు తప్పుతుంటుంది. ఆ మాత్రం దానికే సంబరపడిపోనక్కర్లేదు!"
"అవును , తాత కావడమే గొప్ప విషయం అయితే ఈపాటికి మీరు మీ అబ్బాయికి పెళ్ళి చేస్తే ఇద్దరు పిల్లల టండ్రయ్యేవాడు....." సమర్ధించాడు రాయుడు. "అవును, వీర్రాజుగారూ! మీ పెద్దవాడు సలక్షణంగా లెక్చరరు ఉద్యోగం చేసుకుంటున్నాడుగా. అతనికి పెళ్ళి చేసి...."