Previous Page Next Page 
శతఘ్ని పేజి 37

 

    నినాదాలు మిన్ను ముట్టాయి. మరో అయిదు నిమిషాలలో వూరేగింపు కనుచూపుకి అందనంత దూరంవెళ్ళిపోయింది కృష్ణ అక్క పార్వతిని దాటుకుని.
    
    వృధావ్యధా కృద్య మంధ్యారగడోద్దేతరణిక్వలశి యాతనలో ఒంటరిగా నిలబడ్డ ఆమె స్థితి ఏ తోబొట్టువూకోరనిది. విరిగిన ఫాను రెక్కలలాంటి కళ్ళుతుడుచుకుంటూ అప్పుడు చూసింది.
    
    త్యాగిని నిలబడి వున్నాడు చాలా చేరువలో......
    
    ఒకవాస్తవాన్ని శోధించే ప్రయత్నంలో క్షిపణిలా దూసుకు పోవాలనుకుంటున్నవ్యక్తి అతడని ఆమెకు తెలీదు.
    
    కాని......
    
    సంక్షుభితహృదయాన్ని ఓదార్చాలని లేక యికఎన్నటికీ తడిఆరని కన్నీళ్ళను తుడిచే కరస్పర్శను అందించాలనో నిలబడ్డఅన్నలా అనిపించాడు.
    
    "రండి"    

 

    మౌనంగా నడిచింది.
    
                                                                      * * *
    
    "మీవెలితిని పూడ్చగలిగేశక్తి నాకు లేదు పార్వతిగారూ.......కాని మీలాంటి మరో అక్కకన్నీళ్ళు చిందించేఅవకాశం యివ్వకూడదనుకుంటే మీరు మాట్లాడాలి....."
    
    ఏం మాట్లాడగలదామె! ఒక ప్రక్క శవమై వెళ్ళిపోతున్నతమ్ముడు గుర్తుకొస్తుంటేమరో ప్రక్క  జీవచ్చవంలామంచం పట్టిన అమ్మ జ్ఞప్తికొస్తుంటే స్వయంగా దేవుడొచ్చి పలకరిస్తే మాత్రం గొంతెలా పెగులుతుందని.....
    
    నిజానికి యిలాంటి ప్రశ్నలకిదిసమయం కాదని త్యాగికేతెలిసిన దేశాన్ని దహనం చేసి ఆ సంస్కృతి రాల్చిన అస్థికలతో నిత్యశవ కళ్యాణానికి సిద్దపడుతున్న ఆ వర్గం పై దండెత్తాలనుంది. ఓ జర్నలిస్టుగా కాదు వ్యక్తిగా సైతం కదిలిపోతున్నాడు......    

 

    పార్కులో అస్తవ్యస్తంగా పెరిగినపిచ్చి మొక్కలు.....
    
    పైన ఎండ .... దూరంగా వినిపిస్తున్న నినాదాలు......
    
    "పూర్వం ఎప్పుడైనా ఆత్మహత్యాప్రయత్నం చేసుకోవడం జరిగిందా ......"
    
    "లేదు....." కళ్ళొత్తుకుంటూ అంది పార్వతి" అసలు అలాంటి ఆలోచన వున్నట్టూ ఎప్పుడూ కనిపించలేదు. కాని ఈ మధ్య మాత్రం ఓ రెండు రోజులు యిల్లువదిలి ఎక్కడో గడిపితిరిగొచ్చాడు....."
    
    "గొడవపడివెళ్ళాడా..... "జవాబు చెప్పలేదామె. "అలా అప్పుడప్పుడూ అలిగివెళుతుండేవాడా"
    
    ఆమె పెదవులు కంపిస్తున్నాయి. ఏ జ్ఞాపకాల దొంతర్లు కదిలి గుండె కనుమల్లో రాపిడిని సృష్టిస్తున్నాయోరుద్ద కంఠంతో అంది "అక్కంటే వల్లమాలిన ప్రేమున్నవాడు-
    
    కేన్సర్ తో మంచం పట్టిన అమ్మనెలా బ్రతికించుకోవాలా అని అనుక్షణం తల్లడిల్లేవాడు-
    
    ఎప్పటికైనా ఎదిగి ఏదో చేస్తానని కలలు కనేవాడు-అసలు కాలేజి, ఇల్లుతప్ప మరో అలవాటులేనివాడు అలిగి ఎందుకు వెళతాడు..... వెళ్ళింది ఒక్కసారే! ఆ తర్వాత వెళ్ళిశవమైపోయాడు....."    

 

    ఆర్ధికమైన దుస్థితి ..... కుటుంబంకోసం ఏదో చేయాలన్న కలవరం ...... రెండు రోజులపాటు ఎక్కడికో వెళ్ళడం......
    
    "ఇంటికి వచ్చేక ఎక్కడికివెళ్లిందీ చెప్పాడా....."
    
    "చాలాఅడిగాను...... కాని చెప్పకుండా దాటేశాడు" చెప్పింది...... అమ్మా, అక్కలు తినటానికి అన్నం పేకెట్స్ మొదలుకుని ఆఖరుగా రాసిన ఉత్తరందాకా....."
    
    అనుమానంగా చూశాడు- "ఉత్తరం వుందా"
    
    "లేదు....... పొరపాటున అమ్మకంట పడుతుందేమో అని చించేసా..... ఆ తర్వాత
    
    వాడికోసం గాలించడం మొదలుపెట్టాను...... అయినా ఎక్కడికోవెళుతున్నానని రాశాడు తప్ప మీకే లోటూలేకుండా చూస్తానన్నాడే తప్ప వెతికి పట్టుకోడానికి ఎక్కడికి వెళుతున్నదీరాస్తే కదా......"
    
    త్యాగి అనుమానం ధృవపడింది.
    
    "మీవాడికి రాజకీయాలంటే ఆసక్తి వుండేదా"
    
    "ఎందుకలా అడుగుతున్నారు"
    
    "ఇదిహత్యగా అనిపిస్తూంది కాబట్టి"
    
    "కాదు....... ఆత్మహత్య......"
    
    "చేసుకోవాల్సిన ఆగత్యం లేదు పార్వతిగారూ"
    
    అర్ధంకాని జీవిత గమ్యాన్ని సూచిస్తున్న నిప్పురవ్వల్లా రెండు నీటి బొట్లు ఆమె కళ్ళనుంచి రాలేయి "ఎందుకు లేదు......."
    
    "ఈమాత్రం సమస్యలు చాలా మందికి వుంటాయి. కాని అందరూ ఆత్మహత్యలతోనే కడతేరి పోవడం లేదు"
    
    "కాని అందరి తల్లులూ కేన్సర్ పేషెంట్స్ కారు ....." ఉద్విగ్నంగా రొప్పుతుందామె- "ఆకలి తీర్చడానికి అందరి అక్కలూ వేశ్యలుగా మారడంలేదు."
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    చెప్పకూడనిది చెప్పాల్సి వచ్చింనందుకు బిడియమో-తన తమ్ముడి మరణానికి తన తప్పిదమే కారణమైందన్న బాధో-తల వంచుకునే అంది- "వాడు ఇంటి నుంచి వెళ్ళింది నేను వేశ్యగా పట్టుబడ్డాక!! తను సంపాదిస్తానని హామీ యిచ్చి వెళ్ళింది యింటి ఆర్ధిక దుస్థితి నన్నిలా దిగజార్చిందని తెలిసాక!"
    
    డబ్బు...... డబ్బు కోసం ఆరాటం..... అదే అయితే దొంగగా మారతాడు. దోపిడీకి సిద్దపడతాడు కాని ఆత్మహత్య....... తిరుగులేని 'క్లూ' దొరికినట్టయింది.
    
    "మీవాడికి స్నేహితులున్నారా"
    
    "ఉన్నది ఒక్కడే విల్సన్. వాడి క్లాస్ మేట్"
    
    "అడ్రసు తెలుసా....."
    
    "అప్పుడప్పుడూ వాడితో యింటికి వచ్చేవాడు తప్ప అతని యిల్లెక్కడో నాకు తెలీదు" తెలుసుకోవడం సమస్యకాదు..... వెళ్ళాలి పైకి లేచాడు.
    
    "చెప్పకూడనివి సైతం నిర్మొహమాటంగా చెప్పి నా పరిశోధనకి సహకరించిన
    
    ఓ ధీరోదాత్త
    పరిపూర్ణ వ్యక్తప్రదాత
    భవిష్యత్ మార్గనిర్దేశక
    స్రవంతీ పూర్వక సన్నద్దం లా
    జోగారుతున్న    
    మమనోక్షిస్సత
    సంచలన
    విసంచికీ
    గీతికలా    
    మీతనువును సైతం
    దగ్ధశుభోంకర
    ఝంకరనాదంలా .....
    ప్రణవించి
    ప్రణుతించి
    స్వగతంలా....


    ఒక హారతిగా మారిపోయిన ఓ పార్వతిగారూ ..... ఎదిగి ఏదో ఆదుకుంటాడనుకున్న మీ తమ్ముడ్ని నేను వెనక్కి తీసుకురాలేకపోయినా అవసరమైనప్పుడు ఓ అన్నలా మీకు అండ కాగలనని హామీ ఇస్తున్నాను. పోయిన కృష్ణని బ్రతికేవున్న బిడ్డగా మీ తల్లిని భ్రమపెట్టే ప్రయత్నంలోనే కాకమరే సహాయం కావాల్సివచ్చినా నేనున్నాననిమరచిపోకండి" విజిటింగ్ కార్డిచ్చాడు.
    
    "ఏ అవసరానికైనా నన్ను కాంటాక్ట్ చేయడంమరచిపోకండి"
    
    సరాసరి కృష్ణ చదివిన కాలేజీకి వెళ్ళాడు త్యాగి.
    
    అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి కృష్ణ గురించి ఎంక్వయిరీ చేసినట్టు తెలిసింది.
    
    కాని త్యాగి అడిగింది కృష్ణగురించి కాదు ...... విల్సన్ యింటి అడ్రసు.
    
    సహకరించాడు ప్రన్సిపాల్.
    
    మరో పది నిమిషాలలో చిక్కడపల్లిలో విల్సన్ యింటిని చేరుకున్నాడు.
    
    ద్వారం తెరిచింది ఓ మధ్యవయస్కురాలైన స్త్రీ......
    
    విల్సన్ కోసం వచ్చానని చెప్పగానే లోపల వున్న కొడుకుతో చెప్పింది కూడా......
    
    సుమారుపద్దెనిమిదేళ్ళవయసులో వున్న విల్సన్ మలేరియా పేషెంట్ లా కంపించిపోతున్నాడు.
    
    "మీరు....." తత్తరపడ్డాడు త్యాగిని చూస్తూ.
    
    "కృష్ణ గురించి తెలుసుకోవాలనివచ్చాను."
    
    "నాకుతెలీదు.....మాదిఒట్టి మామూలు స్నేహమే...... నాకు అంత కన్నా ఏమీ తెలీదు."    

    రెప్పవాల్చకుండా చూశాడు త్యాగి. విల్సన్ గొంతులో తెలీదన్న జవాబుకన్నా తెలిసిందేదో చెప్పకూడదన్న భావం ధ్వనిస్తూంది.
    
    "కృష్ణ అక్క పార్వతి మీ గురించి చెప్పింది"
    
    "ఏమని......"
    
    మృదువుగా అన్నాడు త్యాగి "మీరు దాయకుండా అంతా చెబుతారని"
    
    "దాయటానికి నాకేం తెలీదు......ప్రామిస్..... "ఇక మాట్లాడేదేమిలేనట్టు లోపలికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు త్యాగి.
    
    "నన్ను విడిచి పెట్టండి" విదిలించుకున్నాడు.
    
    "ఓ.కె. మిస్టర్ విల్సన్..... నిన్ను నేను బలవంతపెట్టలేను. నిర్భంధించి తెలుసుకోడానికి నేను పోలీసాఫీసర్ను కాను. నిజంగా నువ్వు కృష్ణకి మంచి స్నేహితుడినే అయితే కృష్ణ మరణం నిన్ను కదిలించడమే నిజమైతే తర్వాతైనా నిజం చెప్పు..... కనీసం మరో కృష్ణ బలి కాకుండా వుండడం కోసం...."
    
    వెనక్కి మరలిన త్యాగి నివ్వెరపోయాడు ఎదురుగా నిలబడివున్న లిజిని చూస్తూ "మీరు....."
    
    "ఇన్వెస్టిగేషన్ కోసం రాలేదు" అందియథాలాపంగా. "ఇది మా యిల్లు. విల్సన్ మాతమ్ముడు"
    
    అదిరిపడ్డాడు త్యాగి.
    
    బయటకు రమ్మని సంజ్ఞ చేసి ఆమెతోబాటు నడిచాడు.

 Previous Page Next Page