"మాట్లాడను - మాట్లడను - మాట్లాడను - ఒట్టు!"
"టయమవుతోంది."
"ఏం ఫరవాలేదు. చాలా జాగ్రత్తగా ఉంటాను. నీకేం భయంలేదు. అదీగాక నన్నూ తీసికెళితే రాజు నిన్నేమీ అనడు."
"అందుకనే ఈ ఊసెత్తనమ్మా! గురూగారే మీతో మాట్లాడితే మంచిదే! ఆరు మాట్లాడకపోతే మీరు గప్ చిప్ అయిపోవాలి!"
"అలాగే! అలాగే! ఏదీ నీ చీరెలూ వగైరా తీసుకురా!"
"హమ్మో! ఎంత నా సీర కట్టుకున్నా మీరు మెరిసిపోతా, తెలిసి పోతానే ఉంటారు. మావాళ్ళలా తయారుచేస్తా నుండండి!"
శామి సాయంతో శకుంతల మోకాళ్ళ మీదికి చీర కట్టుకుంది. పూసల పేర్లు పెట్టుకుంది. బాగా నూనె రాసి జుట్టు నున్నగా దువ్వి పైకి గట్టిగా ముడివేసుకుని, అందులో ముళ్ళగోరింట పూలు పెట్టుకొంది. శామి పసుపులో ఏం కలిపిందో - అది రాసుకుంటే, ముఖం పచ్చ పచ్చగా నల్ల నల్లగా తయారయింది శకుంతల భయంగా, "మళ్ళీ పోతుందా?" అంది. "సబ్బెట్టి కడుక్కుంటే పోతాది!" అంది శకుంతల చెప్పులు కూడా వదిలేసి కాలినడకన శామితో బయలుదేరింది.
22
పెళ్ళి తతంగం అప్పుడే ముగిసినట్లుగా వుంది. డోలు, కొమ్ము బూరా, తాళాలు మొదలైన వాయిద్యాలు ఒకమూల కుప్పగాపడివున్నాయి. ఆడవాళ్ళు ఒకరి కొకరు గంధాలు పూసుకొంటూ పరిహాసాలాడుకొంటున్నారు. కొప్పులలో నలిగిన కాడ మల్లెపూలు ఒక విచిత్రమైన వాసన వేస్తున్నాయి.
కొందరు మెడలో డోలు కట్టుకొని దరువులేస్తూ ఏదో గట్టిగా పాడుతున్నారు శామి శకుంతల చెయ్యి పట్టుకుని పెళ్ళిజరుగుతున్న ఇంట్లోంచి వెనుక వేపుకు తీసికెళ్ళింది. అక్కడ విశాలమయిన ఆవరణలో అనేకమంది గుమిగూడి కూచున్నారు.
కొందరు వాళ్ళకు ఎదురుగా వచ్చి క్రింద కూచున్నారు. అక్కడకు అడుగు పెట్టగానే స్థంభించిపోయింది శకుంతల. ఎదురుగా కూర్చున్న వాళ్ళలో విమల వుంది. ఎప్పటిలాగే వుంది. జుట్టు గట్టిగా ముడివేసుకోవడం
ఒకటే కొత్తగా వచ్చిన మార్పు. ముఖంలో దిగులుగానీ, విషాదం గానీ ఏదీ లేడు, చిన్నవాళ్ళూ. మొగవాళ్ళూ అంతా వున్నా రక్కడ. అందర్నీ పేరు పేరున ప్రేమగా పలకరిస్తోంది. చిరునవ్వుతో పలకరిస్తోంది. రూపు దాల్చిన ప్రేమ స్వరూపరాణిలా వుంది.
బొమ్మలా నిలిచిపోయిన శకుంతలను చూసి భయంతో చేయి పట్టుకుని లాగిందిశామి. శకుంతల ముందు కడుగువేసింది కానీ, హృదయంలో ఉద్వేగాన్ని అణచుకోలేక పోతోంది. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. గొంతు ఎండిపోతోంది. ఒక్కసారి తల్లిచేతుల్లో వాలిపోవాలనే కోర్కె నిగ్రహించుకోలేక పోతోంది.
శామి శకుంతల చెవుల్లో, "హుష్! అట్టా అయిపోయాక, నా పేనం మీది కొస్తాది- మాటాడొద్దు!" అంది.
శకుంతల తల ఆడించింది.
'దాహం' అని సైగ చేసింది.
అక్కడ ఒక పక్కగా కుండలో నీళ్ళున్నాయి దానిమీద మూత ఉంది. దానిపైన ఎండు కొబ్బరిచిప్పలో పుల్ల పోనిచ్చి తయారుచేసిన నీళ్ళు ముంచుకొనే ఉపకరణం వుంది. శామి దానితో నీళ్ళుముంచి పక్కనే వున్నా చిన్న ముంతను కడిగి దానితో నీళ్ళు పోసి ఇచ్చింది.
శకుంతల ఆ ముంత అందుకుని అందులో వీళ్ళు త్రాగలేక పోయింది. ఆ ముంతచూడగానే వాంతులు వచ్చినట్లయింది నడిచి__ నడిచి దాహంగా వుంది. తన తల్లీ, రాజూ, అక్కడ అలాంటి ముంతలతోనే తాగుతున్నారని గుర్తుకొచ్చి కళ్ళు మూసుకుమింగింది. కడుపులో వికారం పెట్టింది. గుంపులో కలిసిపోయి ఒదిగి ఒదిగి కూర్చుంది.
'రాజు కనిపించాడు, చుట్టుపక్కల వాళ్ళతో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు, రాజూ, తనతల్లీ ఇద్దరూ ఒకచోట! అంటే?' శకుంతలకు తల్లిని చూసిన ఆనందం ఒక వంకా, తనకు అర్ధం గాని అనేకవిషయాలు మరో వంకా మనసును గజిబిజీ చేస్తున్నాయి.
రాజుతో మాట్లాడుతున్న వ్యక్తులను మరోసారి కొంత పరిశీలనగా చూసి ఉలిక్కిపడింది 'పేంట్లలో వుంటే, మొగవాళ్ళను కొంది. కాదు బ్లూ స్కర్ట్ లో గర్ల్ గైడ్స్ గా తనను రాజవల్లీ నగర్ చేర్చిన ఆడపిల్లలు. ఇప్పుడు కాకీ ఫేంట్స్ లో వున్నారు. వీళ్ళంతా ఒకటేనా? తన నెందుకు దూరంగా ఉంచుతున్నారు?'
శామికి, తన ఉనికి తెలియనీయనని వాగ్దానం చేసింది. లేకపోతే,
రాజు లేచి నిలబడ్డాడు.
"కామ్రేడ్స్!" అన్నాడు అంత పెద్ద గుంపు నిస్సబ్ధమై పోయింది, కూర్చుని వున్నా, అక్కడక్కడ కొందరి చేతులలో తుపాకులున్నాయి. గర్ల్ గైడ్స్ దగ్గర రివాల్వర్ కనిపించటం లేదు. కానీ వాళ్ళ దగ్గర రివాల్వర్స్ వుంటాయి. తనకు తెలుసు. అప్పుడు రమేష్ బారినుంచి తనను కాపాడారు. సమయం వచ్చినప్పుడు మెరుపుల్లా బయటికి తీస్తారు.
"కామ్రేడ్స్! మీరు మిమ్మల్ని దోచుకొంటున్న శక్తులకు అర్ధ చేసుకొంటున్నారు. సంతోషం మీ అజ్ఞానాన్ని, అమాయకత్వాన్నీ ఆసరాగా చేసుకొని మిమ్మల్ని అమానుషంగా దోచుకొంటున్న శక్తులనుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. వడ్డీలకు వడ్డీలు పెంచి మీ సర్వస్వాన్ని దోచుకొని, మిమ్మల్ని బానిసలకంటే హీనంగా చూస్తున్న రాక్షస శక్తుల్ని మీరే ఎదుర్కోవాలి. మీ శ్రమను దోచుకొని, ఆ శ్రమను లాభాలుగా దోచుకొని, మిమ్మల్ని జీవచ్చవాలుగా తయారుచేస్తున్న వ్యవస్థను మీరే ధిక్కరించాలి; కనీస ప్రాధమికావసరాలైన లేకుండా అడవులలో మృగాల కంటే హీనంగా బ్రతికే ఈ దురవస్థనుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అరణ్యాలలో మృగాలను వేటాడినట్లే ఈ దుష్టశక్తులను వేటాడండి?"
గంభీరమయిన కంఠంతో రాజు ఉపన్యాసం సాగిపోతోంది. రాజు మాటలు అందరికీ అర్ధమవుతున్నాయా? ఏమీ ఎవరొఇఒ మాట్లాడటంలేదు. క్రింద కూచుని తలలు పైకెత్తి ఏదో ఆశతో, ప్రతీక్షతో శ్రద్దగా వింటున్నారు. మాట్లాడుతున్న రాజుతప్ప మిగిలినఅన్హరూ గ్రామీణులతో కలిసి, వారితో సమంగా కూర్చునివున్నారు.
రాజు మాట్లాడాక మరెవరో కాని మాట్లాడారు రాజు వచ్చి మిగిలిన వాళ్ళతో పాటు కింద కూచున్నాడు. అతడెవరో అచ్చు గ్రామీణుల బాసలో మాట్లాడుతున్నాడు అక్కడ వారి ముఖాలలో పొంగుతున్న ఉద్రేకాన్ని బట్టి అతడి మాటలు వాళ్ళకు బాగా అర్ధమవుతున్నాయని తెలిసింది పాపం! ప్రయత్నపూర్వకంగా ఆయన నేర్చుకుని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా వుంది మీటింగ్!
ఒకప్పుడు తన కేర్ హోమ్ లో జరిగిన మీటింగ్ గుర్తుకొచ్చింది శకుంతలకి.