Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 34

"రూపాయి డబ్బులు చేటలో యేసి ఎదట కూకోవమ్మ డబ్బు పడకపోతే దేవత పలకదు" అంది.
అణు వెంటనే సోదెమ్మ చేటలో రూపాయి పడేసి ఎదుట కూర్చుంది. కోడలు కూడా తనలాగే సోది చెప్పించుకుంటూన్నందుకు పొంగిపోయింది అత్తగారు.
"ఊరికి ఉత్తరాన
చీకటి కోణంలో--
చెరువు గట్టున, కళ్ళనీళ్ళతో గోడు గోడునా విలపిస్తా వుంది.
"మమ్మీ! సారీ! అంటా వుంది."
"మమ్మీ! సారీ! అంటా వుంది."
"మమ్మీ! సారీ! అంటా వుంది." చేతిలో వున్న పుల్ల చేటలో పడేసి బియ్యం బుట్టలో పోసుకుని లేచి నిలబడింది సోదెమ్మ.
"ఊరికి ఉత్తరాన అంటే ఏ ఊరికి? చీకటి కొనలు యెన్నో ఉన్నాయి. రాగ ఉన్న చీకటి కొన ఏది? ఎవరి దగ్గరుంది?" [ప్రశ్నల వర్షం కురుపించింది అణు.
"ఆయన్ని నేనిప్పుడు సూడలేనమ్మా సిన్నమ్మాయి ఏడస్తా కనిపిస్తా వుందంతే మీ కింకా యివరాలు కావాలంటే రేతిరి పూజలో దేవతని తలుసుకుని రేపు రమ్మంటే వస్తా."
"రా!" వెంటనే యే మాత్రం సంకోచించకుండా అంది అణు. వెళ్ళిపోతున్న సోదేమ్మని పరీక్షగా చూసింది జలజ.
యమ్మాయమ్మని చూడగానే పరుగున వచ్చింది రాగ. "మమ్మికి సారీ చెప్పావా?" అడిగింది.
"చెప్పాను. నువేక్కడికి కదలకుండా వున్నావా?"
"ఉన్నాను" ఇద్దరూ సంతోషంగా ఒకరి చేతులొకరు పట్టేసుకుని ఉపేసుకున్నారు.
"నువేమైన తిన్నావా?" అడిగింది రాగని. లేదన్నట్లు తల అడ్డంగా ఉపింది. అప్పటికి సూర్యుడస్తమించి చీకట్లు అలుముకుంటున్నాయి.
"ఈ జాన్ గాడిలో అస్సలు మానవత్వం లేదు" తనలో తను తిట్టుకుని , రాగకి తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్ళింది. వెళ్లబోయే ముందు గుడిసెలోంచి ఎక్కడికి కదలనని రాగ చేత ప్రామిస్ చేయించుకుంది. యమ్మాయమ్మ వెళ్ళిన కొద్ది సేపటికి తూలుకుంటూ వచ్చాడు జాన్. అతడు బాగా నాటు సారా పట్టించాడు. మనసు చిరాకు పడినప్పుడల్లా అతడా పనే చేస్తాడు. జీవన్ తన పోలీసులకి పట్టిస్తానని బెదిరించడం, చేతుల్లో పడతాయనుకున్న డబ్బులు చేతిలోకి రాకపోవటం, అనవసరంగా యీ గుడిసెల్లో "ఏ బేరాలు లేకుండా" రోజులు గడపవలసి రావడం, అతనికి చాలా తిక్కగా వుంది. జాన్ గుడిసెలోకి వచ్చేసరికి పాప నేలమీద వేలితో తల్లికి ఇంగ్లీషులో ఉత్తరం రాస్తోంది.
"డియర్ మమ్మీ!
నీకు సారీ చెప్పేశాను కదా! నువెప్పుడోచ్చి నన్ను తీసుకెళ్తావు? నువు వస్తావు అని నాకు తెలుసు. యమ్మాయమ్మకి గుడిసె లోంచి కదలనని ప్రామిస్ చేశాను అందుకని ఎక్కడికి వెళ్ళలేదు కని, గుమ్మం దగ్గరికి ఐదారు సార్లు వచ్చాను ఒకసారి దూరం నుంచి తెల్ల బోర్డర్ బ్లూ చీర కట్టుకున్నావిడ కనిపించింది. నువే అనుకున్నాను. "మమ్మీ" అని పిలిచాను కూడా. ఇంతలో ఎవరో చిన్న పాప వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంది భలే ఏడుపొచ్చింది. ఆ అమ్మాయి నువు కాదు నేను....."
జాన్ వచ్చి రాగ రాస్తున్న ఉత్తరం మీద నిలబడి "ఏం సేత్తన్నావు?" అన్నాడు ముద్దగా. రాగ అంతకు ముందేప్పుడు తాగిన వాళ్ళని చూడలేదు. అతని వాలకాన్ని , అతని మాటల ధోరణి వింతగా భయంగా చూస్తోంది, జాన్ మరింత దగ్గిరగా వచ్చి, "నీ చెవిలో ఒక రహస్యం చెప్పానా?" అని చెవి దగ్గర మెడ మీద , పెదవులతో కితకితలు పెట్టాడు. రాగ నవలేదు. విడిపించుకుని వెనక్కి జరిగి తల గోడకి కొట్టుకుని ఆగిపోయింది.
ఆ చిన్న పిల్లలో ఏదో ఇన్ స్టింక్ట్ జాన్ పట్ల విరక్తిని పెంచుతోంది. జాన్ తనని ముద్దు పెట్టుకోవడంలో ఆ అమ్మాయికి యేమి ఎబ్బెట్టుతనం కనబడలేదు. ఎందుకంటె ఇంటా బయట అందరూ, అందమైన రాగ ఎప్పుడూ చెక్కిలి మీద ముద్దు పెట్టేవారు. అతడంటే  విరక్తి కలగడం చేత అతడు ముద్దు పెట్టడం ఆ పిల్లకి నచ్చలేదు అంతే. జాన్ మోకాళ్ళ మీద కూర్చుని చేతులు ముందుకు చాచి రాగకి చక్కిలిగింత పెట్టాడు. తన విరక్తిని, భయాన్ని మరిచిపోయి కిలకిలనవేసింది రాగ. జాన్ తన బుగ్గలు గాలితో పూరించి నాలికతో లోదలోడ శబ్దం చేస్తూ ఒక రాగంలా పలికించాడు. చిన్న పిల్లలకి సహజంగా వుండే ఆసక్తిని ఏమి తోచని ఆ స్థితిలో కుతూహలంగా, వింతగా చూసింది రాగ. తరువాత అతడు రాగ గౌను పొట్ట మించి పైకెత్తి పొట్ట మీద నోటితో చక్కిలిగింత పెట్టాడు. కిలకిల నవింది రాగ. నవుతూనే గౌను కిందకు లాక్కుంది. అతడు మళ్ళీ గౌను పైకెత్తి వెనుకటిలాగే చక్కిలిగింత పెట్టాడు. ఈసారి మరికాస్త ఎక్కువసేపు పెట్టాడు. రాగ నవుతూ కిందపడిపోయింది. ఆమె అరికాలి పాదాల మీద పెదవులతో గిలిగింతలు పెట్టాడు. పాదాలు వెనక్కి తీసుకుంటూ నవ్వింది రాగ.
ఆ పిల్లకి దంతా ఒక గేమ్ లా వుంది. జాన్ ముందుకు వంగి ఆ పిల్లని అవరిస్తూ ఆ చిన్నారి లేట పెదవులకి తన బండ పెదవులానించాడు. నాటు సారా వెగటు వాసన ఉపిరి సలపనీయని దగ్గిరితనం, చెమట కంపు అన్నిటిని మించి ఏదో అవ్యక్త మైన భయం. అతడిని రెండు చేతులతో నెట్టబోయింది. ఆ పిల్ల లేత చేతులు పిశాచాల్లాంటి జానిని వెనక్కి నేట్టగలవా? అటూ యిటూ దొర్లుతూ తప్పించుకోబోయింది. తన బండ చేతులు ఆ లేత చేతుల మీద వేసి లేవకుండా తొక్కిపెట్టి మళ్ళీ ముందుకు వంగాడు. చేతులతో నేలని అటూ యిటూ తడిమింది రాగ నిస్సహాయంగా. యమ్మాయమ్మ కుడుతూ కుడుతూ వదిలేసినా గౌను దానికి గుచ్చిన సూది చేతికి తగిలాయి.
ఆ సూది లాగేసి జానీ కంట్లో గుచ్చింది. కేవున అరుస్తూ రాగని ఒదిలేశాడు జాన్. వెంటనే రెట్టించిన కోపంతో రాగ జుట్టు పట్టుకుని తలని గోడ కేసి టపి, టపి మని కొడుతూ, ఏడుస్తున్న రాగ గౌను సర్రున చింపేశాడు. ముందుకి ఒంగబోతున్న జాన్ ఎగిరి అవతల పడ్డాడు దబ్బున. అతని చూపులకి ఎదురుగా ఉగ్ర నరసింహముర్తిలా నిలబడ్డాడు అతని డొక్కలో యిడ్చి తన్నిన సుబ్బయ్య. ఒగారుస్తూ లేచాడు జాన్. ఇద్దరూ సివంగుల్లా కలియబడి ఒకరి నొకరు కుమ్ముకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ, కాళ్ళతో తన్నుకుంటూ పోట్లాటకి దిగారు.
"ఆగండి!" ఎప్పుడొచ్చిందో యమ్మాయమ్మ" అటు చూడండి! ఎంతమంది పోగయ్యారో" జాన్ సుబ్బయ్య లిద్దరూ గుడిసె తలుపు వైపు చూశారు. ఆ చుట్టుపక్కల గుడిసెల్లో వాళ్ళు అందరూ తలుపు చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారు. జాన్, సుబ్బయ్యలు విడిపోయి చెరో మూలా కూర్చున్నారు. యమ్మాయమ్మ వెళ్ళి కసిరేసరికి తడిక బయట చేరిన వాళ్ళంతా  ఎక్కడి వాళ్ళక్కడ చేరిపోయారు. నవుకుంటూ వాళ్ళకి యిలాంటి పోట్లాటలు మాములే చుట్టుపక్కల వాళ్ళు వాటిని సర్దడానికి ఏనాడూ ప్రయత్నించరు సరిగదా శాయశక్తులా ప్రోత్సహిస్తుంటారు. ఒక విధంగా ఇలాంటివి వాళ్ళకి ఎన్ టార్ మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి.  
ఎక్కడివాళ్ళక్కడ విడిపోయాక, యమ్మాయమ్మ జాన్ వైపు గుర్రుగా చూసి, నేలమీద తుపుక్కున ఉమ్మింది. బుస కొట్టినట్లు నిట్టూర్పు వదిలాడు జాన్.
"ఆ పిల్ల జోలికి వెళ్ళావంటే బతకనివను జాగర్త. "హెచ్చరించాడు సుబ్బయ్య.
హొటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యాని రాగకి తినపించబోయింది యమ్మాయమ్మ.
రాగ కొంచెం తిని డొక్కుంది.

 Previous Page Next Page