Previous Page
బెస్ట్ జోక్స్ పేజి 31


    అడవికి దగ్గరగా వున్న ఓ విలేజ్ లో ఓ వ్యక్తికి కాలికి గాయం తగిలి కుంటుతున్న ఒక ఏనుగు కనిపించింది.
    ఆ వ్యక్తి జాలిపడి వెంటనే వూళ్ళో కెళ్ళి యాంటీసెప్టిక్ క్రీమ్, బ్యాండేజీ తీసుకొచ్చి దాని గాయానికి మందురాసి కట్టుకట్టాడు.
    ఆ ఏనుగు హాపీగా వెళ్ళిపోయింది.
    మర్నాడే దానిని ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళారు. చాలా రోజుల్తరువాత ఆ వ్యక్తి ఒకరోజు  ఒక సర్కస్ కెళ్ళాడు. అందులో ఫీట్స్ చేస్తోన్న ఆ ఏనుగు కనిపించిందతనికి. ఏనుగులకు జ్ఞాపకశక్తి ఎక్కువని అతనికి తెలుసు. అందుకని ఆ ఏనుగు తనను గుర్తుపడుతుందో లేదో అని ముందు వరుసలో కూర్చున్నాడు.
    ఫీట్స్ చేస్తూ మద్యలో ఏనుగు ఆడియెన్స్ దగ్గరనుంచీ రౌండ్స్ కొడుతూ ఆ వ్యక్తిని చూసింది. అమాంతం అతనిని తొండంతో ఎత్తుకెళ్ళి ఖరీదయిన రిజర్వ్ డ్ క్లాసులో కూర్చోబెట్టింది.
    కల్లు వ్యాపారం చేసే రామకృష్ణ గౌడ్ కోట్లు గడించాడు- ఆయన అవసాన దశలో తన కొడుకుని పిలచాడు.
    "చూడరా సందీప్! అచ్చం నా పద్ధతిలోనే నువ్వూ వ్యాపారం చేయటం నేర్చుకున్నందుకు నాకు చాలా హాపీగా ఉంది. అయితే నేను పోయే లోగా నీకో ముఖ్యమైన విషయం చెప్పటం అవసరం అనిపించింది. కల్లు మనం సృష్టిస్తోన్న పద్దతిలో కాకుండా తాటిచెట్లనుంచీ ఈతచెట్లనుంచీ కూడా తీయవచ్చు-"
    
    ఓ వ్యక్తి వాచిపోయిన చేత్తో డాక్టర్ దగ్గరకొచ్చాడు.
    "మరేం లేదు. బాగా వేడినీళ్ళలో నీ చేయి పది నిమిషాల పాటు ఉంచు" అన్నాడు డాక్టర్.
    అతను ఇంటికెళ్ళి ఆ పని చేసేప్పటికి ఆ చేత్తోపాటు భుజాలు రెండూ కూడా వాచిపోయాయ్. అతని ప్రాబ్లెం చూసి అతని పనిమనిషి జాలిపడి "చన్నీళ్ళల్లో చేయిపెట్టి కాసేపుంచండి సార్ - వాపు తగ్గిపోతుంది" అంది. ఆమె చెప్పినట్లే చన్నీళ్ళల్లో చేయి ఉంచేసరికి వాపులన్నీ తగ్గిపోయినయ్. దాంతో అతను కోపంగా డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు.
    "నీకంటే మా పనిమనిషి నయం! చన్నీళ్ళల్లో చేయి పెడితే వాపులు తగ్గిపోతాయంది- అలాగే తగ్గిపోయాయ్"
    డాక్టర్ ఆశ్చర్యపోయాడు.
    "అలాగా! మరి మా పనిమనిషి వేడినీళ్ళల్లో పెట్టాలందేమిటి?"
    
    అవినీతి కార్యక్రమాల ద్వారా వేలకోట్లు సంపాదించిన ఓ ముఖ్యమంత్రి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వార్త విని- ఎల్బీనగర్ లో ఒకడు చౌరాస్తాలో కూర్చుని భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.
    "ముఖ్యమంత్రి చనిపోయాడంట దేవుడో- ఎంతఘోరం జరిగింది దేవుడో -"
    అందరూ చుట్టూ మూగి ఓదారుస్తూంటే ఓ వ్యక్తి అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి ఆ ఏడుస్తున్న వాడిని నాలుగు చీవాట్లేశాడు.
    "ఛస్తే ఛావనీ! వేలకోట్లు ప్రభుత్వ నిధులు తినేసిన వెధవ ఉంటేనేం- పోతేనేం- అయినా నీకు అంత ఏడుపు ఎందుకొస్తోంది. వాడు నీకేమైనా బంధువా?"
    "కాదయ్యా - అందుకే ఏడుస్తున్నా, బంధువయ్యుంటే ఎంతో కొంత ఆస్తి దక్కేది గదా!"
    
    ఓ కాండేట్ బాగా ప్రిపేరయి ఇంటర్ వ్యూ కెళ్ళాడు.
    "చూడు మిస్టర్! 'అరౌరా బొరియలిస్' అంటే ఏంటో చెప్పగలవా?
    "అంటే నాకు ఈ ఉద్యోగం దొరకదని అర్ధం సార్".
    
    భార్య భర్తలిద్దరూ తెగ పోట్లాడుకుంటూంటారు.
    ఓ రోజు భర్తకు విసుగొచ్చింది.
    "ఏమోయ్! నీతో పోట్లాడటం కంటే వెళ్ళి లాటరీ టిక్కెట్లు కొనుక్కోవడం బెటరే!"
    "ఎందుకు?"
    "ఎందుకంటే లాటరీలో అయితే ఏదొక రోజు నేను ఖచ్చితంగా గెలవ్వచ్చు"
    
    ఒక ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ తన కార్లో తీసుకెళ్తున్నాడు.
    హఠాత్తుగా ప్రొడ్యూసర్ కి ఓ పొడుగాటి వెంట్రుక దొరికింది.
    "ఫ్రంట్ సీట్లో ఇంత పొడుగు వెంట్రుకెలా వచ్చిందోయ్?" అడిగాడు ప్రొడ్యూసర్.
    "అదీ- దానికి నేను ఎక్స్ ప్లనేషన్ ఇవ్వగలను సార్!"
    "నాక్కావలసింది ఎక్స్ ప్లనేషన్ కాదు. ఇంట్రడక్షన్!"
    
    డాక్టర్ భార్యభర్తలిద్దరినీ చాలాసేపు పరీక్షించింది.
    తరువాత భర్తను పక్కకు పిలిచింది.
    "చూడండి. మీరు ఓ ఆరునెలల పాటు మీ ఆవిడకు దూరంగా మసలాలి"
    "నో ప్రాబ్లెమ్ డాక్టర్! నా గాళ్ ఫ్రెండ్ తో మేనేజ్ చేసుకుంటా!"
    
    ఓ ముసలతను బెడ్ మీద పడుకొని దేవుడ్ని ప్రార్ధిస్తుంటే కొన్ని రోజులకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
    "ఏమోయ్- ఏం కావాలి నీకు- కోరుకో"
    "నాకు జీవితమంతా మళ్ళీ మొదటినుంచి జీవించాలని వుంది-ఆ వరం ఇవ్వగలరా స్వామీ?"
    "ఇవ్వటం పెద్ద సమస్య కాదుగానీ- ఇస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మళ్ళీ చేయకుండా ఉండగలవా?"
    "భలేవారే- ఆ తప్పులన్నీ ఖచ్చితంగా చేస్తా! కాకపోతే ఈసారి ఇంకా ఫాస్ట్ గా ఇంకా తక్కువ టైమ్ లో చేసేస్తా! అప్పుడు ఇంకా బోలెడు వెధవ పనులు చేయడానికి టైముంటుంది."
    "అబ్బ! నిజంగా ఆయన్తో విసిగిపోతున్నా హనీమూన్ కెళ్ళొచ్చాక మళ్ళీ ఒక్కసారయినా నన్ను దగ్గరకు తీసుకుంటే ఒట్టు-"
    "అలాంటప్పుడు డైవర్స్ ఇచ్చిపారేయాల్సింది!"
    "పెళ్ళయి ఉంటే అలాగే ఇచ్చేదాన్ని"
    
    మా గాళ్ ఫ్రెండ్ ఫాదర్ మా ఇద్దర్నీ పార్క్ లో పట్టుకున్నాడు.
    "ఆ తర్వాత ఏం జరిగింది?"
    "నాలుగు+ఆరు ఎంతో చెప్తే మా పెళ్ళికి వప్పుకుంటానన్నాడు"
    "నువ్వేం చెప్పావ్"
    "పదకొండని చెప్పాను"
    "మరి పెళ్ళి కాన్సిల్ చేశాడా?"
    "లేదు కరెక్ట్ ఆన్సర్ కి చాలా దగ్గరగా వచ్చానని మెచ్చుకొని ఓకే చేశాడు"
    
    "నేషనల్ బాంకోళ్ళు ఒక క్యాషియర్ కావాలని వెతుకుతున్నారు"
    "అదేంటి! నిన్నేగా మీ ఫ్రెండ్ ని ఆ బాంక్ లో క్యాషియర్ గా జాయిన్ చేశావ్"
    "అదే- వాడికోసమే వెతుకుతున్నారు"
    
    చీమలు దూరని చిట్టడవిలోకెళ్ళి టెంట్ వేసుకుని మకాం పెట్టారు కొంతమంది టూరిస్ట్ లు. రోజూ ఓ కోయదొర వాళ్ళదగ్గరికి వచ్చి, ఆ రోజు ఎప్పుడు ఎన్నిగంటలు వర్షం కురిసేది ఎప్పుడు సూర్యోదయం అయ్యేది, ఎండ ఎంతసేపు కాసేది చెప్తూంటే వాళ్ళంతా ఆశ్చర్యపోతూండేవాళ్ళు.
    "ఈ కోయదొరల కేదో పవర్ ఉంటుందండీ! అందుకే అంత కరెక్ట్ గా వాతావరణం గురించి చెప్పగలగుతున్నారు" అనుకున్నారు వాళ్ళు ఓ రోజు మామూలుగా కోయదొర వచ్చాడు గానీ, వాతావరణం గురించి మాట్లాడలేదు.
    "ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది?" అడిగాడొకతను.
    "తెలియదు దొర! మా రేడియో పాడయిపోయింది"
    
        
                              ---సమాప్తం---

 Previous Page