"పార్టీకి రవళి వస్తే సీనెలా మారిపోయిందో చూడండి. రవళిని చూస్తే ప్రకృతికీ మూడొస్తుంది" చనువుగా అన్నాడు ఎస్టేట్ మేనేజర్ కుటుంబరావు.
"నీకుమాత్రం ఎప్పుడూ మూడ్ రాదు" సాగదీస్తూ ఆ డైలాగ్ అనగానే అక్కడందరూ పెద్దగా నవ్వారు.
టీపాయ్ మీద గ్లాసుల్ని తలొకరూ అందుకొని సిప్ చేయసాగారు.
మొత్తం గ్లాసులోని డ్రింక్ నంతా గడగడా తాగేసాడు భుజంగపతి. వెంటనే రెండో పెగ పోసుకున్నాడు.
"ఏమిటీ పతిగారూ ఏదో హేపీలో వున్నట్టున్నారు" వ్యంగ్యంగా అంది రవళి.
"హేపీయే,అ నతా హేపీయే. మా జ్వాలాముఖిబావ చేస్తున్న పనులు చూస్తుంటే హేపీగాక మరేంటి నువ్వు కూడా ఈ మధ్య బిజీ అయిపోయినట్టున్నావ్. కనీసం ఇలా జరుగుతోంది అన్న విషయం నా చెవిన వేస్తే ఏం పోయింది?" కొంచెం కోపాన్ని నటిస్తూ అన్నాడు.
"ఏ విషయం?" ప్రశ్నించింది రవళి.
"ఏ విషయమట. ఏ విషయం సిల్క్ స్మిత పెళ్ళి సంబంధం విషయం గానీ, ఏవీ తెలియనట్టు మాట్లాడకమ్మా నాకు చిర్రెత్తు కొస్తోంది" చిరాగ్గా అన్నాడు.
"ఓ.....ఆదా....ఈ సడన్ మీటింగ్ సారాంశం. జెమ్ గారు జామ్మని అటు వెళ్ళగానే ఇటు ఈ మీటింగ్ ఏటని అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ పిల్ల విషయమేనా ఆ మయూష గురించి చివరి దాకా నాకూ తెలియదండి. పెళ్ళి రేపనగా తెల్సింది. అంతే-మొత్తం ఆ నవనీతే చూసుకున్నాడు. ఆ మయూష గొడవంతా మీరే చూసారుగా. ఆ పెళ్ళి మీ ద్వారా జరిగింది గదా. నన్నంటారేం?" పెగ్గును ఉగ్గులా తాగుతూ అంది రవళి.
"అంతా నా ద్వారానే జరిగింది తల్లీ. ఎప్పుడూ మయూషను తను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం పూర్తిగా జరిగిపోయాక అలాంటి ఐడియా రావడం వెనక వ్యక్తులెవరని నా ఒపీనియన్" అన్నాడు భుజంగపతి.
"అది పూర్తిగా జెమ్ గారి నిర్ణయమే అనుకుంటాను. చాలా ప్లాన్డ్ గా, పకడ్బందీగా ఆపరేట్ చేసారు. జెమ్ పగ పాము పగ" కుటుంబరావు పొగిడాడు.
"జెమ్ పగ పాము పగ. నీ పగ ఉడత పగ. ఇప్పుడు పొగడ్తల కార్యక్రమం కోసం కాదు ఈ పార్టీ" అన్నాడు భుజంగపతి ఒకింత కోపంగా.
"మరి దేనికట?" అడిగాడు ప్రకాష్ సింగ్.
"ఇన్నాళ్ళూ జ్వాలాముఖిరావు వంటరివాడు. పెళ్ళాం పిల్లా జెల్లా లేనివాడు మరి ఇప్పుడు సడన్ గా తన పరువుని నిలువునా తీసిన మయూషను పెళ్ళి పేరుతో భార్య పేరుతో ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ పెళ్ళి జరక్కుండా నేను విశ్వప్రయత్నం చేసాను. వీలుకాలేదు. ఇప్పుడు మయూష ఆఫీషియల్ గా జ్వాలాముఖిరావు భార్య" అన్నాడు భుజంగపతి.
"ఇలాంటి భార్యల్ని ఎంతమందిని చూడలేదు. ఇలాంటి నాలుగు వారాల ఇంగ్లీషు పిక్చర్స్ ని మనం ఎన్ని చూడలేదు. చూస్తూండు. నాలుగో వారంలో మయూష రోడ్డున పడుతుంది. అయిదో వారంలో సూసైడ్ చేసుకుంటుంది" కుటుంబరావు అన్నాడు.
"ఇప్పటివరకూ జరిగిన కథలు వేరు. ఇప్పుడు జరుగుతున్న కథ వేరండీ బాబూ. జ్వాలాముఖిరావు ఏదో మాస్టర్ ప్లాన్ వేసాడని నా అనుమానం. నచ్చిన అమ్మాయిని గెస్టు హౌస్ కి తెప్పించుకోవడం, మోజు తీరాక వదిలేయడం మా బావ అలవాటు. అలాంటి కేసుల్ని ఎన్నింటిని చూసాం మయూష నచ్చిందే అనుకోండి. కానీ గెస్ట్ హౌస్ కి పిలిపించలేదు. పెళ్ళి చేసుకున్నాడు. అదీ పదిమందిలో తిరుపతిలో పైగా ఇంట్లో పెట్టుకున్నాడు. ఏ అమ్మాయితోనయినా వెంటనే గడపడానికి ఉత్సాహం చూపే జ్వాలాముఖిరావు మొదటిరాత్రి మయూషతో గడపలేదు. అదే కాకుండా స్టాఫ్ నెవర్నీ ఇంట్లో పై ఫ్లోర్లోకి వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు విధించాడు కూడా.
అసలు ఈ తంతంగమంతా ఏమిటో నాకేం అర్ధం కావడంలేదు. అందరికీ పగ, ప్రతీకారపు చర్య వెనక ప్రేమ కహానీ వుందేమోనని నా అనుమానం. అంచేత ఈ విషయంలో మనం జాగ్రత్తగా వుండాలి" నెమ్మదిగా తన మనసులోని బాధను చెప్పాడు భుజంగపతి.
"పతిగారూ డోన్ట్ వర్రీ. ఇన్నాళ్ళూ మనం నమ్మకంగా జెమ్ దగ్గర ఎందుకు పని చేస్తున్నాం? మన స్వార్ధం మనకుంది గదా? ఆ మయూష, జ్వాలాముఖిరావు పెళ్ళామే అనుకోండి. అయితే ఏవైందట? గోరంతదాన్ని కొండంతగా ఊహించడం మీ అలవాటు. డోన్ట్ వర్రీ. ఇంతవరకూ పెద్దగా పట్టించుకోలేదు. ఇకనుంచి ఈ అంతర్నాటకాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మీరు భయపడకండి. జ్వాలాముఖి ఎస్టేట్స్ మన చేతిలోంచి జారిపోతుందనే మీ భయాన్ని పక్కన పెట్టండి. డ్రింక్ బాగుంది. సిప్ చెయ్యండి" కుటుంబరావు అన్నాడు.
ఆ మాటతో శాంతిపడ్డాడు భుజంగపతి.
"మొదటిరోజు రాత్రి మయూషకు జ్వాలాముఖిరావు బెదిరిస్తున్నట్లుగా మాట్లాడాడని, ఆ తర్వాత మయూష కన్నీళ్ళు పెట్టికుందని, ఆ కథంతా మన రంగస్వామి చెపుతూంటే నా అనుమానానికి అక్కడే బీజం పడింది" గ్లాసును అందుకుంటూ అన్నాడు భుజంగపతి.
"మయూషను జ్వాలాముఖి ఏవని బెదిరించాడు" ఆసక్తిగా అడిగింది రవళి.
"మన రంగస్వామి చెవిటి మాలోకం గదూ వినీ విన్పించని గొడవ కథాకళీ డ్యాన్స్ చేస్తూ ఏదో చెప్పాడు" దూరంగా చేతులు కట్టుకుని నిలబడిన రంగస్వామి వేపు చూస్తూ చెప్పాడు భుజంగపతి.
"మయూషను జ్వాలాముఖి ఏవని బెదిరించాడు" ఆసక్తిగా అడిగింది రవళి.
"మన రంగస్వామి చెవిటి మాలోకం గదూ వినీ విన్పించని గొడవ కథాకాళీ డ్యాన్స్ చేస్తూ ఏదో చెప్పాడు" దూరంగా చేతులు కట్టుకుని నిలబడిన రంగస్వామి వేపు చూస్తూ చెప్పాడు భుజంగపతి.
"వాడికో హియరింగ్ ఎయిడ్ కొనిస్తే సరిపోతుంది గదా" అయిడియా ఇచ్చింది రవళి.
"గుడ్ అయిడియా. ఆ పని రేపే చెయ్యవయ్యా బాబూ ఎప్పటి కప్పుడు విశేషాలు తెలిస్తే కొంతలో కొంత మనశ్శాంతిగా వుంటుంది" కుటుంబరావు వేపు చూస్తూ అన్నాడు భుజంగపతి.
"మీరు వర్రీ కాకండి పతిగారూ రేపట్నించి మయూషను నేను కూడా అబ్జర్వ్ చేస్తానుగా" హామీ యిచ్చాడు కుటుంబరావు.
మొదటి బాటిల్ పూర్తయ్యింది.
"ఈ రంగస్వామి గాడెందుకిక్కడ. ఎస్టేట్ కి పంపించెయ్యండి. వాడక్కడ లేడని తెలిస్తే జ్వాలాముఖిరావు నా దుంప తెంపేస్తాడు" మళ్ళీ కుటుంబరావు అన్నాడు.
పది నిమిషాల తర్వాత రంగస్వామి అక్కడనుంచి వెళ్ళి పోయాడు.
"సడెన్ గా వెన్నెల మాయమైపోయింది. మబ్బులొచ్చేసాయేమిటి?" ప్రకాష్ సింగ్ అన్నాడు.
"సింగ్ కి మూడొచ్చినట్టుంది. అవి మబ్బులు కావండీ బాబూ మత్తువల్ల కళ్ళు మూసుకుపోతున్నాయి అంతే"
"మూడూ....మూడూ అని ఊరించడమే తప్ప ఎప్పుడయినా ముచ్చట తీర్చావా చెప్పూ?" రవళి భుజంమీద చేతులు వేసాడు భుజంగరావు ఆ చేతుల్ని పక్కకు తప్పిస్తూ రవళి మెత్తగా నవ్వింది భుజంగరావు. ఆ చేతుల్ని పక్కకు తప్పిస్తూ రవళి మెత్తగా నవ్వింది భుజంగపతి వేపు చూసి.
"నాయనా.....కుటుంబం....గెస్ట్ హౌస్ లోకెళ్ళు. నీక్కావల్సింది ఏర్పాటు చేసాను గదా" అని అన్నాడు భుజంగపతి.
"చెప్పరేం?" అంటూ లేడిలా లేచి గబగబా గెస్ట్ హౌస్ లో కెళ్ళి పోయాడు కుటుంబరావు. కొద్దిసేపటి తర్వాత ప్రకాష్ సింగ్ వెళ్ళి పోయాక-
నెమ్మదిగా భుజంగపతి పక్కకు చేరింది రవళి.
"అన్ని విషయాలూ అందరితోనూ డిస్కస్ చేయడం మంచిది కాదేమో" అని అంది అతని మీసాల్ని నిమురుతూ.