"చూడు శైవి! నా మిసెస్ సాయంకాలం ఆరు సమీపించే కొద్ది నాకోసం ఎదురు చూస్తూ వుంటుంది!"
"అయితే అక్కయ్య బాగా కండిషన్లో వుంచిందన్నమాట!" మళ్ళీ నవుతో కిళ్ళి అందించింది. ఈ పర్యాయం కాదన్లేక పుచ్చుకున్నాడు. నోట్లో వేసుకున్నాడు "దట్స్ గుడ్" అందామె.
"ఒకే! వస్తాను!" రేపు ఆఫీసులో కలుస్తాం కదా.
"తలూపి వెళ్లేడతను"
సాయకాలం ఆరు గంటల నుంచి భర్త రాకకోసం ఎదురు చూస్తోంది వైజయంతి. సామాన్యంగా అయిదున్నరకి అటూ యిటూగా వచ్చే భర్త ఈరోజు యింకా ఎందుకు రాలేదు. అనుకుంటుందామె.
దాదాపు ఏడుగంటల సమయంలో రోడ్డు మలుపు తిరుగుతూ కనిపించాడు నరేంద్ర అతన్ని చూడగానే ఆమె ముఖం విప్పారింది. మరో రెండు నిమిషాలకి యింటి ముందుకు వచ్చాడతను.
లోపలికి రాగానే "ఏవండి యింత అలస్యమైనది" అడిగింది. అతను సమాధానం చెప్పటానికి నోరు తెరవగానే "హయ్" అని కేకేసిందామె. ముఖమంతా సంతోషం కప్పేసింది. "కిళ్ళి వేసుకున్నారా?! అని అడిగింది ఆనందోత్సాహాలతో.
కాపి చేస్తూ దొరికిపోయిన కుర్రాడిలా సిగ్గుపడ్డాడు నరేంద్ర. అతను నోరువిప్పి సమాధానం చెప్పలేకపోయాడు. కానీ వైజయంతికి అతను కిళ్ళి వేసుకోవటం ఎంతో ఆనందంగా వుంది.
దగ్గరగా భర్త భుజాలు పట్టుకుని వేలాడుతూ ప్రేమగా అడిగింది. "అబ్బ ఎన్నాళ్ళకి కిళ్ళి వేసుకున్నారు. అసలే మీవి దొండపండు లాటి పెదాలయే? ఈ కిళ్ళి వేసుకుంటే యాపిల్ ముక్కల్లా వున్నాయి అలాగే కోరికేద్దామా అనిపిస్తుంది నిజం!" ఇబ్బందిగా ముఖం పెట్టాడతను.
"ఎలా, ఆఫీసులో పార్టీ వుండిందా? అందుకే నన్నమాట ఆలస్యమైంది? పోన్లెండి మీ ఆఫీసరు బలవంతం చేశాడా? చూడండి? రేపటి నుంచి రెగ్యులర్ గా కిళ్ళి వేసుకోండి. లేదంటే తాంబూలం సామాగ్రి అంతా తెప్పిస్తే రోజు నేనూ మడుపు అందిస్తాను!"
ఆనందోత్సాహాలు రేటింపుగా అంది వైజయంతి. నవాడు నరేంద్ర.
మరో వారం రోజులకి రోజు కిళ్ళి వేసుకుందికి అలవాటు పడ్డాడు. నరేంద్ర ఉదయం ఆఫీసుకి వెళ్ళేముందు యింటి వల్ల అబ్బాయితో కిళ్ళి తెప్పించి పెట్టేది వైజయంతి. అతనాఫిసులో లంచ్ అవర్లో టిఫిన్ తీసుకోగానే తాను శ్రద్ధగా యింటి వద్ద నుంచి తెచ్చిన కిళ్ళి యిచ్చేది శైవాలిని. రాత్రి బెడ్ రూంలో కిళ్ళి వైజయంతి.
ఆరోజు సాయంకాలం ఎవరో క్లర్క్ ట్రాన్స్ఫరయ్యాడని టీ పార్టీ ఎరేంజ్ చేశారు. స్వీట్స్ తిని, కారా పుచ్చుకుని టీ తాగక అందరికి కిళ్ళి అందించాడు. ఎర్రబడ్డ నోటికి సిగరెట్ ఆఫర్ చేశాడు ఆఫీసరు. ఇబ్బందిగా ముఖం పెడితే పెదవి విరిచింది శైవాలిని. అతనికి చప్పున ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
"తిసుకోవోయ్!" అన్నాడాఫిసరు. ఆప్రయత్నంగా చేయి చాచేడు నరేంద్ర.
మెచ్చుకోలుగాను, వ్యంగ్యంగాను నవ్వింది శైవాలిని. వణుకుతున్న చేతులతో సిగరెట్ ముట్టించబోయాడతను. నిప్పు పుల్ల అదిపోతే కో ఆఫీసరు నిప్పు పెట్టాడు. తొలిసారిగా సిగరెట్ దమ్ములాగగానే పోరాపోయిందతనికి. ముఖం తిప్పుకొని నవ్వింది శైవాలిని.
అందర్నీ కాదని కొద్దిగా దూరం నడిచిందామె. ఏదో గుర్తుగా అతను అటునడిచాడు. 'కంగ్రాట్స్! మగాళ్ళనిపించుకుందికి మరో మెట్టు ఎక్కేరు" అంది. అది అభినందనో, వ్యంగ్యమో తెలియలేదతనికి. కానీ నోరంతా చేదుగా అయిపొయింది. మనస్సూ చేదు తిన్నట్టయింది.
"శైవి!" అన్నాడు బాధగా.
"ఏం?" కళ్ళేగరేస్తూ అడిగింది. "మనిషి పర్ ఫెక్టుగా ఉండకూడదా? హైక్లాస్ సొసైటి పేరుతొ అంత చండాలం తింటూ, తాగరానిది తాగుతూ, సిగరెట్ జలాయి వెదవల్లా కాలుస్తూ, తిరుగుబోతూల్లా కిళ్ళి నవుల్తూ ఉండాలా? వీటన్నిటికి అలవాటు పడకపోతే అతను మొగాడు కాదా?!
నిదానంగా చూసింది. శైవాలిని. నరేన్ బాగా వుండ్ అయ్యడనుకొంది. పాసివ్ గా నవ్వింది. ఏదో సమాధానం చెప్పబోయింది. అంతలో సి.టి.వో. కేకేయ్యడంతో పోయింది. రెక్కలు తెగిన పావురాయిలా ఒంటరిగా నిలుచుండిపోయాడు నరేంద్ర. తిరిగి యింటికి రాగానే వైజయంతి తను సిగరెట్ తాగినందుకు సంతోషం వెలిబుచ్చగానే అతనికా సంఘటన అంతా గుర్తుకొచ్చింది. "డామిట్!" అన్నాడు ఆ ప్రయత్నంగా.
"ఏమిటి? "నివేరపోతూ అడిగింది వైజయంతి.
"చాలా మంది ఆడవాళ్ళు రియల్ లైఫ్ లో, కధలో, నవలల్లో సిగరెట్ తాగే మొగాళ్ళని, కేర్ ఫ్రీగా తిరిగే వాళ్లని నిరసించి ఆ అలవాటు మార్చుకునేట్టుగా చూస్తారు. చేస్తారు అదేం. నీవు యిలా అంటున్నావ్"
ఫక్కున నవ్వింది ఆమె."నరేన్! వాళ్లకి లైఫ్ తెలియదు. వీటన్నిటిని దూరం చేసుకొని బ్రతికితేనే పర్ ఫెక్ట్ లైఫ్ అనుకుంటారు. అంతా బి.సి. నాటి ఉహాలు!"
"జయా!"
"ఏం?"
"నేనూ బి.సి నాటి మనిషినే?!" కనుబొమ్మలు ముసిందామే.
:"నేను డిసెంబరు 24న పుట్టాను. బిఫోర్ క్రిస్ట్" విరబడి నవ్వింది వైజయంతి. చప్పున అతని ముఖాన్ని లాక్కుంది.
కేవుమంది శైవాలిని. చప్పున దూరమయ్యాడు నరేంద్ర "సారీ! చెపుతూ రక్తసిక్తమైన పెదవిని నాలికతో తడుపుకుంది. తన రక్తం తనకే ఉప్పగా అనిపించింది. గ్లాసులో విస్కీతో అద్దుకుంది. గ్లాసుని ఆమె పేదల కందించి! "రియల్లి సారీ" అన్నాడు.
అంతలో నవేసింది శైవాలిని.
"యిది బావుంది. అంతలో నవ్వు, అంతలో కోపం! అంతలో సంతోషం అంతలో బాధ భావాలు ఎలా మరతాయబ్బా?" చిత్రంగా అడుగుతోన్న అతన్ని చూసి ఆమె మళ్ళీ నవ్వింది. "నరేన్! బాధలో సుఖం, సుఖంలో బాధ అంటే యిదే!"
"శైవ్!"
"ఊ"
"నువు నిజంగా ఏంజిల్ వి?"
"ఎందుకు?"
"ఈ చలాకితనం, ఈ అల్లరి మనసు, ఈ సొగసైన మనసు నన్ను తిప్పలు పెట్టాయి. కిళ్ళితో మొదలై కౌగిలి దాకా తెచ్చావు. టీ రుచి మరిగించి విస్కీ దాకా రప్పించావు, నిజంగా జీవితంలో మాధుర్యం అంతా రుచి చూపుతున్నావు. థాంక్యూ వెరిమచ్!"
"సో! టు యూ-"
"శైవా!"