"వెరీబాడ్"
"మరి నువ్వెందుకు డల్ గా ఉన్నావ్?"
"మా గాళ్ ఫ్రెండ్ ని చూడ్డానికి మా ఊరు వెళ్ళాలనిపించింది. అందుకని మా డాడీకి ఫోన్ చేసి మమ్మీని చూడాలని ఉందనీ, అందుకని ఇంటికి వస్తున్నాననీ, ఖర్చులకు డబ్బు పంపమనీ చెప్పాను-"
"మరేం జరిగింది?"
"మా మమ్మీని నా దగ్గరకు వెళ్ళమని ట్రైనెక్కించారు-"
స్పోర్ట్స్ లో బాగా పేరున్న పూజ పెళ్ళి సడెన్ గా ఫిక్సయింది. పెళ్ళికి వచ్చిన మరో స్పోర్ట్స్ మెన్ మహేష్ ని పూజ ఆంటీ ఒకావిడ గుర్తుపట్టి పలుకరించింది.
"ఏమోయ్ మహేష్! నువ్వేనా పెళ్ళి కొడుకువి" అడిగింది ఆంటీ.
"కాదాంటీ?" నిరుత్సాహంగా అన్నాడు మహేష్.
"అదేంటి? నువ్వూ, పూజా మొగుడూ పెళ్లాల్లాగా క్లోజ్ గా తిరిగారుగా?"
"తిరిగాం గానీ- సెమీ ఫైనల్స్ లో నా ఛాన్స్ పోయిందాంటీ-"
భార్యా భర్తలిద్దరూ రెండ్రోజులుగా గొడవపడుతున్నారు. చివరకు భార్యే ఒక రాజీ ఫార్ములా సజెస్ట్ చేసింది.
"గొడవెందుకు? ఇద్దరం చెరిసగం తప్పుచేసినట్లు వప్పుకుందాం" అందామె.
"అంటే?"
"నేను మాట్లాడిందంతా రైటే అని నేను వప్పుకుంటాను. నువ్ మాట్లాడిందంతా తప్పే అని నువ్ వప్పుకో! దాంతో ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది".
"యా! యూ ఆర్ రైట్" అన్నాడు భర్త హాపీగా.
ఒక నీచనికృష్ణ రాజకీయ నాయకుడిని ఓసారి ఒక స్ట్రీట్ డాగ్ కరిచింది.
వెంటనే తన నియోజక వర్గంలోనే ప్రాక్టీస్ చేస్తోన్న డాక్టర్ దగ్గరకు ఫ్రీ ట్రీట్ మెంట్ కోసం వచ్చాడతను.
డాక్టర్ అతనికి మందులు రాసిచ్చాడు.
"ఈ టాబ్ లెట్స్ వాడండి" అన్నాడు డాక్టర్.
"ఇవి ఎన్ని గంటలకొకసారి వేసుకోవాలి?"
"నాలుగ్గంటల కొకటి చొప్పున- అన్నట్లు- అవి నీక్కాదు- నిన్ను కరిచిన కుక్కకి-"
"కుక్కకా? దానికెందుకయ్యా?"
"అది చావకుండా ఉంటానికి-"
ఖాళీగా ఉన్న ఒక బెడ్ దగ్గరకు డాక్టర్, నర్స్ హడావుడిగా వచ్చారు.
"అరె! ఈ బెడ్ మీద పేషెంట్ ఏడీ?" అడిగాడు డాక్టర్.
"ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు సార్"
"ఓర్నాయనో- కొంపమునిగింది"
"మీదా, నాదా సార్"
"నాదే - నాదే"
"ఎందుకు సార్ ఏమయింది?"
"అతనికి ఆపరేషన్ చేసినప్పుడు- అతని బ్రెయిన్ తీసేసి లాబ్ లో ఎక్స్ పెరిమెంట్ కోసం దాచాను- ఇవాళ తిరిగి బ్రెయిన్ పెట్టేద్దామనుకుంటే వాడు పారిపోయాడంటు న్నావ్- ఇప్పుడెలా?"
"బ్రెయిన్ లేకుండా వాడెక్కడ బ్రతుకుతాడు సార్- ఏదొక రోజు మన దగ్గరకే తిరిగి వస్తాడు- డోంట్ వర్రీ" అంది నర్స్.
అన్నట్లే ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చాడా పేషెంట్.
"ఏం సార్! నా కోసం తెగ వెతుకుతున్నారంట" అడిగాడు డాక్టర్ ని.
"అవునోయ్-ఏమయి పోయావ్ ఇంతకాలం?"
"ఎలక్షన్స్ కద్సార్- పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచా! లక్కీగా మంత్రిపదవి కూడా వచ్చింది- ఇప్పుడు నేను హెల్త్ మినిష్టర్ ని అందుకే ఈ హాస్పిటల్ కీ ఇన్ స్పెక్షన్ కొచ్చా-"
డాక్టర్ కిందపడ్డాడు పెద్ద శబ్దంతో-
ఓ జల్సారాయుడి ఆఫీస్ ఫోన్ మోగింది.
"మీకేమయినా సిగ్గుందా? నేను మళ్ళీ నెలతప్పానంటోంది డాక్టర్" అందో లేడీ వాయిస్ కోపంగా.
జల్సారాయుడు కన్ ఫ్యూజయ్యాడు.
"ఎవరు మాట్లాడేది?"
"అది కూడా తెలీటం లేదా? ఇడియెట్! నేనే!"
"ఓ నువ్వా! నేనింకా మాట్లాడుతోంది మా మిసెస్ అనుకున్నా-"
"నేను మీ మిసెస్ నే రా బాస్టర్డ్!"
"అంటే - కరీంనగర్ మిసెసా- మహబూబ్ నగర్ మిసెసా?"
హలో ఏమిటి బ్రదర్- చాలా హడావుడిగా వెళ్తున్నావ్- ఎక్కడికి?"
"మా ఫ్రెండ్ ఒకతను మారేజ్ తాలూకూ సిల్వర్ జూబిలీ ఫంక్షన్ కు ఇన్ వైట్ చేశాడ్లే- అక్కడి కెళ్తున్నా-"
"అంటే అతని పెళ్ళయి ఇరవై అయిదేళ్ళు అయిందా?"
"కాదహ- ఇప్పుడు వాడు చేసుకుంటున్న అమ్మాయి ఇరవై అయిదో పెళ్ళాం-"
రామేశ్వర్రావ్ వాళ్ళావిడను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
"నా మిసెస్ కి బాగా చాదస్తం ఎక్కువయిపోయింది సార్. ఇరవై నాలుగ్గంటలూ- ఒకటే సాధింపు. ఒకటే గొణుగుడు- రాత్రి నిద్రవుండటం లేదు నాకు. అది తగ్గేందుకేమయినా మందివ్వండి డాక్టర్ గారూ- చాలా మేలు చేసిన వారవుతారు" బ్రతిమాలాడు రామేశ్వర్రావ్.
"డోంట్ వర్రీ! ఈ టాబ్లెట్స్ వాడండి - మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది".
"ఆమెకి ఎప్పుడెప్పుడు ఎన్ని టాబ్లెట్స్ చొప్పున వేయాలి?"
"అవి ఆమెక్కాదు! నీకు! స్లీపింగ్ టాబ్లెట్స్ అంటారు వాటిని! రోజూ సాయంత్రం ఎనిమిదింటికి ఒకటి వేసుకుంటే ఉదయం ఆరింటి వరకూ మీ ఆవిడ ఎంత అరచినా, గీపెట్టినా నీ నిద్ర డిస్టర్బ్ అవదు-"
"ఏమిటే రజనీ- అతన్తో రూమ్ లో అంతసేపు మాట్లాడావ్?"
"నేను ఆడో, మగో రుజువు చూపించమన్నాడు. ఎన్ని విధాలుగా కన్విన్స్ చేసినా అతనికి నేను ఆడదాన్నని నమ్మకం కలగలేదు. ఆఖరికి రుజువులు చూపించాల్సి వచ్చింది-"
"ఆ! రుజువు చూపించావా? ఏం చూపించావే?"
"ఆ కంగారేంటి? నా ఓటర్ కార్డు చూపించాలే!"
ఓ కాలనీలో ఫుట్ పాత్ మీద పడుకుంటున్న ఓ ముష్టివాడిని- ఆ పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారు చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు.
"డాక్టర్ గారూ! ఈ ముష్టివాడు రాత్రింబగళ్ళు భయంకరంగా దగ్గుతున్నాడు. వీడి దగ్గువల్ల మాకెవరికీ రాత్రుళ్ళు నిద్ర ఉండటం లేదు. అతనికి ఆ దగ్గురాకుండా మందివ్వండి సార్-"
డాక్టర్ వెంటనే టాబ్లెట్స్ రాసిచ్చాడు.
"ఇవి అతను ఎప్పుడెప్పుడు వేసుకోవాలి?" అడిగారు వాళ్ళు.
"అవి అతనిక్కాదు. మీకు-"
"మాకెందుకు? దగ్గు ప్రాబ్లెం ఆ ముష్టివాడిది కదా"
"అతనికి రకరకాల టెస్ట్ లు చేయాలి, మందులివ్వాలి. రెగ్యులర్ చెకప్ చేస్తూండాలి! ఇవన్నీ చేసినందుకు నాకు ఫీజెవరిస్తారు? అతను ముష్టి వాడు గనుక ఫీజివ్వలేదు- ట్రీట్ మెంట్ మీక్కాదు కనుక మీరూ ఫీజు ఇవ్వరు- అందుకే మీరు ఆ టాబ్లెట్స్ వేసుకుంటే- వాడెంత భయంకరంగా దగ్గినా మీకు వినబడదు- హాపీగా నిద్రపోతారు. అన్నట్లు ఫీజు మూడొందలు కట్టండి-"