"అబ్బ! ఎంత దూరం ఆలోచించారు సార్! కానీ ఈ రోజుల్లో లవ్ లో పడటం- లవ్ మారేజెస్ చేసుకోవడం- అన్నీ చాలా మామూలు విషయాలే కద్సార్- అంత కంగారుపడాల్సిన పనేముంది?"
"అది కరెక్టే గానీ నాకు కూతుళ్ళే లేరు కదా! అక్కడొస్తుంది ప్రాబ్లెమ్"
ఎప్పుడూ కోటీశ్వరురాలవాలని కలలుకనే భార్యతో ఓ మిడిల్ క్లాస్ భర్త విసిగి వేసారి పోయాడు.
అయినా భార్య ప్రవర్తన మారటం లేదు.
"చూడండి! మీకిది లాస్ట్ వార్నింగ్! మనం కోటీశ్వరులుండే చోట కాపురం పెట్టాలని ఎప్పటినుంచో చెప్తున్నాను! అయినాగానీ మీరు పట్టించుకోవటమే లేదు- ఇవాళ సాయంత్రానికల్లా ఏమయినా సరే ఈ ఇల్లు ఖాళీ చేసి బాగా రిచ్ పీపుల్ ఉండే ఏరియాకి షిఫ్టయి పోవాల్సిందే" అందామె.
సాయంత్రం వరకూ జుట్టు పీక్కుంటూ ఊరంతా అలాంటి ఇంటికోసం వెతికి వచ్చిన భర్తని మళ్ళీ నిలేసింది భార్య.
"నేనిప్పుడే మన సామాన్లు షిఫ్ట్ చేయడానికి మినీలారీ కూడా మాట్లాడానండి." ఉత్సాహంగా అందామె.
లారీలో సామాను వేసుకుని బయల్దేరారు వాళ్ళు.
లారీ తిరిగి తిరిగి ఒక స్మశానంలో కొచ్చి ఆగింది.
"ఇక్కడకు తీసుకొచ్చారేంటి?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"కోటీశ్వరులతో పాటు మనం కలసి ఉండగలిగే ప్లేస్ ఇదొక్కటేనే! మరి ఇక్కడే సెటిలవుదామంటావా?" అడిగాడు భర్త.
రంగరాజు తన ఊరు వదిలి పదేళ్ళయిపోయింది. ఒకసారి మళ్ళీ ఆ ఊరెళ్ళి తన ఫ్రెండ్సందరూ ఎలా ఉన్నారో చూడాలనిపించింది. ఊళ్ళో రైలు దిగి సూట్ కేస్ తో బయటికొచ్చేసరికి అతని క్లోజ్ ఫ్రెండ్స్ నవీన్, నితిన్ కనబడ్డారు.
"ఏంట్రా? సూట్ కేస్ తో బయల్దేరావ్- మనూరు వదిలి వెళ్ళిపోతున్నావా ఏంటి?" ఇద్దరూ అడిగారు.
భర్త రోజూ మందు బాటిల్ తెచ్చుకుని రాత్రి పన్నెండింటివరకూ మందుకొట్టి డెడ్ బాడీలా పడుకుని నిద్రపోవటం భార్యకు నచ్చలేదు! చాలా రోజులు మందు తాగొద్దని బ్రతిమాలి చివరకు ఓ రోజు అతను మందు కొడుతూంటే కోపంగా గదిలో కొచ్చింది.
"మీకేమయినా బుద్దీ, జ్ఞానం ఉందా? నేను కాపురాని కొచ్చి పదేళ్ళవుతోంది. ఒక్కరోజు కూడా సరదాగా నాతో గడిపిన పాపాన పోలేదు- ఎప్పడూ మందే- ఇంకెన్నాళ్ళిలా?" అంటూ గొడవ చేయటం మొదలుపెట్టింది.
"సరే- మానేస్తాలేగానీ - ఇవాళ నువ్ కూడా కొంచెం తాగాలి" అంటూ బలవంతంగా ఆమెతో టేస్ట్ చేయించాడతను.
ఆమె నోట్లో పోసుకోగానే వెంటనే 'థూ' అంటూ ఊసిపారేసింది.
"ఛీ! ఇంత కషాయం లాంటి చెత్త నా జన్మలో టేస్ట్ చేయలేదు" అందామె.
"అదే- అదేనే నేనూ మొత్తుకునేది! నేనేదో తెగ ఎంజాయ్ చేస్తున్నానని నువ్వనుకుంటున్నావ్ గానీ ఈ కషాయం ఎంత కష్టపడి తాగుతున్నాననో ఇప్పటికయినా నీకర్ధమయితే నా కంతే చాలు- అంతే చాలు" అన్నాడతను కన్నీళ్ళతో.
ఎలక్షన్లో గెలిచాక అయిదేళ్ళవరకూ తన నియోజక వర్గం మొఖం చూడని ఒక ఎమ్మెల్యే మళ్ళీ తనకే ఓటు వేయమని అడగడానికి మీటింగ్ పెట్టి లారీల్లో జనాన్ని తరలించుకొచ్చాడు.
"సోదర సోదరీమణులారా! మీరంతా ఇంకా పావర్టీ లైన్ కిందే ఉన్నారని నాకు తెలుసు. ఈ అయిదేళ్ళల్లో మిమ్మల్నందర్నీ ధనవంతులుగా చేయాలని నేనూ మన ప్రభుత్వం ప్రయత్నించాం గానీ ఆఖర్లో మాకో నిజం గుర్తుకొచ్చింది. మిమ్మల్ని ధనవంతులుగా చేస్తే మీరు ఎన్నో కష్టాల పాలవుతారని మాకు అర్ధమయింది. ఎందుకంటే మీ దగ్గర డబ్బుంటే మీ ఇంటికి బంధువుల తాకిడి పెరిగిపోతుంది. ప్రతి ఎన్నికల్లో మా రాజకీయ నాయకులకు పార్టీ ఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు. అది లేకపోవటం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తాయ్- మీ జబ్బు తగ్గినా దొంగ రిపోర్ట్స్ చూపించి-ఛార్జీలు వసూలు చేస్తారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు మీ డబ్బు సగం దోచుకుంటారు. ఇదే మీరు బీద పరిస్థితిలోనే ఉంటే ఈ సమస్యలేమీ ఉండవ్.
వాటర్ బిల్లులూ, కరెంట్ బిల్లులూ, హౌస్ టాక్స్ లూ లాంటివి అతి తక్కువ. రెండ్రూపాయలకే కిలో బియ్యం, ప్రతి ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు. మీరు అయిదేళ్ళల్లో బాంకుల్లో చేసిన అప్పులన్నీ గవర్నమెంట్ మాఫీ చేసేస్తుంటుంది" జనమంతా తప్పట్లు కొట్టారు.
"గరీబీ- జిందాబాద్, గరీబీ వర్ధిల్లాలి".
ఒకావిడ అర్దరాత్రి డాక్టరుకు ఫోన్ చేసింది.
"డాక్టర్! అర్జంటుగా మా ఇంటికి రావాలి!"
"ఎందుకు? ఏం జరిగింది?"
"మా రెండో పిల్లడు ఎయిర్ కూలర్ నట్టు మింగేశాడు"
"సరే- వస్తాను గానీ- నా ఫీజు రెండువేలవుతుంది! కట్టగలరా మరి?" అనుమానంగా అడిగాడు డాక్టర్.
ఆవిడ ఓ క్షణం ఆలోచించింది.
"వద్దులెండి! ఇంకో నట్టు కొనుక్కుంటే అర్ధరూపాయితో సరిపోతుంది-"
పేకాటలో బాగా పేరున్న కనకారావ్ కి ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు.
"నీకు మంచి స్టార్ ఉంది. అందుకని నీ లక్ రేసుల్లో కూడా టెస్ట్ చేసుకో! లక్షలు సంపాదించేయవచ్చు-"
దాంతో కనకారావ్ తెగపొంగిపోయి వెంటనే రేసుల్లోకి దూకాడు. కొద్ది రోజుల్లోనే ఉన్న ఆస్తంతా ఊడ్చిపెట్టుకుపోయింది.
ఫ్రెండ్సంతా షాకయ్యారు.
"అదేంటి? పేకాటలో అంత పవర్ ఫుల్ గా ఉన్న నీ స్టార్ రేసుల కొచ్చేటప్పటికి ఎందుకు పనిచేయటం లేదు" అన్నారు వాళ్ళు పజిలవుతూ.
కనకారావ్ చిరునవ్వుతో వాళ్ళ డౌటు తీర్చాడు.
"మన స్టార్ కేం ఢోకా లేదుగానీ- పేకముక్కల్నయితే మనక్కావలసిన లెవల్లో కలుపొచ్చు. కానీ ఆ రేసు గుర్రాలనలా కలిపి ఆడే ఛాన్స్ లేదు కదా! అక్కడ దెబ్బతిన్నామన్నమాట-"
ఎదురుగ్గా ఉన్న అపార్ట్ మెంట్స్ లో భార్యాభర్తలు చాలా రొమాంటిక్ గా సరససల్లాపాలాడటం కిటికీలో నుంచి రామానుజానికీ, వాళ్ళావిడకీ కనబడుతూనే ఉంది.
"ఆహా! అదీ రొమాన్సంటే! మొగుడంటే అంత శృంగార పురుషుడయి ఉండాలి! మీరేనాడయినా అంత రొమాంటిక్ గా ఉన్నారా?" అంది రామానుజం భార్య చిరాగ్గా.
"ఎందుకుండనే! ఆ ఎదురింటావిడని ఒకసారి మనింటికి తీసుకురా! నా తడాఖా ఏంటో చూపిస్తా-" అన్నాడు రామానుజం ఆవేశంగా.
అతని భార్యకు వళ్ళుమండిపోయింది.
"ఆవిడ్నిక్కడికి తీసుకొచ్చే బదులు నేనే వాళ్ళింటికెళ్తే థ్రిల్లింగ్ గా ఉంటుందేమో!" అంది కసిగా.
రామానుజం కిందపడ్డాడు.
ఓ సినిమా యాక్టర్ చాలా ఆలస్యంగా తన సెక్రటరీ తనను తెగ మోసం చేస్తున్నడన్న విషయం తెలుసుకున్నాడు. కానీ అకస్మాత్తుగా ఆ యాక్టర్ కి ఏదో జబ్బు చేయడంతో చనిపోతూ ఒక విల్లు రాశాడు.