ఏదో విషయంప్తె సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు.
అర్దరాత్రిఅయిందని కానీ.....తాము ఎంతో సేపటి నుంఛి మాట్లాడుకుంటూనే మాన్నామనికానీ గ్రహించే స్ధితిలో లేరు.
కాలం కరిగిపోతోంది.....
సరిగ్గా పన్నెండు గంటలకు-
ఒక పెద్ద మనిషి లేచి బయటకు నడిచాడు.
అతనికి వీడ్కోలు చెప్పడానికికన్నట్టు బయట ద్వారం వరకూ వచ్చాడతను.
ఆ పెద్దమనిషి కారులో కూర్చుని స్టార్టు చేశాడు.
కారు వెళ్ళిపోయింది.
ఒక్క క్షణం అతను భారంగా నిట్టూర్చాడు.
ఆ పెద్దమనిషి తన ఇంటికి వచ్చి వెళ్ళడం ఎవ్వరూ చూడలేదు కదా అన్నట్టు అటూ,ఇటూ తలతిప్పి చూశాడతను.
లోపలకు వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
అతను యూనివర్శిటి వ్తెస్ చాన్స్ లర్ !
అంత చీకట్లో సయితం రేడియం ల్తెట్లలా మిణుకుమిణుకుమంటున్నదృక్కులతో కనుమరుగ్తెన కారుని చూస్తూ.....గాల్లోకి ఎగిరింది ఓ రాబందు.
* * * *
సుధాకర్ గది.....
అతనితో పాటు మరో ముగ్గురున్నారు.
వాళ్ళముందు చిన్న టీపాయ్....,బీర్ బాటిల్స్ , రామ్ , షోడాలు పేర్చివున్నాయి.
అందరి చేతుల్లోనూ గ్లాసులు.....
అప్పటికే మూడు, నాలుగు రౌండ్లు అయిపోయాయి కాబోలు మాటలు ముద్దముద్దగా ,మత్తుమత్తుగా వస్తున్నాయి.
"సార్! నాదొక డౌట్" అన్నాడోకడు.
"ఒర్ అనిల్! నీకు సందేహాలు రానిది ఎప్పుడు? ఊ కానియ్! అదేదో చెప్పితగలడు" విసుక్కున్నాడు రెండోవాడు.
"నువ్వూరుకోరా రమేష్! ఊ చెప్పు....వాట్స్ యువర్ డౌట్ ?" అన్నాడు వెంకట్.
"లెక్చరర్ నీలిమ దెయ్యమ్తె వచ్చింది కదూ?"
అతని ప్రశ్నకు మిగిలిన ముగ్గురూ ఖంగుతిన్నారు.
"అనిల్! ఆమె దయ్యం అయిందనే విషయం నీకు ఖచ్చితంగా తెలిసినట్టుందే" ఎత్తిపొడిచాడు సుధాకర్.
"అదికాదు సార్! ఆమె నాకు కనిపించనప్పుడు అచ్చం దయ్యం ఎలా వుంటుందో అలా అనిపించి షాక్ తిన్నాను అదిగాక మూడు రోజుల వరకూ కనిపించకుండా వున్న తరువాత, యూనివర్శిటికి రావడం చూశాక నాకలాంటి అనుమానం కలిగింది."
"అంతమాత్రానికేనా?"
"అదొక్కటే కాదు....ఆమె వచ్చాక చెప్పిన సమాధానాలు....ఆమె ప్రవర్తన నాకెందుకో నమ్మబుద్దికావడం లేదు. లెక్చరర్ నీలిమ ఎంత అణకువగా వుండేదో ,ఎంత పొందికగా నడిచేదో....."
"అవును సార్! అనిల్ చెప్పేది అంతమంది స్టూందేంట్స్ వుంటే ప్రత్యేకంగా పనికకట్టుకుని మా ముగ్గురిని మాత్రమే తన చూపులతో భస్మం చేయలన్నట్టుగా వుంటుంది" మిత్రునికి పంతపాడాడు రమేష్.
ముగ్గురు చెప్పింది సాలోచనగా విన్న లెక్చరర్ సుధాకర్ భృకుటి ముడిపడింది.
"నీలిమ దెయ్యం అయిందంటే ఆమె చచ్చిపోయిందన్నమాటేగా?"
"అవును!"
ఠక్కున ముగ్గురూ బదులు పలికారు.
"అదే.... ఎలా? నిలిమను ఎవరు చంపారు? ఎలా చంపారు?" సుధాకర్ ఆవేశంతో రెట్టించాడు.
అప్పటికి మిత్రులు ముగ్గురూ తేరుకున్నారు.
"భలేవారే సార్! దెయ్యం అవ్వాలంటే చచ్చిపోతేనే కదా....లేకపోతే దెయ్యం ఎలా అవుతుంది? అలా ఆలోచించి చెప్పాం తప్పు ఆమెను ఎవరు చంపారో మాకెలా తెలుస్తుంది?" రమేష్ తెలివిగా చెప్పాడు.
సుధాకర్ చిరునవ్వు నవ్వాడు.
"మీరు చెప్పిన కథ నిజమని నమ్మంటారు నన్ను."
"సర్లెండి మీరు నమ్మొద్దు. మీరు మమ్మల్ని అడిగినట్టుగానే మేమూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా ?" చేతిలోని గ్లాసును ఖాళిచేసి టీపాయ్ మీద పెడుతూ అన్నాడు వెంకట్.
లెక్చరర్ సుధాకర్ గ్లాసులోని ద్రవాన్ని గొంతులోకి వంపుకుంటూ అడగమన్నట్టు తలవూపాడు.
"నిలిమకు ఏమ్తెందో మీకు తెలుసు."
సుధాకర్ కు పోరాపోయినట్టయింది.
"వాట్ డు యు మిన్?"
"ఆమె ఎలా దయ్యం అయింది మీకు తెలుసన్న విషయం మాకు తెలుసు" ఈసారి అనిల్ స్ధిరంగా చెప్పాడు.
"నో...."
"అబద్దం అని అరిచినంత మాత్రాన నిజంకాదు సార్! నీలిమ చావుకి మీరు కారకులు అని మేము నిరూపించగలము" వెంకట్ గ్లాసును నింపుకుంటూ విలాసంగా నవ్వుతూ అన్నాడు.
"స్టాపిట్!" సుధాకర్ గొంతు చించుకుంటూ అరిచాడు.
రెండు నిమిషాలు అందరిలో నూ మౌనం....
మరో రౌండ్ పూర్తయింది.
"మ్తె డియర్ స్టూడెంట్స్ !అసలు మనం యిక్కడ కలుసుకున్నది ఎంజాయ్ కోసం కానీ కీచులాటలకు వాదోపవాదాల కోసం కాదు....నీలిమ ఎలా చనిపోయిందనేది ఇప్పుడు అప్రస్దుకం . ఎవరు చంపారన్నది మన కానవసరం.